స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
‘గృహ్ణంతి జానంతి యేన తత్ గృహమ్’ దేనిద్వారా సర్వమూ గ్రహింపబడి తెలుసుకొనబడతాయో అది గృహమని గృహశబ్ద నిర్వచనం. అంతఃకరణాలు విషయాలను గ్రహిస్తాయి. జ్ఞానాన్ని పొందుతాయి. కాబట్టి అంతఃకరణాలే గృహం.
**
జెండా పైపైకి ఎగురనీ
ఆదిత్యా రుద్రా వసవః సునీథా ద్వావాక్షామా పృథివీ అంతరిక్షమ్‌
సజోషసో యజ్ఞమవంతు దేవా ఊర్ధ్వం కృణ్వన్ త్వధ్వరస్య కేతుమ్‌॥
భావం:- ధర్మస్వరూపులైన ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్ట వసువులు విశాలమైన భూమ్యాకాశాలు, అంతరిక్షం, పరోపకారులగు విద్వాంసులు పక్షపాత రహితమైన ప్రీతిభావంతో యజ్ఞాన్ని రక్షింతురు గాక! యజ్ఞసంబంధమైన జెండాను ఉన్నతంగా ఎగురునట్లు చేయుదురు గాక!
వివరణ:- పతాకమన్నది జాతులు చిరకాలంగా సముపార్జించుకొన్న ఉదారమైన ధార్మిక, సామాజిక, జాతీయ దేశీయ భావనలకు ప్రతీక. జాతులు తమ జెండాను జీవించినంతకాలం కాపాడుకొంటూనే ఉంటాయి. ఆర్యజాతులలో పతాకంమీద ఎంత అభిమానమంటే ప్రతి కుటుంబం తమ జాతి పతాకాన్ని తమ యింటిపైన ఎగిరే విధంగా చేసుకొంటారు. ఆర్య జాతులు తమ గృహప్రవేశ మహోత్సవాలలో గృహప్రధాన ద్వారం ఎదుట ధ్వజావిష్కరణ జరుపుతారు. ధర్మశాస్తక్రారుడైన పారస్కరుని-
‘ఓం అచ్యుతాయ భౌమాయ స్వాహా’ (పా.3-4-3) అన్న వచనాన్ని ప్రమాణంగా చేసుకొని దయానంద మహర్షి ఇలా పేర్కొన్నారు.
‘‘ఆహుతులు ముగిసిన పిమ్మట పతాకం కట్టబడిన ధ్వజస్తంభాన్ని ఇంటి ముంగిట స్థాపించి ఇంటికప్పుపై నాలుగుమూలలలో జెండాలను నిలబెడతారు’’ (సంస్కార విధి శలాకర్మ విధి).
పారస్కరుని వచనంలో అచ్యుత శబ్దముంది. తన స్థానంనుండి పడిపోవనిది అని దాని అర్థం. అంటే పతాకం తన స్థానమైన ఉన్నతినుండి నేలకు జారిపడరాదని భావం. వేదం కూడ ‘ఊర్ధ్వం కృణ్వన్ ద్వంధ్వరస్య కేతుమ్’ ‘‘యజ్ఞ పతాకాన్ని ఉన్నతంగా ఉంచు’’మని హెచ్చరిస్తూంది. దీనినిబట్టి ఆర్యుల పతాకం యజ్ఞపతాకమే. దీనిని ఉన్నతంగా ఉంచి ఎగిరే విధంగా చూడటం కూడ ఒక యజ్ఞమే. యజ్ఞసంరక్షణ ఒక్కరి బాధ్యత కాదు. అందరిది. ఒక్క మానవులదే కాదు. సమస్తమైన దేవతలది కూడ. అందుకే ‘ఆదిత్యా రుద్రా....యజ్ఞ మవంతు’’ ‘‘ఆదిత్యులు, రుద్రులు, వసువులు, ద్యావాపృథువులు, అంతరిక్షం, విద్వాంసులు యజ్ఞాన్ని రక్షించాలి’’అని వేదం నిర్ద్వంద్వంగా చెప్పింది. దేవతల చేతనే పవిత్రంగా భావింపబడి రక్షణ బాధ్యత వహింపబడుతున్న పతాక సంరక్షణ విషయంలో మానవులెంత జాగరూకులై యుండాలో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరముందా? వేదం యజ్ఞపరిభాషలో చెప్పిన పతాక సంరక్షణ జాతీయ పతాకానికి కూడ ఉపలక్షకంగా భావించాలి. అది మనిషిగా ప్రతివ్యక్తి ధర్మం.
పతాక సంరక్షణయే ఆత్మరక్షణ, పతాక గౌరవమే ఆత్మగౌరవంగా ప్రతి వ్యక్తి భావించాలి. ఈ భావనయే స్వజాతి ఎడల, స్వజాతి స్వాతంత్య్రం ఎడల ప్రతివ్యక్తీ చేసే వందనం-అభివందనం.
***
కుటుంబ సభ్యుల్ని ప్రేమించు
సహృదయం సాంమనస్యమివిద్వేషం కృణోమి వః
అన్యో అన్యమభి హర్యత వత్సం జాతమివాఘ్న్యా॥ 1॥
అనువ్రతః పితుః పుత్రో మాత్రా భవతు సంమనాః
జాయా పత్యే మధుమతీం వాచం వదతు శంతివామ్‌॥
2॥
మా భ్రాతా భ్రాతరం ద్విక్షన్మా స్వసారముత స్వసా
సమయంచః సవ్రతా భూత్వా వాచం వదత భద్రయా॥
3॥
(అథ.వే.3-30-1 నుండి 3వరకు)
భావం:- మీకు సహృదయత, ఏక మనస్కత, విరోధ రాహిత్యాలను విధిస్తున్నాను. ఆవుదూడను ప్రేమించే విధంగా మీలోమీరు ప్రేమించుకోండి. కుమారుడు తండ్రిని అనుసరించాలి. తల్లితో సమాన మనస్కత కలిగి యుండాలి. భార్య భర్తతో మధురమైన, శాంతియుతమైన సంభాషణ చేయాలి. సోదరుడు సోదరీ సోదరులను ద్వేషించరాదు.
- ఇంకాఉంది