సబ్ ఫీచర్

చిన్నారులకు ఆలంబనగా నిలవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లీషులో ఓ సామెత కూడా వుంది. ‘ది ఛైల్డ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ది మాన్’ అని. చిన్నప్పుడే పిల్లలలో దేశభక్తిని, దైవభక్తినీ, మంచిభావాలని వారి మనసుల్లోకి కథలరూపంలో ఎక్కిస్తే దేశభక్తులుగా దైవభక్తులుగా మంచి భావాలతో పెరిగిన పిల్లలు భవిష్యత్తులో తప్పటడుగులు వెయ్యరు, మంచి పౌరులుగా తయారవుతారు.

పూర్వం ఎనిమిది, పది మంది పిల్లల్ని కని వాళ్ళ అలర్లు ఎలా భరించేవారో గాని, ఈ రోజుల్లో తల్లులు ఒకరిద్దరు పిల్లల అల్లర్లు భరించలేక రెండేళ్ళకే బేబీ కేర్ సెంటర్‌లకి పంపేస్తున్నారు. ఎల్‌కెజి పిల్లలు స్కూలుకి వెళ్ళమని గొడవ చేస్తే వాళ్ళని స్కూలుకి పంపేందుకు వాళ్ళకిష్టమైన కేక్‌లో, కాడ్‌బరీస్ చాక్‌లెట్‌లో ఏవో ఒకటి ఎర చూపుతున్నారు.
వీటికి అలవాటుపడిన ఈ పిల్లల ఆరోగ్యం పాడవడమే కాక మనం ఈ పని చేస్తే ఇది పుచ్చుకోవచ్చు అని, ఇక పెద్దయ్యాక కూడా ఏదైనా పని చెప్తే ‘‘నాకేమిస్తావు?’’ అని అడిగి తీసుకోవడం అలవాటవుతుంది.
ఈ అలవాటు పెద్దవాళ్ళయి ఉద్యోగాలకి వెళ్ళాక కూడా వాళ్ళ ఆలోచనలు అలాగే వుంటాయి. ఉద్యోగాలు చేసే తల్లులు ఆఫీసుకి టైమైపోతుంది.. వీళ్ళు ఎలాగో స్కూలుకి వెళ్తే చాలు అని ఏదో ఒకటి అడిగినది కొని ఇచ్చి పంపితే ఇంట్లో వుండే తల్లులు కూడా వాళ్ళకి మెల్లిగా నచ్చచెప్పి పంపించే ఓపికలు లేక, సినిమాలు, సీరియళ్ళు అయిపోతాయనే తొందరలో వాళ్ళు అడిగినవి కొనిచ్చి పంపుతూంటారు.
అలా కాకుండా వాళ్ళు లేచిన దగ్గిరనుంచీ స్నానం చేయించేటపుడు, బట్టలేసేటపుడు కూడా స్కూలుకెళ్ళి బాగా చదువుకుంటే ఎనె్నన్ని లాభాలుంటాయో! ఉద్యోగం చేసి ఎనె్నన్ని డబ్బులు సంపాదించుకోవచ్చో! తండ్రిని ఉదాహరణగా చెప్తూ ‘‘నాన్నగారు చూశావా? బాగా చదువుకున్నారు కనుకనే ఇప్పుడు పెద్ద ఉద్యోగం చేస్తున్నారు. కారు, స్కూటరు అన్నీ కొనుక్కున్నారు, చూశావా? నువ్వు కూడా ఇప్పుడు స్కూలుకెళ్లి బాగా చదువుకుంటే పెద్దవాడివై పెద్ద ఉద్యోగం చేసి నాన్నగారిలా బోలెడు డబ్బులు సంపాదించుకోవచ్చు’’ అంటూ చెప్తే వాళ్ళు తండ్రి గొప్పవాడని, మంచివాడని బాగా చదువుకున్నాడని ఆయన మీద గౌరవం ఏర్పడుతుంది. వాళ్ళు అలా చదువుకోవాలని ఆశతో చదువువైపు మొగ్గు చూపుతారు. అంతేకాని చిన్నతనం నుంచీ లంచాలు అలవాటు చెయ్యకూడదు.
పిల్లలకి ఏమీ కొని పెట్టకూడదని చెప్పడం లేదు. సాయంకాలం పిల్లలొచ్చేసరికీ వారికి ఇష్టమైనవి ఇంట్లోనే తయారుచేసి పెట్టండి. ఏ నెలకో ఓ సారి అందరూ కలిసి వెళ్లి వాళ్ళకి కావలసినవి కొని పెట్టండి.
అప్పుడు వాళ్ళు ఎంత ఆనందిస్తారో గమనించండి. అదే రోజూ అలవాటుగా మారిపోతే వారికి వాటిపై కూడా ఆకర్షణ పోవడమే కాక ఇవి కొనక ఏం చేస్తారు? ఇవ్వకేం చేస్తారు? అని ఒక ఏహ్యభావం, చులకనభావం కూడా ఏర్పడుతుంది. చిన్నప్పుడు ఏర్పడిన భావాలే పెద్దవాళ్ళయ్యాక బాగా స్థిరపడతాయి. మంచైనా, చెడైనా! ఇంగ్లీషులో ఓ సామెత కూడా వుంది.
‘ది ఛైల్డ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ది మాన్’ అని. చిన్నప్పుడే పిల్లలలో దేశభక్తిని, దైవభక్తినీ, మంచిభావాలని వారి మనసుల్లోకి కథలరూపంలో ఎక్కిస్తే దేశభక్తులుగా దైవభక్తులుగా మంచి భావాలతో పెరిగిన పిల్లలు భవిష్యత్తులో తప్పటడుగులు వెయ్యరు, మంచి పౌరులుగా తయారవుతారు.
నేడు చూస్తున్నాం! ఎంతోమంది యువకు(తు)లు ఆకర్షణలకి లోబడి అదే ప్రేమ అనుకొని, దక్కకపోతే చంపడం లేకపోతే చావడం, దొంగతనాలు ఇలా ఎన్నో! అందుకే చిన్నప్పుడే మంచి పునాదులు పడేలా చూడాలి!

-ఆర్.ఎస్.హైమవతి