రాష్ట్రీయం

చెరకు కొనుగోలుకు ఫ్యాక్టరీల అంగీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 26: బోధన్, మెట్‌పల్లి, మెదక్ చక్కెర ఫ్యాక్టరీల పరిధిలోని చెరుకును సమీపంలోని గాయత్రి షుగర్స్(కామారెడ్డి)గాయత్రి షుగర్స్ ( నిజాంసాగర్), గణపతి షుగర్స్( సంగారెడ్డి)లు కొనుగోలు చేయడానికి అంగీకరించాయి. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చెరుకు కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు ఆందోళనకు దిగడంతో మంత్రి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. టన్నుకు 2600 రూపాయలు చెల్లించేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యాలు అంగీకరించాయి. చెరుకు రైతులు తమ సమీపంలోని ఫ్యాక్టరీలను సంప్రదించి చెరుకు తరలించాలని మంత్రి తెలిపారు. సచివాలయంలో గురువారం జరిగిన సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు షకీల్, విద్యాసాగర్‌రావు, డైరెక్టర్ ఆఫ్ షుగర్ భద్రు మాలోతు, గాయత్రి షుగర్స్ ఎండి సరితారెడ్డి, ప్రతినిధులు పాల్గొన్నారు.