సబ్ ఫీచర్

రోగులకు రాగులు ఎంతో మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నో ర్కాల రోగాలకు రాగులు మే లు అంతా ఇంతా కాదు. ఇతర ధాన్యాలకంటే రాగు లు ఎంతో పుష్టినిస్తాయి. శారీరక కష్టం చేసేవారికి రాగుల పిం డితో తయారుచేసిన పదార్థాలు తరచుగా తిన్నట్లయితే వారికి నూతన శక్తి జవసత్వాలు ఏర్పడతాయి. కారణం వాటి లో అయోడిన్ పుష్కలంగా వుండటమే. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులు వేయించి పొడి చేసిన పిండిని కలిపి తాగించేట్లయితే వారి శక్తి, ఎదుగుదలకు, నరాలు గట్టిపడటానికి, నిత్య ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి.
రాగులలో కాల్షియం కూడా ఎక్కువగా వున్నందువలన పిల్లలు హైట్ పెరగడానికి, విపరీతమైన బలం సమకూర్చేందుకు పనికివస్తాయి. జుట్టు ఒత్తుగాను, పొడుగ్గానూ పెరుగుతుంది. మధుమేహ వ్యాధికి (షుగర్) వీటితో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిసిన రాగుల పానీయం చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. కడుపులో మంట, గడబిడ తగ్గిస్తుంది. చలువ చేస్తుంది. పైత్యాన్ని తగ్గిస్తుంది. రాగుల పానీయం దప్పికను అరికడుతుంది. ముసలితనంలో వున్నవారు రాగులతో చేసిన ఆహార పదార్థాలు భుజించడంవల్ల శరీరానికి సత్తువ, నిస్త్రాణ, బయట తిరిగేటప్పుడు వచ్చే దాహం నివారిస్తుంది. రాగులతో పిండి పట్టించడానికి సమయం లేనివారు బజారులో దొరికే రాగిమాల్ట్‌ను కొనుక్కొని వాడితే సుగుణాలు ఎన్ని వస్తాయో చెప్పలేం. ఎముకల పటుత్వానికి, ధాతువుల నిర్మాణానికి తోడ్పడతాయి. వృద్ధులు, యువకులు, మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది. కొన్ని వ్యాధులకు ప్రివెంటివ్‌గా పనిచేస్తాయి. సుగంధిపాలతో కలిపిన రాగిమాల్ట్‌ను తీసుకుంటే రక్తపోటు (లో మరియు హై బ్లెడ్‌ప్రెషర్) అరికడుతుంది.
ఇటీవల డాక్టర్ల టీమ్ పల్లెటూరిలో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి తగు పరికరాలతో పరీక్షలు చేసి బాలలకు, వృద్ధులకు, మధ్యవయస్సుగలవారికి ప్రత్యేకించి షుగర్ బాధితులకు, ఇతర వ్యాధులుగలవారికి రాగి గంజి, రాగి జావ, రాగులతో కూడిన ఆహార పదార్థాలను సూచించారు. తర్వాత వారం పది రోజుల తర్వాత ఆ డాక్టర్లు మళ్లీ వెళ్లి రోగులను పరామర్శ చేసి వ్యాధులు ఎలా వున్నాయని ప్రతి ఒక్కరిని అడిగితే చాలామంది తమకు బలం, సత్తువ వచ్చి నిస్త్రాణ తగ్గిందని, షుగర్ నార్మల్‌కు వచ్చిందని, బి.పి తగ్గి తల తిరుగుడు (రీలింగ్) తగ్గిందనీ చెబితే డాక్టర్లు తమ కృషి ఫలించిందని సంతోషపడ్డారు. ఆ పల్లెలో ఈనాటికీ రాగులు సత్ఫలితాలు ఇస్తున్నాయని, రిలీఫ్ వచ్చిందని ముక్తకంఠంతో చెబుతుంటే రాగుల ప్రాముఖ్యత, నిత్యం వాడితే రుగ్మతలు తగ్గుదలకు వచ్చాయని అన్నారు. రాగులు నిత్యం వాడండి. ఆరోగ్యవంతులుగా వుండండి.

- బి.విజయలక్ష్మి