సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ పిలుపే మేలుకొలుపు
దేవ దేవుని ప్రతిహృదయంలో ప్రతిధ్వనిస్తూంది. అద్భుత భక్తి, ప్రేమ, వాత్సల్యం,. త్యాగ భావాలను రేకేత్తిస్తోంది. పూజ, అర్చన, భజనాదికాలుగా రూపొందుతోంది. మనసును దివ్య చింతనలో ఓలలాడించి అంతులేని ఆనంద ప్రవాహంలో ముంచెత్తుతుంది.
దానికి నీవు బదులు పలుకుతున్నావా ? లే.
పైపెచ్చు దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదు. ఆయనది రాతిగుండె అంటుంటావు. కానీ నే చెప్పేది విను. దైవమే ప్రేమ. ప్రేమే దైవం. ఆయన ఆకారం ప్రేమ. ఆయన స్వభావం ఆనందం. కొండ శిఖరం ముందు ఆక్రోశించినా అది కో అంటే ఓ అని బదులు చెబుతుందే? అసలు బదులు పలుకాల్సింది నీవు ఒక వేళ నీవన్నట్లు భగవంతుని నుండి జవాబు రకపోతే దానర్థం ఒకటే. నీ పిలుపులో ఏదో లోపం ఉంది. చిత్త శుద్ధి కొరవడిందేమో. ఆర్తిగా పిలువలేకపోయావేమో. పరాయి వాడిని పిలిచినట్లు పిలుస్తున్నావేమో భయం భయంగా బెరుగ్గా పిలిచావేమో . ఆయన పిలుపు నీకు ఇప్పటికైనా మేలుకొలుపు కావాలి.
సవరసాల
ప్రణవం సృష్టికే బీజం. పంచభూతాలూ ప్రణవం నుండే పుట్టాయి. పృథ్వీరసం జలం: జలరసం ఔషధులు; ఔషధీరసం మానవుడు; మానవ రసం వాక్కు; వాక్కు రసం ఋక్కు; ఋక్కురసం సామం; సామరసం ఓంకారం. ఈ ఎనిమిది రసాలూ దారితీసేది ఎక్కడికి? తొమ్మిదవ రసం దగ్గరకు. అదే ఆనందం. ఇవే నవరసాలు, ఇవే మానవుని గమ్యం.
ఆనంద మాత
మన సంస్కృతీ వారసత్వం గురించి ప్రజలకు చాటిచెప్పే వారికి నిరాశా నిస్పృహలు కలుగుతున్నాయి. వేదాల్లో చెప్పిన ధర్మాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సి వుంటుంది. గంభీరోపన్యాసాల ద్వారా దానిని వివరించటం కుదరదు. స్వరయుక్తంగా వాటిని పారాయణ చేస్తున్న వారు చేస్తున్న సేవ అభినందనీయమే కాని వేదాలు కేవలం వల్లెవేసుకునేందుకు మాత్రమే కాదు. సుస్వరంగా వేదాన్ని పారాయణ చేసి ఆనందాన్ని అందుకోవాలి. వేదమాత ఎవరు? సాక్షాత్తు ఆనంద మాతే!
కృష్ణ, కృష్ణ, కృష్ణ!
కృష్ణుడు అన్న మాటకు మూడర్థాలు వున్నాయి.
‘కర్ష్’ అన్న ధాతువుకు ‘ఆకర్షణ’ అని అర్థం. తన లీలలతో మన మనస్సులను ఆయన ఆకర్షిస్తాడు. అందుకే ఆయన కృష్ణుడయ్యాడు. దుర్మార్గులందరినీ ఆయన గెలిచిన తీరు అద్భుతం! ఆయన మాటలూ, చేతలూ అతి మధురం. ఆయన తెలివి తేటలు అమోఘం. ఇవన్నీ దివ్యమైన ఆయన ఆకర్షణకు దోహదాలే!
‘క్రిష్’ అనే ధాతువును తీసికొంటే కృషి అంటే వ్యవసాయం అనే అర్థం వస్తుంది. మన మనసులలో పెరిగే చెడు ఆలోచనలనే కలుపు మొక్కలను ఆయన పీకేస్తాడు; విశ్వాసం, ధైర్యం, సంతోషం అనే విత్తనాలను వెదపెడతాడు. ముక్తి సంపదను పండిస్తాడు. కనుకనే ఆ దివ్య కృషీవలు కృష్ణుడయాడు.
‘క్రిష్’ అంటే గుణాతీతం అన్న అర్థం కూడ వుంది. ‘న’(ణ) అంటే ఆనందం. సత్, చిత్, ఆనందం స్వరూపుడు కనుక ఆయన కృష్ణుడయాడు.
ఆనందం కావాలి- ఎలా?
అందరికీ ఆనందం కావాలి, కాని అదెట్లా వస్తుంది? విశ్వాసం వల్లనే ఆనందం లభిస్తుంది. విశ్వాసం సంతోషమనే జలధార నుండి కలుగుతుంది. కాని సంతోషం నేడెక్కడా కనిపించదు. అన్నిచోట్లా విచారమే కనిపిస్తున్నది. ఇది ఎందువల్ల జరుగుతున్నది? ఎందుకంటే, మనిషిలో విశ్వాసం సన్నగిల్లింది. మనిషికి ఆత్మవిశ్వాసం కొరవడింది. ఇక అతనికి ఆనందం ఎలా లభిస్తుంది? తన బతుకు తాను సుఖంగా నాలుగురోజులపాటు వెళ్లదీయగలనన్న ధైర్యం, నమ్మకం లేని వాడికి శాశ్వతమైన దైవానుగ్రహం ఎలా లభిస్తుంది?
విమర్శల కతీతుడను
శ్రీకృష్ణుడు ప్రేమ స్వరూపి. ఆయనను వశపరచుకోగల్గింది. ప్రేమ మాత్రమే. పొగరు ఆయన దరిదాపులక్కూడా చేరలేదు.
సినిమాలలో నటులు ఎంతో సహజంగా తమ హావభావాలను ప్రదర్శిస్తూ నటిస్తుంటారు. కాని అది నటన మాత్రమే కాని నిజం కాదు. సైంటిస్టుకు సైన్స్ సూత్రాలు కరతలామలకం కాని నేను ఎంత గొప్ప సైంటిస్టుకు కూడా అంతు బట్టను. నన్ను కొందరు దూషిస్తారు. మరి కొందరు భూషిస్తారు. ఇద్దరిని చూచీ నేను చేసేది మందహాసమే.

ఇంకా ఉంది