స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-44

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిరంతర ధ్యానంవలన గొప్ప శాంతి రూపమైన జ్ఞానాన్ని పొందగలరని ‘ఉరుజ్యోతిర్వివిదుర్ద్ధ్యీనాః’ అని వేదం కంఠోక్తంగా చెబుతూంది. ధ్యాన శబ్దానికి ఒక సామాన్యార్థం విచారణ చేయుట అని. ఏదేని పదార్థంలోని గుణ-దోషాలను పరిశీలించుటయే విచారణ. ఫలానా వస్తువు గ్రహించదగినది ఫలానా వస్తువు గ్రహింపరానిది అన్న వివేకమే విచారణగా చెప్పబడుతుంది. ఈ ప్రకారం స్వీకార్యమూ మరియు అస్వీకార్యమూ అన్న వివేకంతో అస్వీకార్యమైన దానిని విడిచి స్వీకార్య వస్తువును గ్రహించి దానిని తన దానిగా చేసికోవడమే ధ్యానం. అంటే ధ్యేయ వస్తువు (దేనిని ధ్యానిస్తున్నామో అది) మీద ఏ అఖండమైన చిరకాల విచారణ నిలిచి యుంటుందో అదే ధ్యానమని భావం. ఇట్టి ధ్యానానికి ఫలం అఖండమైన విద్యాప్రకాశమని వేదం చెబుతూంది. ధ్యాన నిష్ఠాగరిష్ఠులు తమ అనుభవం ద్వారా ఈ విషయానే్న సమర్థిస్తున్నారు. అట్టివారి లక్షణాలను ఈ మంత్రం ‘సుదినాః’మరియు ‘అరిప్ర’ అనే రెండు పదాల చేత నిర్వచించింది. మొదటి లక్షణం సుదినాః - ధ్యానుల దినచర్య పరిశుద్ధమై - నియమబద్ధమై యుంటుంది. రెండవ లక్షణం. అరిప్రః- పాపరహితంగా ఉంటుంది.
పాపమెన్ని విధాలుగా ఉంటుందో తెలుసుకోవడం ఈ సందర్భంలో అసందర్భం కాదు. వాత్స్యాయనముని తన న్యాయ భాష్యంలో దశవిధ పాపాలను ఇలా పేర్కొన్నాడు.
శరీరేణ ప్రవర్తమానః హింసాస్తేయప్రతిషిద్ధమైథునాన్యాచరతి,
వాచా- నృత పరుష సూచనా సంబద్ధాని,
మనసా పరద్రోహం పరద్రవ్యాభీప్సాం నాస్తికం చేతి,
సేయం ప్రవృత్తిరధర్మాయ॥ న్యాయభాష్యం. 1-1-2
శరీరంతో చేయబడే పాపాలు:- పరహింస, దొంగతనం, మైథునం వాక్కుతో చేయబడే పాపాలు:- అసత్య భాషణం, కఠినంగా మాట్లాడటం, చాడీలు చెప్పటం, అసందర్భ ప్రలాపాలు.
మనస్సుతో చేయబడే పాపాలు:- ద్రోహం, ధనాపహరణ, నాస్తికత, ధ్యానము పది పాపాలనుండి జీవులను విముక్తం చేస్తుంది. ఈ విషయానే్న ఋగ్వేదం ఇలా వివరించింది.
తే సత్యేన మనసా దీధ్యానాః స్వేన యుక్తాసః క్రతునా వహంతి॥ ఋ.7-90-5॥
‘‘మనస్ఫూర్తిగా ధ్యానంచేసేవారు సర్వకర్మలను నిష్కల్మషమైన జ్ఞానంతో నిర్వహిస్తారు’’అని స్పష్టపరచింది. అంటే ధ్యానపరుల మనో-వాక్కాయ కర్మయం దే దోషమూ ఉండదని తాత్పర్యం. అట్టివారి అజ్ఞానం నశించి పుణ్యాత్ములై యుంటారన్న విషయంలో సందేహం లేదు.
ఈ రీతిగా పాప విముక్తులుగానే గాక ధ్యాననిష్ఠుల కర్మలు మరియు ఆహార విహారాలు హేతుబద్ధంగా కూడ ఉంటాయని ఈ మంత్రం ‘స్వేన యుక్తాసః క్రతునా వహంతి’(ఋ.7-90-5) అని మరో లక్షణాన్ని తెలిపింది. ‘న హి కశ్చిత్ క్షణమపి జాతుతిష్ఠత్యకర్మకృత్’ ఏ కర్మయూ చేయక క్షణంకూడ ఎవడూ ఉండలేడన్న విషయం వారు బాగా గ్రహించినట్టివారు. అందుచేత ఏదో కర్మచేయడంగాక ఏ కర్మచేసినా తమ విధ్యుక్తకర్మగా భావించి హేతుబద్ధంగా చేయడం వారి స్వభావం.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు