స్వాధ్యాయ సందోహం
స్వాధ్యాయ సందోహం--23
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
ఎందుకంటె తెలిసి తెలిసి దుఃఖ కారణాలను అనుసరించరు కదా. జ్ఞానుల సాంగత్యం వలననే అజ్ఞానం తొలగిపోగలదు. అందుకే భగవదుపాసనావిధిని బ్రహ్మణస్పతి విధించాడు.
సజ్జన సాంగత్యం మరియు ఉపాసన రెండూ ఒకటే అంటే సజ్జనుల చెంతనే ఉండుట. సాంగత్యమంటే సజ్జనుల వెంట నడచుట. రెండింటిలో కలిసియుండటం సమానం. భగవంతుని కంటె జ్ఞాని ఎవరు? అందుకే ఆయన చెంతనే ఉండుట. ఆయనతో సాంగత్యం చేయగల ఉపాసన శ్రేయోదాయకం.
ఇంటి ఆవు మహిమ
స్వ ఆ దమే సుదుఘా యస్య ధేనుః స్వధాం పీపాయ సుభ్వన్నమత్తి
సో అపాం నపాదూర్జయన్నప్స్వ న్తర్వసుదేయాయ విధతే వి భాతి॥
ప్రతిపదార్థం:- యస్య= ఎవని; స్వే ఆ దమే= స్వగృహంలో; సుదుఘా= సులభంగా పాలను వర్షించే; ధేనుః= పాల సమృద్ధిగల ఆవులు ఉంటాయో; సః= అతడు (అధ్యాహారం); స్వధామ్= తన శక్తిని; పీపాయ= పెంపొందించుకొంటాడు; సుభు= రుచికరంగా ఉండే; అన్నమ్= ఆహారాన్ని; అత్తి= భుజిస్తాడు; సః= అతడు; అపామ్+నపాత్= జీవశక్తిని వృద్ధిపరచి; అప్సు+అంతః= నీటిలో ఉండే; అపామ్+నపాత్= విద్యుత్తుతో సమానంగా; ఊర్జయన్= బలసంపన్నుడు కాగలడు; వుసదేయాయ= విద్య- జ్ఞాన ధనాలనిచ్చే; విధతే= మేధావికి; విభాతి= శక్తినిస్తుంది.
భావం:- ఎవని గృహంలో సులభంగా పాలనిచ్చే పాల సమృద్ధిగల ఆవులుంటాయో అతడు తన శక్తిని బహుధా పెంపొందించుకోగలడు. రుచికరంగా ఉండే ఆహారాన్ని భుజించగలడు. నీటిలో ఉండే విద్యుత్తువంటి జీవశక్తిని వృద్ధిపరచుకొని బలసంపన్నుడు కాగలడు. విద్యా-జ్ఞాన ధనాలనిచ్చే గొప్ప మేధాశక్తిని పొందగలడు.
వివరణ:- వేదాల ఉపదేశరీతి విలక్షణమైనది. ఆదేశ రూపంగా, నిషేధ రూపంగా. ప్రార్థనారూపంగా, కర్తవ్య- అకర్తవ్యరూపంగా మరియు సత్యప్రకటన రూపంగా ఇలా అనేక పద్ధతులుగా వివిధ సందర్భాలలో వేదం వక్తవ్యాంశాలను బోధిస్తూ ఉంటుంది. ఈ మంత్రంలో చెప్పబడిన విషయం నిన్న-నేడు-రేపు కూడ యథార్థమైనట్టిదే. కాబట్టి వేదోపదేశం ఏదో ఒక సమయానికి పరిమితమైనది కాదు. త్రికాలాలలో సత్యమైనది.
మహోన్నతమైన గోమహిమను గురించి అధర్వణవేదమీ విధంగా పేర్కొంది.
త్రయః పోషాస్ర్తీవృత్తి శ్రయంతామనక్తు పూషా పయసా ఘృతేన:
అన్నస్య భూమా పురుషస్య భూమా భూమా
పశూనాం త ఇహ శ్రయంతామ్॥ అథర్వణ. 5-28-3.
భావం:- ‘అన్నసమృద్ధి, పురుష సమృద్ధి మరియు పశుసమృద్ధి’అని మూడు సమృద్ధులీ లోకంలో ప్రసిద్ధంగా ఉన్నాయి. పశుసమృద్ధి గలవాడే పాలు-పెరుగు- నేతుల సమృద్ధికలవాడు. మరి ఆ పాలు- పెరుగు-నేతులెక్కడినుండి వస్తాయి? పశువులనుండే కదా! పశువులలో ఆవు శ్రేష్ఠమైనది. అందుకే ఆవుపాలు, నెయ్యి అందరిచేత ఉత్కృష్టమైనవిగా ఆదరింపబడుతున్నాయి. వేదాలలో గోమహాత్మ్యమిందుకే బహుధా ప్రశంసింపబడింది. అథర్వణవేదం ‘గావో భగో గావ ఇంద్రోమే’ (అథర్వ. 4-21-5) ‘ఆవులే నా భాగ్యం-ఆవులే నా ఐశ్వర్యం’ స్తుతించారు.
*