సబ్ ఫీచర్

నకార దృక్పథ భారత రచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాభారత చరిత్రము
రచయిత: పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్ర్తీ,
పుటలు: 292; వెల: రూ.250/-
ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌హౌస్,
విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు, తిరుపతి, కాకినాడ, ఒంగోలు,
శ్రీకాకుళం, కడప, విజయనగరం.
తన శోధనే సత్యమతము;
తన తలపే తర్కశాస్త్ర దార్ఢ్యశ్రీయున్;
తన భావనె సిద్ధాంతము;
తన భాష్యమ్మే అవక్రతా సహితమున్
*
- అనే ఆలోచనా ధోరణిలో పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్ర్తీగారు 1928లో వితండావాద మార్గంలో ‘మహాభారత చరిత్రము’ అనే ఒక వివాదాస్పద వ్యాసావళిని రచించారు. దాని తృతీయ ముద్రణ ఈ సంవత్సరం జనవరిలో జరిగింది. కీ.శే. మునిమాణిక్యం నరసింహారావుగారు వివిధ వాదనా పద్ధతులు అంటూ రాసిన పుస్తకంలో వితండావాదం, దబాయింపు మొదలైన కొన్నిటికి ఈ పుస్తకం ఒక ఉదాహరణ.
‘‘ద్రౌపదికి వస్త్రాపహరణం జరగనే లేదు. కృష్ణుడు వలువలు అందించనూ లేదు. ద్రౌపది ఏకవస్త్ర (రజస్వల) కానే కాదు. అలా నాటకం ఆడింది. ధర్మరాజే అలా ఆ మాయోపాయం చెప్పాడు కౌరవులను దుర్మార్గులుగా, సంస్కార హీనులుగా, కర్కశులుగా జనం అనుకునేట్టు చేయటానికి (61వ పుట నుంచి 64వ పుట వఱకు); భారత యుద్ధకాలం క్రీ.పూ.2000-1500 మధ్య మాత్రమే (4వ పుట); అసల పూనిత అనే రాక్షసే లేదు. అది బాలారిష్ట దశలో సాధారణంగా పిల్లలకు వచ్చే ఒక రోగము (55, 56వ పుటలు)- ఇలా వందకు పైగా వైకృతులను, వక్రీకరణలను తనదైన నకారాత్మక అధ్యయన- వివరణ- వ్యాఖ్యానాల పుట్టగా ఈ పుస్తకం రూపొందించుకున్నారు సుబ్రహ్మణ్యశాస్ర్తీగారు.
ఈ పుస్తకం మీద అభిప్రాయం రాసిన శ్రీ పండిత సీతానాథ తత్త్వ భూషణ రాయ్‌గారే ఇందులోని తీర్మానాలు, ప్రతిపాదనలు, నిర్ణయాలతో పూర్తిగా ఏకీభవించలేదు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.ఎస్.హెక్థేంకర్, డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి గారలు శాస్ర్తీగారి పరిశోధనా పరిశ్రమ, కృషిని మెచ్చుకున్నారే గాని అందులోని ప్రతిపాదితాంశాల ప్రామాణికతను గూర్చి ఏమీ చెప్పలేదు (జ పుట నుంచి జజజ వఱకు). మహాభారత యుద్ధం క్రీ.పూ 2000-1500 మధ్య జరిగింది అనే ఈ పెండ్యాల వారి వాదం ఎప్పుడో రెండు వందలేండ్ల కిందటి ఆంగ్ల విద్యావేత్తల తల తోక లేని రాతల ఫలితం.
క్రీ.పూ. 3101-02 ప్రాంతంలో కలిశకం ప్రారంభం అయింది. కలిశక గణన క్రీ.పూ. 3102 ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభమైంది అని ఇటీవలి పాశ్చాత్య విద్వాంసులూ అంగీకరించారు. దీనికి 36 ఏళ్ళముందు- అంటే- క్రీ.పూ. 3138లో మహాభారత యుద్ధం జరిగింది. మహాభారత యుద్ధకాలంలో పరీక్షిత్తు జన్మించే నాటికి సప్తర్షి మండలం (ఇంగ్లీషులో ద్గిఉ ఱ్గ) మఘా నక్షత్రంలో ఉంది. వందేళ్ళకు ఒక నక్షత్రం ఏదీ లేదు. ఖగోళ శాస్తర్రీత్యా దీనిని ధ్రువీకరించుకోవచ్చు. ఈ లెక్కన భారత యుద్ధం అయిదువేల సంవత్సరాలనాటి మాటే.
