స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్ఞానానికి ఫలమదేకదా. భేదాభిప్రాయాలు, కలహాలు, విద్వేషాలు, రగిలించేది జ్ఞానంకాదు. అది అజ్ఞానమో మిథ్యాజ్ఞానమో అవుతుంది.
ప్రేమకు ప్రమాణం మధుర భాషణమే. ‘నాచం వదత భద్రయా’ (అథ.3-30-3) ‘‘ప్రీతికరంగా మాటలాడు’’మని అథర్వణవేదం చెప్పింది అందుకే. అథర్వణ వేదమే మరో సందర్భంలో ‘వాచం జుష్టాం మధుమతీమవాదిషం దేవానాం దేవహూతిషు’ (అథ.వే.5-7-4) ‘‘దేవతాహ్వాన సమయంలో ప్రీతితో మధురంగా పలుకుతాను’’అని వాక్ప్రియత్వాన్ని పునరుద్ఘాటించింది.
‘సంజ్ఞానం బ్రహ్మ’. ‘‘ఏకత్వాన్ని ప్రబోధించే జ్ఞానం నిజంగా మనిషిని మహోన్నత శిఖరానికి చేర్చుతుంది’’ వీనికి భిన్నంగా పలికే మాటలు మనిషిని మృత్యుముఖంలోనికి నెట్టుతాయి. ఈ మాట ‘మా జ్ఞాతారం మా ప్రతిష్ఠాంచి దంత మిథో విఘ్నానా ఉపయంతు మృత్యుమ్’ (అథ.వే.6-32-3) ‘‘పరస్పరం కొట్లాటలను రేపేవాడు పరిచయస్థుడిని కాదుగదా గౌరవాన్ని పొందక మృత్యువునే పొందుతాడు’’అని అథర్వణవేదం చెప్పినదే.
ఎవరికైనా వారు ఇతరుల గౌరవాన్ని కాపాడితేనే వారికి గౌరవ మినుమడిస్తుంది.
‘సం వః మృచ్యంతాం తన్వం సం మనాంసి సము వ్రతా’ (అథ.వే.3-74-2) ‘‘మీరు శారీరకంగా కలిసిమెలసి ఉంటే మీ మనస్సులు, సంకల్పాలు, ఉద్దేశ్యాలు ఒకటి అవుతాయి.’’ అప్పుడే మీ ప్రతిష్ఠ సమాజంలో ప్రతిష్ఠిత మవుతుంది. అలా కావడానికి భగవత్సంకల్పమే సహకరిస్తుందని అథర్వణవేద మీ విధంగా వచిస్తూంది.
సంజ్ఞపనం వో మనసో- థో సంజ్ఞపనం హృదః
అథో భగస్య యచ్ఛ్రాంతం తేన సంజ్ఞపయామి వః॥ (అథ.వే.6-74-2) ‘‘మీ మనస్సులో ఏ కర్మతో సంజ్ఞాపనం= జ్ఞానం కలుగుతుందో అలాగే మీ హృదయానికి, మనస్సుకు ఆధారభూతమైన సమాజజ్ఞానాన్ని కల్పిస్తున్నాను. మరియు ఐశ్వర్యాన్ని పొందేందుకు ఏ పరిశ్రమ ఉందో దానిచేతనే మిమ్ము జ్ఞానయుక్తులను చేస్తున్నాను’’ కాబట్టి కుటుంబపరంగా గాని సామాజికపరంగా గాని సంపదను పెంచాలంటే సమష్టి కృషి అవసరం. అప్పుడే కృషి సాఫల్యమవుతుంది. లోకంలో సమస్త దుఃఖాలకు మూలకారణం విపరీత జ్ఞానమో లేదా మిథ్యా జ్ఞానమో అయి యుంటుంది. ఈ రెండూ సంజ్ఞానం సుజ్ఞానంచేతనే అంతరిస్తాయి. అందుచేత సజ్జనులు జ్ఞానార్జనయందు మరియు జ్ఞానదానంలో నిమగ్నమై యుంటారు.
