స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వృద్ధులు వయస్సుచేత కావచ్చు. కాని జ్ఞానంచేత కాకపోవచ్చు. జ్యాయాన్ శబ్దం కేవలం వయస్సు చేత గాక జ్ఞానం చేత పెద్దవారన్న విశేషార్థంగలది. అంటే ఆ పదం జ్ఞానం చేత వృద్ధులే కలహాలవలన వేరుపడితే అనర్థం సంభవించగలదన్న సత్యాన్ని గ్రహించగలరన్న వేదార్థాన్ని సూటిగా ప్రకటించింది.
**
సమాన మనస్కత
సమానీ ప్రపా సహ వో-న్నభాగః సమానే యోక్త్రే సహ వో యునజ్మి
సమ్యంచో- గ్నిం సపర్యతారా నాభిమివాభితః॥ అథ.వే.3-30-6॥
సధ్రీచీనాన్వః సంమనసస్కృణోమ్యేకశుష్టీన్ సంవననేన సర్వాన్‌
దేవా ఇవామృతం రక్షమాణాః సాయంప్రాతః సౌమనసో వో అస్తు॥

భావం:- మీ చలివేంద్రం, మీ భోజనశాల ఒకటియే యగుగాక! మిమ్మందరిని ఏకీకృతంచేసి ఒకే త్రాటికి కట్టుతున్నాను. బండి కంటి ఆకులు బండి కంటికి ఏవిధంగా జోడింపబడి యుంటాయో ఆ రీతిగా మీరందరు ఒకే లక్ష్యం కలవారై భగవానుని పూజించండి.
ఇంద్రియాలు ఆత్మకు విధేయమై రక్షణగా ఉంటాయో అదే విధంగా మిమ్మందరిని కలుపుట ద్వారా మిమ్ము సమాన అన్న పానీయాలు కలవారిగా చేస్తున్నాను. మీ అందరిమధ్య ఉదయాస్తమానాలు సుమనస్కత లేదా సుహృద్భావం ప్రవృద్ధం చేయుగాక!
వివరణ:- ఆధునిక సమాజంలో ఆహార పానీయాలలోని భేదాలవలన జనులలో ఎన్నో భేదాలు ఏర్పడుతున్నాయి. భేదాలు రావడం అభిలషణీయం కాదు. అందునా ఆహార పానీయాలవల్లనే రావడం మరీ అభిలషణీయం కాదు. ఈ అంశాన్ని వేదం వేల ఏండ్లకు పూర్వమే గుర్తించి ‘సమానీ ప్రపా సహ వో అన్న భాగః’ ‘‘మీ చలివేంద్రం మరియు భోజనశాల ఒకటే అగుకాక’’ అని ప్రబోధించింది. అలా ఒకటి కావాలంటే మనుష్యుల మధ్య భేదభావాలు లేక ఒకే భావం ఉన్నప్పుడే కదా అది సంభవం. ఆ సమానభావాన్ని మీ యందు స్థిరపరస్తున్నానని వేదం మరో వచనంలో ‘‘హమానే యోక్త్రే సహ వో యునజ్మి’ ‘‘మిమ్మందరిని ఒకే త్రాటికి కట్టివేస్తున్నాను’’ అని దైవశాసనాన్ని విన్పించింది. అంటే ఏమిటి? బండి చక్రంలో ఇరుసునకు బండి కంటి ఆకులన్ని ఎలా జోడింపబడి యుంటాయో అలా మీరందరూ ఒకే లక్ష్యానికి కట్టుబడి యుండండని వేదవచన ఆంతర్యం.
- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512