స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ విధంగా ఋగ్వేదం 10వ మండలంలోని 191వ సూక్తంలోని మంత్రాలు సర్వమానవ సమైక్యాన్ని ప్రబోధిస్తున్నాయి. బ్రహ్మతత్త్వంనుండి మానవ సమైక్యం వరకు సమస్త విషయాలను ప్రబోధించేది ఋగ్వేదం. అందుకే ప్రపంచ సాహిత్యంలో అగ్రతాంబూలాన్ని అందుకొంది.
**
జీవితమే ఒక యజ్ఞం
ఆయుర్యజ్ఞేన కల్పతాం స్వాహా ప్రాణో యజ్ఞేన కల్పతాం స్వాహా
అపానో యజ్ఞే కల్పతాం స్వాహా వ్యానో యజ్ఞేన కల్పతాం స్వాహా
ఉదానో యజ్ఞేన కల్పతాం స్వాహా సమానో యజ్ఞేన కల్పతాం స్వాహా
చక్షుర్యజ్ఞేన కల్పతాం స్వాహా శ్రోత్రం యజ్ఞేన కల్పతాం స్వాహా
వాగ్యజ్ఞేన కల్పతాం స్వాహా మనో యజ్ఞేన కల్పతాం స్వాహా
ఆత్మా యజ్ఞేన కల్పతాం స్వాహా బ్రహ్మా యజ్ఞేన కల్పతాం స్వాహా
జ్యోతిర్యజ్ఞేన కల్పతాం స్వాహా స్వర్యజ్ఞేన కల్పతాం స్వాహా
పృష్ఠం యజ్ఞేన కల్పతాం స్వాహా యజ్ఞో యజ్ఞేన కల్పతాం స్వాహా॥ ॥
భావం:- స్పష్టమే.
వివరణ:- వైదిక ధర్మం యజ్ఞ ప్రధానమైనది. జీవితంలోని ప్రతి కార్యకలాపంలో యజ్ఞం పెనవేసుకొని పోవాలనే ఆకాంక్ష ఈ మంత్రంలో ఆవిష్కరింపబడింది. అంతేగాక యజ్ఞ సాఫల్యం యజ్ఞం వలననే సిద్ధించాలనే అభిలాష ప్రకటింపబడింది.
ప్రథమంగా ఆయువు యజ్ఞం చేతనే సాఫల్యసిద్ధి పొందాలన్న కామన మంత్రారంభం- లోనే ప్రకటింపబడింది. అంటే సమస్త జీవితమూ యజ్ఞ రూపంగా సాగాలని దీని అంతరార్థం. ఆయువు తరువాత పంచప్రాణాలు యజ్ఞం వలన పరిపుష్టం చెందాలనే ప్రార్థన ఈ మంత్రంలో కనబడుతుంది. ప్రాణాలు ఐదు. ఈ ఐదు శరీరంలో అంతటా వ్యాపించి వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తాయి.
ప్రాణం- ముక్కు రంధ్రం ద్వారా లోపలకు పీల్చే వాయువు- ప్రాణం. అపానం- గుదస్థానం నుండి బయటకు వెలువడు వాయువు- అపానం - ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512