స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-133

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ కారణంచేతనే వేదాన్ని కణాదుడు ‘తద్వచనా దామ్నాయస్య ప్రామాణ్యమ్’ వేదం ఈశ్వరప్రోక్తమైన వచనం కాబట్టి పరమ ప్రామాణికమైనదని చెప్పాడు.
వేదమంతా ప్రధానంగా భగవత్‌స్తోత్ర సముదాయం. అంతేకాక వేదంలో గడ్డిపరకనుండి బ్రహ్మపర్యంతమూ సర్వపదార్థాల స్తుతి, గుణ, గాథలు వివరించబడ్డాయి. ఉదాహరణకు జీవులపరంగా వేదం ‘అపశ్యం గోపామని పద్యమానమ్’(శు.యజు.వే.31-17) ‘‘నేను అవినాశి మరియు ఇంద్రియాలకు ప్రభువైన వానిని చూసాను’’అని పేర్కొంది. ఇంద్రియాలకు భిన్నంగా ఆత్మను శాశ్వతమైనదిగా వేదం చెప్పింది. ఇదే విధంగా పరమాత్మ సంబంధంగా ‘వేదాహమేతం పురుషం మహాంత మాదిత్యవర్ణం తమసః పరస్తాత్’(శు.యజు.వే. 31-18) ‘‘నేను సూర్యాది నక్షత్ర మండలాలను ప్రకాశింపచేసే అజ్ఞానాంధకార రహితమైన సర్వవ్యాపకుణ్ణి చూచాను’’అని వేదం పేర్కొంది. ఇలాగే ప్రకృతి నిరూపకంగా వేదమిలా వర్ణించింది.
ఏషా సనత్నీ సనమేవ జాతైషా పురాణీ పరి సర్వం బభూవ(అథ.10-8-30)
‘‘నిత్యమూ ఉండే ఈ ప్రకృతి ఎప్పుడూ ఉంటుంది. ఇది చాలా పురాణీ= ప్రాచీనమైనదయినా సమస్త నూతన పదార్థాలలో నూతన రూపమై యుంటుంది.’’
ఈ రీతిగా జీవితోపయోగియైన సకల పదార్థాల మరియు విషయాల జ్ఞానం వేదం మనకనుగ్రహించి మిక్కిలిగా శాంతిని ప్రదానంచేస్తూ ఉంది. వేదాలు ప్రతిపాదించిన జ్ఞానం భగవద్విభూతియే కాబట్టి భగవద్దర్శనం చేత ముఖ్యంగా శాంతి లభిస్తుంది. ఈ విషయంలో కఠోపనిషత్తు క్రింది విధంగా చెబుతూంది.
ఏకో వశీ సర్వభూతాంతరాత్మా ఏకం రూపం బహుధా యఃకరోతి
తమాత్మస్థం యే- నుపశ్యంతి ధీరా స్తేషాం సుఖం శాశ్వతం నేతరేషామ్‌॥
నిత్యో- నిత్యానాం చేతనశే్చతనానా మేకో బహూనాం యో విదధాతి కామాన్
తమాత్మస్థం యే- నుపశ్యంతి ధీరా స్తేషాం శాంతిః శాశ్వతీ నేతరేషామ్- 13
(కఠ.2-5-12, 13)
భావం:- ఎవడు సర్వ పదార్థాలలో ఆత్మస్వరూపంగా ఉంటున్నాడో, ఎవడు సమస్త చరాచర జగత్తును నియంత్రిస్తున్నాడో, ప్రకృతి రూపమైన ఒకే బీజాన్ని బహువిధాలుగా ఎవడు సృజిస్తున్నాడో, ఏ ధ్యానులు తమ ఆత్మలలో ఉండే పరమాత్మను దర్శిస్తున్నారో వారికి మాత్రమే శాశ్వతానందం లభిస్తూఉంది. ఆ ఒక్కడే నిత్యులలో నిత్యుడు, చేతనులకు చైతన్యప్రదాతయై సర్వజీవుల అభీష్ఠాలను సంపూర్ణం చేస్తున్నాడు. ఆత్మస్థితుడై ఉన్న ఆ దైవాన్ని ఏ ధీరులు దర్శిస్తారో వారికి మాత్రమే అఖండానందం లభిస్తూంది.
నిజమే. పరమాత్మ దర్శనం చేతనే పరమశాంతి లభిస్తుంది. కాని పరమాత్మ సంబంధమైన జ్ఞానం కేవలం వేదంవలననే లభిస్తుంది. ఈ యభిప్రాయంతోనే తైత్తిరీయోపనిదృషి ‘నా వేదవిన్మనుతే తం బృహతతమ్’ (తై.ఉ.3-12-97) ‘‘వేద జ్ఞానం లేనివాడు భగవానుని ధ్యానింపలేడు’’అని స్పష్టంగా చెప్పాడు. కాబట్టి వేద శ్రవణం, అధ్యయనం, మననం, చింతనం, ధారణం ఇవన్నీ పరమశాంతిని కోరుకోనేవాని ముఖ్య కర్తవ్యాలు. ఈ భావంతోనే ఈ మంత్రంలో- హృది స్పృక్= అనే పదం ప్రయోగింపబడింది అంటే వేద మంత్రాలు కేవలం నోటితో పలకబడటం కాదు అవి హృదయాన్ని స్పృశించి స్పందింపచేసే విధంగా పఠింపబడాలి. అలా ఎందుకు అన్న విషయాన్ని వివరిస్తూ ‘ఋచో అక్షరే పరమే వ్యోమన్’ (ఋ. 1-164-39) సర్వవ్యాపకుడు, అవినాశి అయిన పరమాత్మ జ్ఞానాన్ని కలిగించేందుకే పరమాత్మను వర్ణించిందని వేదం స్పష్టంగా సమాధానమిచ్చింది. ఈ విధంగా సర్వోన్నతమైన- ప్రప్రథమమైన వేద విజ్ఞానాన్ని హృదయ స్పర్శగా అధ్యయనం చేసి- ‘అథా సోమం సుతం పిబ’ అప్పుడు వేద నిష్ఫాదితమైన సోమాన్ని అనగా జీవితైశ్వర్యాన్ని సంపూర్ణంగా అనుభవించమని వేదం సదుపదేశం చేస్తూంది.
ఈ విధంగా చెప్పడంద్వారా వేదం మరో మహార్థాన్నికూడ ఆవిష్కరించింది. అదేమంటె- ముందు జ్ఞాన సముపార్జన. తదుపరి కర్మాచరణ అన్నది. జ్ఞాన సముపార్జన లేనిదే కర్మాచరణ సాధ్యంకాదు కదా. అందుచేత ఈ సందర్భంలో కర్మ-జ్ఞానాలలో జ్ఞానమే మొదటిది- ప్రధానమైనదన్న వేదాంత సూత్రం వ్యక్తీకరింపబడింది.
దీనినిబట్టి మానవులారా! ముందుగా పదార్థ విజ్ఞానాన్ని తెలిపి తదుపరి కార్యాచరణ చేసేందుకే వేదం మీకు భగవంతుని చేత ఈయబడింది. కాబట్టి వేదాధ్యాయనం ద్వారా జ్ఞాన సముపార్జనచేసి దానిని అనుష్ఠించి జీవిత సాఫల్యాన్ని పొందండి.

ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు