సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనందం
మనిషికి తనకు అన్నీ తెలుసునన్న అహం భావం ఉంటుంది. కానీ తీరా ఏదన్నా అడిగితే తలవేలాడేస్తాడు. ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుందో మనిషి వార్తలు తేగలడు. కానీ తన అజ్ఞానం కారణంగా తాను తనకు, ఇతరులకు కూడా ఎంత న్యూసెన్స్‌గా తయారయాడో గ్రహించలేడు. తానను చీకటిలో కొట్టుమిట్టాడుతూ ఆనందం కావాలంటాడు. కానీ ఆనందం ఎలా లభిస్తుంది. అతినకి తెలియదు. ఆనందం ప్రార్థన వల్ల లభిస్తుంది. ధ్యానం వల్ల లభిస్తుంది. వౌనం వల్ల లభిస్తుంది. ఆనందం తానే తన సహజ స్థితి ఆనందమే. ఆ సంగతి అతినకి తెలియదు. ఏదో దుఃఖానికి అతడు కొట్టుకుని పోతున్నాడు. దానిని తట్టుకొని నిలబడాలంటే అతనికి కావలసింది ఏమిటి? ఇబ్బందులను తట్టుకొని నిలబడాలంటే అతనికి కావలసింది ఏమిటి? తనలోనే ఉన్న దైవంలో విశ్వాసం. అదే అతనికి దృఢమైన కవచం.

ఆత్మశక్తి
విద్యుచ్ఛక్తి ప్రకృతిలో అంతటా ఉంది. కాని దానిని సేకరించి ఉపయోగించుకోవాలంటే మానవుడు నిర్మించిన కొన్ని సాధనాలను వాడాల్సి ఉంది. అలాగే ఆత్మశక్తి దేహమంతటా ఉంది. నాడుల ద్వారా ప్రసరిస్తూ దేహ చలనాలకను నడుపుతూ ఉంది. నీ చర్యలు అన్నీ ఆనందముఖంగా నిర్వహించు విషయసుఖాలకు అనుబంధించకు. సంగాన్ని చేరనీయకు. కణ కణాల నుండీ నాడుల నుండ ఇ ప్రసరించే జీవశక్త అంతా ఆత్మనే ప్రతిబింమించగలదు. ఆనంద స్వరూపాన్ని ఆవిష్కరించగలదు.
ఆదేశం
ధర్మం ఏం చేస్తున్నది. నీ మనస్సును పునీతం చేస్తుంది. నిన్ను దైవం దిశగా నడిపిస్తున్నది. భగవంతుని నామ రూపాల పట్ల అభిరుచినీ ఆసక్తినీ కలిగిస్తుంది. కృష్ణుని నామరూపాలంటే నీకు ఆరాధన అయితే నీవుకృష్ణుడు అంటే ఎంతో ఇష్టపడుతావ.. ఆయన ఆజ్ఞను శిరసావసిస్తావు. నీకు ఆయన ఆదేశాలెక్కడ లభిస్తాయి. భగవద్గీతలో ఆయన నామాన్ని నీ నాలుకపై నిలుపుకో. ఆయన రూపాన్ని నీ కన్నుల ముందాడనీ. నీ మనస్సు నండి అశాపిశాచాన్ని పారద్రోలు. శాంతి సంతోషాలతో నీ మనస్సు ను నింపుకో. నీలోని దైవం పై నిరంతరం నీ మనస్సును నిలుపు. అందువల్ల సర్వం విష్ణు మయం జగత్ అన్న భావన నీకు అనుభవంలోకి వస్తుంది. అందరి పట్ల నీకు ప్రేమభావం పెంపొందుతుంది. అందరి యందు నీకు మంచే కనిపిస్తుంది. అందరికీ మంచి చేయాలన్న తపన నీలో కలుగుతుంది.
నాకీ నగలెందుకు
ప్రేమతో భక్తి ప్రపత్తులతో భక్తులు. భగవంతుడనికి ఏవేవో ఇవ్వాలని ఆశపడుతుంటారు. గుర్తించుకోవలసింది ఒక్కటే. స్వామికి ఏమీ అక్కర్లేదు. చిన్న గౌను కూడా మీరు తీసుకురాకూడదు. స్వామియే మీవారు.స్వామి మీకు ప్రత్యేకం కాదు. మీరు నాకు ప్రత్యేకం కాదు. మనది అవినాభ సంబంధం.
కొంతమంది అలంకారం కోసం నగలు తెచ్చారు. భగవంతుడనికి ఏది నగ? ఆనందమే నగ. ప్రేమయే నగ. తానే బ్యూటీ. అలాంటి వానికి లేనిపోని నగలంతా వేసి నిజమైన బ్యూటీని ఎందుకు పాడు చేయడం ? సహజమైన స్వరూపమే ఆనందం. ఇలాంటి అసహజాలంకారాలను తేవటానికి ప్రయత్నం చేయండి.
శాశ్వతానందం
నీవు ఈ దేహానివనీ చావు రాగానే ఈ దేహంతో పాటు నీవు నశిస్తావనీ అనుకోటం చాలా పొరపాటు. ఆ ఆలోచన వాంఛనీయం కాదు. మరోభ్రమ ఆస్తి. అంతస్థుల వల్ల , పాండిత్యం వల్ల , కీర్తి ప్రతిష్టవల్ల సుఖం కలుగుతుందని అనుకోడం అది మదరాసు బస్సెక్కి బెంగుళూరు చేరుతామనుకోడం లాంటిది. అసలు సుఖం అంటే ఏమిటి? అదూక మానసిక స్థితి. ఇంధ్రియ సుఖం తాత్కాలికం. అది చివరకు దుఃఖాన్ని తెచ్చి పెడుతుంది. ఆత్మానందం శాశ్వతం. అది ముక్తి ననుగ్రహిస్తుంది. సాధన వల్ల ఆ స్థితిని సాధించవచ్చు. నీవేం చేస్తున్నా అది భగవదర్చనే అనుకొని చేయి. ఆ స్థితిని చేరుకోగలుగుతావు. బుద్ధి స్థిరంగా ఉంటుంది. ఆత్రుత లేకుండా ఉంటుంది.
సర్వజ్ఞ భ్రాంతి
ఈ రోజుల్లో తాము విజ్ఞాన సర్వస్వాలమనుకొనే పెద్ద మనుష్యులు కొందరు మనకు తగుల్తుంటారు. ప్రకృతి రహస్యాలన్ని తమకు అవగతమే అంటుంటారు. చంద్రునిపై వారు కాలుమోపగలరు. సరే! కాని ‘ఆనందం’ అంటే ఏమిటో ఎరుగుదురా? అడగండి! ఆనంద స్థితిలో వుండి పోగలరా? అడగండి! అదేమిటో వారికి తెలియదు. ఆ స్థితి యింకా వారి అనుభవాలలోకి రాలేదట! తెలుసుకోవాల్సిందంతా వారు తెలిసికొనే వుంటే, ఈ సంగతి ఎలా మిస్సయ్యారు? వారి సర్వజ్ఞత్వం ఒక బ్రాంతియే అన్నమాట!
ఇంకా ఉంది