సబ్ ఫీచర్

వ్యక్తిత్వానికి వనె్న తెచ్చేది నడవడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి నడవడిక వ్యక్తిత్వానికి వనె్న తెస్తుంది. మనుషుల మనుగడకు సామాజిక మానవ సంబంధాలు ఎంతైనా అవసరం. మాటల్లో కమ్మదనం, ఎదుటివారిని గౌరవిస్తూ మాట్లాడితే ప్రథమ పరిచయంలోనే గౌరవభావం పెరుగుతుంది. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఎదుటి వ్యక్తులు పిచ్చివారి క్రింద జమ కట్టి వాగుడుకాయల క్రింద జమ కట్టి మిమ్మల్ని మీ మాటల్ని లక్ష్యపెట్టకుండా పొడిపొడిగా మాట్లాడి తప్పుకుంటారు.
ఎదుటివారిని పలకరించే తీరు
పరిచయం ఏ మాత్రం లేనివారైనా, మర్యాదపూర్వకంగా పలకరిస్తే వారు కూడా మీ మాటల్ని అదే గౌరవంతో ఆలకిస్తారు. పలకరింపులో పెద్దా చిన్నా, పేదా గొప్ప తారతమ్యం లేకుండా పలుకరిస్తే మీ మాటలకు మన్నన, ఎదుటివారికి ఆనందం కలుగుతుంది. పలుకరించే సమయంలో ప్రసన్నంగా మీ పెదవులపై చిరునవ్వుతో మాట్లాడటంవలన ఎదుటివారు ప్రసన్నులై మీ మీద గౌరవభావాన్ని ఒలకబోస్తారు. మీరు అడిగిన సమాచారాన్ని క్షుణ్ణంగా తెలియజేసి మీ పట్ల ప్రేమ పూర్వక ఆదరణ కలిగి ఉంటారు. మీకు చిరపరిచితులైన వ్యక్తులు తారసపడినా ముభావంగా వార్ని పలకరిస్తే మనకేమి ఒరుగుతుంది. మనకేంటి లాభం అన్న ఆలోచనల్ని మనసులోకి రానీకుండా గుడ్‌మార్నింగ్ సార్ అనో.. బాగున్నారో అనో.. నమస్కారం అనో చిరుమందహాసంతో వారిని ఆకట్టుకొనే ప్రయత్నం చేయాలి. అప్పుడే మానవ సంబంధాలు మరింత గాఢమవుతాయి. టైమ్‌వేస్ట్ అనో, ఆ.. ఏంది మాట్లాడేది అనే అహాన్ని పక్కకుపెట్టి ఎదుటివారిని పలకరిస్తే, వారు కూడా మరెప్పుడైనా తారసపడితే మొదటి పిలుపు వారినుండి ఆత్మీయంగా వస్తుంది. పరిచితులను కడద్రోసి మొహం చాటు చేయడంవలన ఒనగూడేది ఏమీ లేకపోగా తర్వాత తర్వాత సంబంధాలు తెగిపోయే పరిస్థితిని కొనితెచ్చుకున్నట్టవుతుంది.
మనుషులకు మానవ సంబంధాలే ఆత్మీయతకు నిదర్శనాలు
పలుకే బంగారమాయెనా.. అనే పరిధిలోకి వెళ్లకుండా మనుషుల నడుమ మానవ సంబంధాల్ని పెంచుకోవాలనే తపనతో కమ్మటి మాటలు, వాటి నడుమ చిరుదరహాసాలతో ఎదుటి వ్యక్తులను ఆకట్టుకునేలా సంభాషణలు కొనసాగితే మరికొంతసేపు వారితో మాట్లాడి వుంటే మరింత ఆనందం, ఆహ్లాదం కలిగి ఉండేదని ఎదుటి వ్యక్తులు భావిస్తే మీ సంభాషణలతో వారు పులకాంకితులయ్యారని ఇట్టే పసిగట్టేయచ్చు. మాటలు ములుకుల్లా, గద్దించడంలా, అపహాస్యం చేసేలా ఉండకూడదు. సభ్యతా సంస్కారాలతో కూడిన థ్యాంక్స్, సారీ, ఎక్స్‌క్యూజ్‌మీ, వహ్వా! భళీ! భళీ! లాంటి పదజాలాన్ని తరచూ మీ మాటల్లో చొప్పిస్తూ చతురతతో మాట్లాడగలిగితే మీ మాటల్ని అప్పుడే కాదు, అప్పుడప్పుడు గుర్తుచేసుకొని ఆనందిస్తారు.
పదిమంది ముందు గౌరవాన్ని,
నమ్రతను ప్రదర్శించాలి
ప్రయాణాలు, కార్యక్రమాలు ఆహ్లాదకరంగా సాగేందుకు సంఘంలో గౌరవప్రదంగా ఉండాలని భావించినపుడు మీరు కూడా హుందాగా, నమ్రతతో, ఎదుటివారిని గౌరవించే విధంగా మసలుకోవాలి. ఆ మనుషులు ఆహార వ్యవహారాల్లో, మాట తీరులో, నీతి నిజాయితీల్లో, టైమ్ సెన్సులో క్రమశిక్షణాయుతంగా నడుచుకోవాలి. హామీ ఇవ్వడం కాదు ఆ హామీని నిలబెట్టుకొనే క్రమశిక్షణను తమకు తామే ఏర్పాటుచేసుకోవాలి. వారా మాటంటే మాటే.. ఆరు నూరయినా, నూరు ఆరైనా మడమ తిప్పని వ్యక్తిత్వం, ఫోన్ మేనర్స్‌లో, టేబుల్ మేనర్స్‌లో.. ఒకటనేమిటి అన్ని రకాలుగా వారు సమర్థులు. సహనం, నమ్రతలతో ఎదుటివారినుండి మన్ననలు, మర్యాదలు అందుకొనే రీతిలో ఎదగాలి. అప్పుడే సమాజం హర్షిస్తుంది. సగౌరవంతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంది.

భూమికకు రచనలు

పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.net
కు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్,
ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

-దాసరి కృష్ణారెడ్డి