**
ఏకత్రాటి మీద నడిచి ప్రియంగా పలకండి
జ్యాయ స్వంతశ్చిత్తినో మా వి ష్ట సంరాధయంతః సధురాశ్చరంతః
అన్యో అన్యస్మై నల్గు వదంత ఏత సధ్రీచీనాన్వః సంమనసస్కృణోమి॥
అథ.వే.3-30-5॥
భావం:- పెద్దలు, విచారణాశీలురై ఏకాభిప్రాయంతో కార్యసిద్ధి సాధకులై యుండి ఒకే కాడికి కట్టబడినవారై (ఏక లక్ష్యసాధకులై) యుండి నడుస్తూ హఠాత్తుగా వేరుపడిపోయి విరుద్ధంగా ప్రవర్తించవద్దు. మీలో మీరు మనోహరంగా, ప్రియంగా పలుకరించుకొంటూ మీరు ముందుకు నడవండి. సమాన మనస్సులు కల మిమ్ము ఉత్తమ ప్రవర్తన కలవారిగా నేను తీర్చిదిద్దుతున్నాను.
వివరణ:- ఈ మంత్రంలో ప్రధాన సందేశం ‘మా విష్ట సం రాధయంతః స ధురాశ్చరంతః’.
‘‘కార్యసిద్ధి తత్పరులైన మీరు సమాన భారాన్ని వహిస్తూ కార్యం భారం కావడంచేత వేరుపడకండి’’అని వైరం వేర్పాటుతనాన్ని పెంచుతుంది. వేదం వేర్పాటుతనాన్ని ఖండిస్తూ దానికి మూలమైన వైరానికి దూరంగా ఉండాలని ప్రబోధిస్తూ స ధురాశ్చరంతః ‘‘ఒకే కాడికి కట్టబడి యుండండి’’ అన్న ఉపమానాన్ని చెప్పింది. పొలం దునే్నందుకో- బండి లాగేందుకో ఒకే కాడికి కట్టబడిన రెండు ఎడ్లు భారాన్ని సమానంగా లాగుతూ ఐకమత్యంగా నడవాలి గాని కలహించుకొని అని వేరువేరుదారుల వెంట పోతే ఏవౌతుందో? ఉపమానంగా చూపి ఏకలక్ష్యంతో నడిచేవారు కలహించుకొని వేరుపడితే కార్యసిద్ధి జరుగదని వేదం సానునయంగా ప్రబోధించింది.
ఆలోచనాపరులు కానివారు దీనిని గ్రహింపలేక ‘గతానుగతికో లోకః’ అన్న చందంగా ప్రవర్తిస్తుంటారు. కాబట్టి దీనిని వేదం ‘చిత్తినః’ విచారణ శీలురే గ్రహించగలరని పేర్కొంది. మరి విచారణ శీలత ఎలా లభిస్తుంది? వృద్ధులు అనగా పెద్దల సాంగత్యంవల్ల వస్తుంది. ‘జ్యాయస్వంతః’ ‘పెద్దవారు’అన్నమాటను వేదం అందుకే ఉపయోగించింది. పెద్దలకు సమాజంలో చాలాపెద్ద స్థానముంది. ‘న సా సభా యత్ర న సంతి వృద్ధాః వృద్ధా న తే యే న వదంతి సత్యమ్’ (విదురనీతి 3-58) ‘‘పెద్దలు లేని సభ సభే కాదు. సత్యాన్ని పలుకకుంటే వారు పెద్దలేకాదు’’అని విదురుడు చెప్పిన మాటనుబట్టి పెద్దలెంత ముఖ్యమైనవారో అర్థమవుతుంది. ఇక్కడి మంత్రంలో వృద్ధ శబ్దాన్ని కాక ‘జ్యాయాన్’ శబ్దం ప్రయోగించబడింది. వృద్ధశబ్దంకంటె ఈ జ్యాయాన్ శబ్దం చాలా విశిష్టమైనది.

- ఇంకా ఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512