ఇక ద్రౌపది విషయం. సంస్కృత భారతం- సభాపర్వం- 67వ అధ్యాయంలోని ‘యుధిష్ఠిరస్తు తచ్ఛ్రుత్వా దుర్యోధన చికీర్షితమ్...’ అనే శ్లోకంలోని ‘‘ఏక వస్త్వ్రాధోనీవీ, రోదమానా రజస్వలా/ సభామాగమ్య పాంచాలీ శ్వసురస్యాగ్రతో భవ’’ అంటూ ధర్మరాజు పలికిన వాక్యాలలోని ఏకవస్త్ర, రజస్వల అనే పదాలను తీసుకొని ధర్మజుడే ద్రౌపదికి రజస్వలై ఉన్నట్టుగా రమ్మని ఒక నాటక వేషపు సలహా ఇచ్చాడని, అలా ఆమె వేషం వేసుకొని వచ్చింది అని అనటం (61, 62వ పేజీలలో) ఎంత ఘోరం! ఎంత అమానుషం! ఎంత జుగుప్సావహం! సహజంగా పురుషుడికి తన భార్య ఋతుచక్ర ధర్మస్థితిలో ఉన్నదని ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది. ఇది సంసారంలో సహజం. అలాంటి సహజతకు సంపూర్ణ విరుద్ధం సుబ్రహ్మణ్యశాస్ర్తీగారి వక్రీకృత వ్యాఖ్యానం, తొందరపాటు తీర్మానం. దుశ్శాసనుడు ద్రౌపది వలువలను ఊడ్చనే లేదట. కేవలం జుట్టు పట్టుకొని లాగాడట. ఆ గుంజుడులో కేవలం ఆమె పైట మాత్రమే జారిందట.
మరి సభాపర్వంలోని 67వ అధ్యాయం 35వది, 68వ అధ్యాయంలోని 40వ, 46వ ఈ క్రింది శ్లోకాల మాటేమిటి?
‘‘ప్రకీర్ణకేశీ పతితార్ధ వస్త్రా
దుశ్శాసనేన వ్యవధూయమానా (దుశ్శాసనుని చేత తన తల జుట్టు చిందర వందర చేయబడినదియును, వలువలు క్రిందికి లాగబడినదియును, మిక్కిలిగా క్షోభింపజేయబడినదియును అయిన ద్రౌపది)’’
‘‘ఆకృష్యమానే వసనే ద్రౌపద్యాః చింతితో హరిః (వలువలూడ్చబడిన ద్రౌపది హరిని (కృష్ణుని) తలచుకొన్నది.’’
వంశీధరుడు వస్త్రాలను ప్రదానం చేయలేదట ద్రౌపదికి. మరి అదే అధ్యాయంలోని ఈ క్రింది శ్లోక పంక్తుల మాటేమిటి?
‘‘సమాగృణోత్ వై వివిధైః సువస్రైః (ఆ భగవానుడు పలు పలు మంచి వలువలిచ్చి ఆదుకొనెను)’’
‘‘ఆకృష్యమానే వసనే ద్రౌపద్యాస్తు/ విషాంపతే! తద్రూప మపరం వస్త్రం ప్రాదురాసీ దనేకశః (ఓ జనమేజయా! అలా దుశ్శాసనుడు ద్రౌపదీ వస్త్రాపహరణం చేస్తుండగా వాటికి మారుగా వేరే వస్త్రాలు అనేకానేకంగా పుట్టుకొస్తున్నాయి) అని భారతంలో రాసి ఉంది.
ఈ వాస్తవాలు డాక్టర్ తిప్పాభట్ల రామకృష్ణమూర్తి, డాక్టర్ సూరం శ్రీనివాసులు మొదలైన వారు రాసిన తెలుగు భారత గ్రంథాలలో కూడా చూడవచ్చు. ఇలాగే పూతనవధాఘట్టం మొదలైన ఎన్నో ప్రతికూల ప్రతిపాదనలను పరాస్తంచేయవచ్చు. వ్యాసుడు కేవలం 8800 శ్లోకాలలోనే భారతం రాశాడని, దానిని వైశంపాయనుడు, సౌతి పెంచి పెద్దది చేసి లక్ష శ్లోకాల గ్రంథంగా రాశానని ఒక తీర్మానం ఈ గ్రంథంలో నిజమే. వ్యాసుడు స్థూలంగా భారతం రాశాడు. కానీ యథార్థంగా కురుపాండవ చరిత్రలో జరిగిన ఎన్నో ఘట్టాలను, వ్యాఖ్యానాలను, ఉపాఖ్యానాలను వ్యాసుడు వైశంపాయన, సౌతులకు చెప్పాడు కాలక్రమంలో. మున్ముందు కొన్ని గ్రంథాలు రాసి, ఆ తర్వాత మఱి కొన్ని ఐతిహ్యాలను చెప్పటం వ్యాసునికి పరిపాటే. ఆ పద్ధతి రచయిత కనుకనే తాను తరువాత తరువాత దేవీభాగవతాది అష్టాదశ ఉపపురాణాలను రాశాడు.
అష్టాదశ మహాపురాణాలను రాసిన తరువాత భారత సంబంధమైన కొన్ని వృత్తాంతాలను తన శిష్యులైన సుమంతుడు, జైమిని, పైలుడు, శుకుడు, వైశంపాయనుడు, సౌతి మొదలైన శిష్యులకు చెప్పాడు. వాటిని ఆ శిష్యులు గ్రంథస్థం చేశారు. అందుచేత లక్ష శ్లోకాల మహాభారతానికి అధికారిక మూలకర్త కేవలం వ్యాసుడే అవుతాడు. అందుచేతనే ‘శత సహస్య్రాం వైయాసిక్యాం (వ్యాసుని భారత రచన లక్ష శ్లోకాలది)’ అనే వాస్తవ వచనం ఆనాడే రూపుదాల్చింది.
పాండవ గాథ జనమేజయుని ముత్తాతల గాథ కనుక ఆ రాజు యొక్క ముఖప్రీతి కోసం భారతమంతా పాండవ పక్షపాతంగా వైశంపాయనాదులు రాశారు అంటాడు 46వ పుటలో రచయిత. శుక, సౌతి, పైల, జైమిని, వైశంపాయనాది సర్వ సంగ పరిత్యాగులకు, ముముక్షువులకు, ముని పుంగవులకు ఇలాంటి పక్షపాత దృష్టి సహిత రచనా పాపాన్ని అంటగట్టడం దారుణాతి దారుణం; కొందఱు కలియుగ ప్రథమ పాదస్థ అర్వాచీన రచయితల కలికల్మషం, ‘విపరీత బుద్ధి’ లక్షణం. 48వ పేజీలో రచయిత తాను పట్టుకు వేళ్లాడిన ఆర్య-ద్రావిడ సిద్ధాంతానికి ఇటీవలి ప్రాచ్య పాశ్చాత్య పండితుల పరిశోధనలతో కొన్ని దశాబ్దాలనాడే కాలం చెల్లిపోయింది. ఈ పుస్తకంలో చాలాచోట్ల ఇది ఇలా ‘అయ్యుండును’ వంటి ఊహాజనిత, అర్ధ విశ్వాస మాత్ర వాక్యాలు కనిపిస్తాయి. ఒక ఉదాహరణ 46వ పుట. ఇక భాష విషయానికి వస్తే ఇది గ్రాంథిక భాషా రచనే. కానీ చాలా సరళ సుందరంగా ఉంది. చదువుతుంటే చాలా సాఫీగా సాగిపోతూ సులభగ్రహ్యంగా సొంపారింది. ఒక దృక్పథానికి కట్టుబడి అధ్యయనం చేయటంలో ఎంత అధిక శ్రమ, అద్భుత పరిశ్రమ, ఏకాగ్రత, నిబద్ధత (్ళ్జనిఉ), నిమగ్నత (న్జిజేఉఉ), పరిశోధనా పఠన విశాలత, నిర్విరామ కృషి ఉండాలో ఈ బృహద్గ్రంథం చదివితే తెలుస్తుంది. రచయిత యొక్క నిర్భీతి, మోమోటములేమి, పాండితీ శౌండీర్యాలు ప్రశంసా పత్రాలు. భారతకాల భరతఖండ చిత్రపటం, వేద, ఐతిహాసిక, పురాణ, కావ్య వాఙ్మయంలోని రచయితృ దృక్పథ సమర్ధక అసంఖ్యాక క్రోడీకరణలు, వివిధ ప్రాంత భారత లిఖిత ప్రతుల గణాంకాలు, చంద్రవంశవృక్షం, 11 మంది పూర్వయుగ అశ్వమేధ క్రతుకర్తల వివరాలు, పాండవ కృష్ణుల జాతక చక్రాలు, ఇతిహాసకాల భారత రాజ్యాల పేర్లు మొదలైన ఎన్నో గ్రాహ్య విషయాలు, విశదీకరణలు ఈ వ్యాసావళిలో పఠనాభరుచి సంవర్థకాలుగా గణనీయ గణాంక విస్తారంగా కనిపిస్తాయి. ఇందులోని చాలా తీర్మానాలు, ప్రతిపాదనలు తిమ్మిని బ్రహ్మి, బ్రహ్మిని తిమ్మి చేసే కొందరు న్యాయవాదుల ధోరణికి ఛాయాచిత్రాలుగా భాసిస్తాయి.
రచయిత యొక్క వ్యాఖ్యాన క్రియా దీక్షా దర్ఘత అభినందనీయము.

- శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 9849779290