సబ్ ఫీచర్

దాండియా శోభలో లెహంగాల జిలుగులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ భాగ్యనగరంలో నవరాత్రి ఉత్సవాల శోభ వెల్లివిరుస్తుంది. ఈ ఉత్సవాల్లో ప్రధానమైన దాండియా నృత్యానికి యువతీ యువకులు పాదం కదిపేందుకు సిద్ధమవుతున్నారు. నగరంలో ఏ ఫంక్షన్ హాల్లో చూసినా దాండియా నృత్యాన్ని రిహార్సల్ చేస్తున్న సీతాకోకచిలుకల్లాంటి యువతీ యువకులే సందడి చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో వస్త్ర వ్యాపారానికి తలమానికంగా నిలిచే సుల్తాన్ బజార్ వెళితే అక్కడ ప్రతి ఫంక్షన్ హాలులోనూ డోల్ బాజే..డోల్ బాజే అనే పాట మారుమ్రోగుతోంది. ఆ పాటకు తగ్గట్టుకు రిహార్సల్ చేస్తున్న దృశ్యాలు కనుల విందుగా కనిపిస్తున్నాయి. అమ్మాయిలు చోలీలు, లెహంగాల్లో తారకల్లా మెరిసిపోతూ.. రెండు చేతుల్లో దాండియా కర్రలు చేతబట్టి పాటకు అనుగుణంగా నృత్యం చేస్తున్న దృశ్యాలే. తొమ్మిది రోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో తప్పనిసరిగా చేసే ఈ సంప్రదాయ నృత్యానికి ఈనాటికీ చెక్కుచెదరని ఆదరణ లభిస్తోంది. వీధి కూడల్లే కాదు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల ప్రాంగణాలు సైతం ఈ నృత్యానికి వేదికలయ్యేందుకు సన్నద్ధమవుతున్నాయి. పాఠశాలల్లో విద్యార్థులతో ఈ నృత్యాన్ని చేయించి ఉపాధ్యాయులు నవరాత్రి ఉత్సవాల ఔనత్యాన్ని కాపాడుతున్నారు. కాలనీల్లో నిర్వహించే దాండియా నృత్యంలో టీనేజ్ అమ్మాయిలే కాదు కుటుంబ సభ్యులంతా పాల్గొని కుర్రకారుకు తామేమి తీసిపోమన్నట్లుగా నృత్యం చేస్తారు. ఈ నవరాత్రి ఉత్సవాల కోసం ఎన్నాళ్ల నుంచో కళాశాల, యూనివర్శిటీ విద్యార్థులు ఎదురుచూస్తుంటారు. ఆకాశం నుంచి నక్షత్రాలు దిగివచ్చాయా అన్నట్లు మెరిసే రంగుల్లో టీనేజ్ యువతీ యువకులతో మైదానాలు నిండిపోతాయి. అక్కడ ఆనందమే వెల్లివిరుస్తుందని గుజరాత్‌కు చెందిన జెఎన్‌టియూ విద్యార్థులు చెబుతున్నారు. శోభాయమానంగా కనిపించే ఈ దాండియా నృత్యం కోసం ధరించే లెహంగాల కోసం వస్త్ర దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి.
కళ్లు జిగేల్‌మనిపించేలా..
సంప్రదాయబద్దంగా కనిపించే లెహంగాలు ఎల్లప్పుడూ సరికొత్త ట్రెండ్‌నే సృష్టిస్తాయి. ఎన్ని మార్పులు వచ్చినా నేటితరం ఆదరిస్తున్న లెహంగాల్లో అమ్మాయిలు జగేల్‌మనిపిస్తారు. కాలేజీల్లోనే, కార్పోరేట్ కార్యాలయాల్లోనూ దాండియా నృత్యం చేయాలంటే లెహంగా వేసుకుంటేనే ఆకట్టుకునేలా కనిపిస్తారు. అయితే మన ఆహార్యానికి నప్పేలా కాస్తంత సంద్రాయతను, ఆధునికతను జోడించి ఎన్నో రకాలు డిజైన్లలో లెహంగాలు నేడు మార్కెట్లో కనిపిస్తున్నాయి. జెకెట్ లెహంగాలు మరీ ఆర్భాటంగా కనిపించకుండా సింపుల్‌గా మీ ప్రత్యేకతను చాటుకుంటూ ఫంక్షన్‌లో కనిపిస్తారు. కంటికి ఇంపైన ఎల్లో కలర్‌లో కనిపించే సిల్క్ లెహంగాకు స్టోన్ వర్క్ కూడా చేశారు. లేత ఆకుపచ్చ రంగులో నెట్‌తోబ్లాక్ నెక్ చోలీతో డిజైన్ చేసిన లెహంగా చోలీతో నేల మీద నృత్యాన్ని చేస్తే కనులు తిప్పుకోవటం సాధ్యంకాదు. బ్లూ కలర్‌లో ఎంబ్రాయిడరీ వర్క్ చేయటంతో ఎర్ర రం గు కాంబినేషన్‌లో ధరిస్తే చూడచక్కగా కనిపిస్తారు. దీనికి పసుపుపచ్చని దుప్పటా ఇవ్వటంతో దీని అందం మరింత దిగ్విణీకృతమైంది. ఆరెంజ్, పింక్ రంగుల్లో మెరిసే లెహంగా చోలీలకు అద్దాలతో వర్క్ చేయటంతో పార్టీవేర్‌గానూ ధరించవచ్చు. మరింకెందుకు ఆలస్యం లేత ముదురు రంగుల కలబోతతో లెహంగాలను ఎంచుకుంటే ఆ అందం సింధూరమే.
***
భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03