సబ్ ఫీచర్

పంచయజ్ఞాలు (ధర్మ జిజ్ఞాస)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచయజ్ఞాలను వివరించండి?
బ్రహ్మయజ్ఞం: ఒక ఋక్కునుగాని, యజస్సునుగాని, సామాన్నిగాని అభ్యాసం చేయడమే 3వేదాధ్యయనం2. దీనే్న బ్రహ్మయజ్ఞం అంటారు. స్వాధ్యాయం కూడా బ్రహ్మయజ్ఞమే.
దేవయజ్ఞం: వివిధ దేవతల తృప్తికోసం చేసే యజ్ఞాల్లో హవిస్సు ను3స్వాహా2పూర్వకంగా సమర్పించే కార్యక్రమమే దేవయజ్ఞం.
పితృయజ్ఞం: పితృదేవతల ప్రీతికోసం చేసే కర్మలు, తర్పణాలు ఆ కార్యక్రమాల్లో చేసే అన్న సంతర్పణ, పితృతర్పణాలు మొదలైనవి పితృయజ్ఞం.
భూతయజ్ఞం: ప్రతినిత్యం చేయాల్సిన వైశ్వదేవానుష్టానం తర్వాత జీవరాశుల తృప్తికొరకు భూతబలిగా ఇచ్చే ఆహార సమర్పణం, జంతువులకు ఆహారం పెట్టడం- భూతయజ్ఞం.
మనుష్యయజ్ఞం: తనకు కలిగిన విధంగా వచ్చిన అతిథి అభ్యాగతులకు అన్నదానం, ఇతర సహాయాలు చెయ్యడం మనుష్యయజ్ఞం.
* స్వాధ్యాయమంటే ఏమిటి?
యథార్థమైన ఆచరణతో చదువుతూ, చదివిస్తుండాలి! సత్యాచారంతో సత్యమైన విద్యలను చదువుతూ, చదివిస్తూండాలి! తపస్సు చేస్తూ, వేదాది శాస్త్రాలను చదువుతూ, చదివిస్తుండాలి! బాహ్యేంద్రియాలను దుష్టాచారాలనుండి దూరం చేసి చదువుతూ, చదివిస్తుండాలి! మనోవృత్తిని అన్ని దోషాలనుండి తొలగించి చదువుతూ, చదివిస్తుండాలి. ఆహవనీయాది అగ్నులను తెలుసుకొని చదువుతూ చదివిస్తుండాలి! అగ్నిహోత్రం చేస్తూ చదువుతూ, చదివిస్తుండాలి! అతిథుల సేవ చేస్తూ చదువుతూ, చదివిస్తుండాలి. మనుష్య వ్యవహారాలను యథావిధిగా చేస్తూ చదువుతూ చదివిస్తుండాలి. వీర్యాన్ని రక్షిస్తూ, వృద్ధిపరుస్తూ చదువుతూ, చదివిస్తుండాలి! తమ సంతానాన్ని, శిష్యులను పాలిస్తూ చదువుతూ, చదివిస్తుండాలి. స్వాధ్యాయాన్ని ఒక యజ్ఞంగా పేర్కొన్నాడు కృష్ణుడు. సద్గ్రంథాలను చదవడమే స్వాధ్యాయం. ఉనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఋషులు, పురాణపురుషుల జీవితాల అధ్యయనం వంటివన్నీ స్వాధ్యాయం క్రిందకే వస్తాయి. ఒంటరిగా కూర్చొని అధ్యయనం చేయడమే స్వాధ్యాయం. పారాయణ, పఠనం అనేవి స్వాధ్యాయంలో మొదటిదశ. రెండో దశలో చదివిన విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి, అర్థం చేసుకోవాలి. తర్వాత క్రమంగా ఆ విషయాన్ని ఆచరణలో పెట్టాలి.
* దేవుని ముందు దీపం ఎందుకు వెలిగించాలి?
ప్రతిరోజు దేవుని దీపానికి ఏ నూనె వాడుకోవాలి?
