స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మ హోతా బ్రహ్మ యజ్ఞా బ్రహ్మణా స్వరవో మితాః
అధ్వర్యుర్భ్రహ్మణో జాతో బ్రహ్మణోం-తర్హితం హవిః

బ్రహ్మస్తృచో ఘృతవతీర్ప్రహ్మణా వేదిరుద్ధితా
బ్రస్మయజ్ఞస్య తత్త్వం చ ఋత్విజో యే హవిష్కృతః. శమితాయ స్వాహా॥

బ్రహ్మయే హోత. బ్రహ్మయే యజ్ఞం. సర్వసృష్టికర్త బ్రహ్మయే. బ్రహ్మనుండియే అధ్వర్యుడు జన్మించాడు. బ్రహ్మచేతనే హవిస్సు ఆచ్ఛాదింపబడింది. నేతితో నిండిన సృక్కులు బ్రహ్మయే. వేదిని నిర్మించింది బ్రహ్మయే. యజ్ఞతత్త్వం బ్రహ్మయే. అందుచేత శాంతికోసం స్వాహా.
ప్రపంచ శాంతిదాయకమైనదే గొప్ప యజ్ఞం. ఆ యజ్ఞానికి హోత- అధర్వుడు. ఇతర ఋత్విక్కులు, బ్రహ్మయే కావాలి. అంతేకాదు. యజ్ఞ సంబంధ సర్వవిషయాలు బ్రహ్మయే కావాలి. యజ్ఞసాధనాలు, స్రుక్కు, స్రువం, వేదిక అన్ని బ్రహ్మమయం కావాలి. యజ్ఞతత్త్వసారం కూడ బ్రహ్మమయం కావాలి. ఈ విధంగా జరిగే యజ్ఞానికి శాంతిమయ స్వాహా అని వచించాలి. ఈ రీతిగా స్వాత్మీయమైన సర్వమూ బ్రహ్మార్పణం చేసి బ్రహ్మచేతిలో తానొక ఆయుధమైపోయిన యజ్ఞమే మహాయజ్ఞం. అంటే ఆ యజ్ఞానికి సర్వవిధాలకర్త బ్రహ్మయే కావాలి. ద్రవ్య యజ్ఞాలు ఇట్టి బ్రహ్మార్పణ యజ్ఞాలకు ప్రథమ సోపానాలు. ఇట్టి యజ్ఞాలలో యజ్ఞ్ఫలాన్ని ‘ఇదం న మమ’ ‘‘ఇది నా కొఱకు కాదు’’అని విశాల భావంతో ప్రధానంగా చెప్పాలి. ఏనాడు వాస్తవంగా ‘ఇదం న మమ’ అని చెప్పగలమో ఆనాడే బ్రహ్మయజ్ఞానికారంభం జరిగినట్లు కాగలదు.
***
కలల విరామంలో దైవధ్యానం చేయ
యత్స్నప్నే అన్నమశ్నామి న ప్రాతరధిగమ్యతే
సర్వ తదస్తు మే శివం నహి తద్ దృశ్యతే దివా
అథ. వే.710-101 -1
పర్యావర్తే దుష్వప్న్యత్పాపాత్స్వదభూత్యాః
బ్రహ్మాహమంతరం కృణ్వే పరాస్వప్నముఖాః శుచః
అథ.వే 70100-1
భావం:కలలో తిన్న అన్నం తెల్లవారి కనబడదు. మెలకువ దశళో కూడా కనబఢదు. స్వప్న ఫలితమంతా నాకు శుభకరమగు గాక.మంచి లేదా చెడు కలల వలన దోషం వలన మరియు అవమానాదుల వలన నేను విముక్తుడనగుచున్నాను.
కలల మధ్య సమయంలో భగవధ్యానం చేస్తాను. దానివలన స్వప్నాల వలన కలిగే దుఃఖాలను దూరంగా ఉంచుతాను.

- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512