3దీపం జ్యోతి పరబ్రహ్మ2 అన్నారు పెద్దలు. దీపం జ్ఞానానికి, వెలుగుకు ప్రతీక. ప్రతి హృదయంలో వెలుగు నింపిన దీపం మనలోని అజ్ఞానాన్ని పటాపంచలు చేయాలనే కోరికతో దీపారాధన చేస్తాం. దీపాన్ని లక్ష్మీస్వరూపంగా భావిస్తాం. 3దీపము వెలిగిన ఇంటను దాపున శ్రీ లక్ష్మిదేవి ధనములనిచ్చున్2- అన్న ప్రసిద్ధ పద్యం మనం చదువుతుంటాం. భగవంతునికి ఎన్ని రకాల ఉపచారాలు చేసినా 3దీపారాధన2 లేకుండా సంపూర్ణమైన పూజగా మనం భావించం. దేవుని ముందు దీపం వెలిగించడానికి నువ్వుల నూనె, ఆవునెయ్యి రెండూ చాలా ప్రశస్తాలు. ఈ వస్తువులతో దీపారాధన చేయటంవల్ల గృహంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. అలాంటి వాతావరణంలో పూజాది కార్యక్రమాలు చేయటంవల్ల చిత్తేకాగ్రత ఏర్పడుతుంది. ఇవి లేని పక్షంలో ఇతరాలైన మంచి నూనెలను ఉపయోగించాలి. ముఖానికి వారి వారి సంప్రదాయాన్ని బట్టి తిలకం లేదా విభూతి, కుంకుమ ధరించి, పూజా గదిలో దీపం ముఖానికి కుంకుమ పెట్టిన తర్వాత దీపం వెలిగించాలి. దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించరాదు. కర్పూరంలో వెలిగిస్తే మంచిది. దీపం ఆర్పేటపుడు రెండు చుక్కల పాలుగాని, కుంకుమగాని పెట్టిన తర్వాత వత్తిని మెల్లగా నూనెలోకి జరపాలి. నోటితో దీపం ఊదకూడదు. వ్రతాది కార్యక్రమాల తదుపరి 3వ్రతం పీఠాన్ని2 కదిలించిన తర్వాతనే దీపం తీసివేయాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపారాధన చెయ్యడం మంచిది. పూజకు బొడ్డు వత్తులను వాడటమే శ్రేష్ఠం. ఈ వత్తులు దీపాన్ని చిరకాలం ఆత్మజ్యోతిగా ప్రకాశింపజేస్తాయి. క్రిందిభాగం కుదురు (బొడ్డు) మాదిరిగా ఉండడంవల్ల ఎక్కువ తైలం తనలో దాచుకుంటుంది. బొడ్డు వత్తి వాడడంలో కూడా ఓ అంతరార్థం ఉంది. ఆత్మజ్యోతి స్వరూపాన్ని సూచించేది బొడ్డు వత్తి. క్రింది భాగం వెడల్పుగా ఉండి పైకి వెళ్ళేకొద్దీ సన్నగా అయిపోయి దీపం బాగా కాంతిగా వెలగడానికి తోడ్పడుతుంది. క్రింద ఎంత గొప్పగా వున్నా పైన నిరాడంబరంగా ఉండి ఎక్కువగా కార్యశీలత ఉండాలనేది ఈ వత్తి సూచిస్తుంది.
దీపారాధన చెయ్యకుండా ఆగి ఆగివచ్చే బల్బులను పెట్టడం సరైనది కాదు.
ఆవు నెయ్య ప్రాశస్త్యం:
పూర్వకాలం నుంచి కూడా ఆవునెయ్యని మనశాస్తక్రారులు ప్రశస్తంగా పేర్కొన్నారు. అగ్నిహోత్రం చేసే సమయంలో మాత్రమే వాయురూపంలో ఏడు, ఎనిమిది కి,మీ ఎత్తు వరకు వాతావరణ కాలుష్యాన్ని తొలగించి, నీటి ఆవరి కణాలను దగ్గరగా చేర్చి , వానలు కురిపించే సత్తా కలిగి ఉంటుంది ఆవునెయ్య. యజ్ఞాగ్నిలో వేయదగ్గ అన్ని వస్తువుల్లో కెల్లా ఇది అతి శ్రేష్టమైంది. ఎంతో అదృష్టవంతులు గయతే తప్ప అనుభవించే భాగ్యం కలుగదని ఆయుర్వేదం చెబుతుంది. ఆవునెయ్య వల్ల వాతావరణంలోని రేడియేషన్ ప్రభావం తగ్గి పోతుందనీ చెబుతున్నారు.

- డా. పి. భాస్కరయోగి