సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతి
సముద్రపు స్వభావం ఏమిటి? పొంగి పొరలి ముంచెత్తటం అయినా అది చెలియలి కట్టలోపలే ఒదిగి ఉంటున్నది. మేఘపు స్వభావం ఏమిటి తన జలాన్ని వర్షించటం త్యాగం. అందుకే అది అంత ఉన్నంత స్థాయిలో ఉంటున్నది. శాంతికి స్వభావం ఏమిటి? నిస్సంగం అందువలననే అది దేనికీ కలత చెందని స్థైర్యాన్ని మనిషికి ఇస్తుంది.
శాంతి ప్రార్థనను సాధారణంగా మూడు సారులు పలుకుతారు. ఓం శాంతి, శాంతిః శాంతిః అని ఎందుకని? శాంతి భౌతికంగానే కాదు. మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా కావాలి. మనిషి రౌద్రానికి గాని, భయానికి గానీ దాసోహం అనరాదు.
శాంతి పాఠం
శాంతి ఎలా లభిస్తుంది? ప్రేమ వల్ల , సేవ వల్ల ఇద భరత వర్షం అనాదిగా అనుసరిస్తున్న మార్గం. మహర్షులు, సాధువులు ఆనతిచ్చిన విధానం.
దైవభక్తులను నిరసించకు. ఉదారులు చేసే వితరణకు అడ్డుతగలకు శాస్త్ధ్య్రాయనాన్ని ఆటంకపరచకు. ఇవేవీ నీకు చేత కాకపోతే పోనీ, కనీసం ఇంకొకరు మంచిపని చేస్తుంటే చెడ్డగొట్టకు. ఇదే ఈ పవిత్ర భూమి చెప్పే పాఠం.
శాంతి ప్యాక్
భగవంతుడు నీకు శాంతిని ప్యాక్ చేసి ఇస్తున్నాడు. ప్యాక్‌ను తొలగించు. ఏవిధంగా ఐ వాంట్ పీస్ నాకు శాంతి కావాలి. ఇందుల మూడు పదాలుంటున్నాయి. ఈ ఐ (నేను) మరియు వాంట్ (కావాలి) అనేవి రెండే శాంతిని ప్యాక్ చేసి పెట్టాయి. ఎక్కడ? అనగా అహంకారము వాంట్ అనగా కోరిక, ఈ రెంటికీ నడుమ. ఈ రెండిని తీసివేస్తే శాంతి అక్కడే ఉంటుంది. శాంతిని వెదకటానికి కాలాన్ని వ్యర్థం చేసుకోనవసరం లేదు.
ఆత్మ వంచన
మానవుడంటే ఎవరు? అనంతుడే ! అమృత స్వరూపం! అయినా, ఈరోజు మనిషి మరణం అంటే భయం చెందుతున్నాడు. మనిషి ఆనంద స్వరూపం. అయనా అతడు సంసార తాపత్రయంలో పడి దుఃఖ భాజనుడౌతున్నాడు. దేహి శాంతిస్వరూపం. అయినా అతడు అంతటా అశాంతినే ఎదుర్కొంటున్నాడు.
ఆ ఆపన్నత ఎందుకు కలిగింది? ఆత్మజ్ఞానం లేకపోవడం వల్లనే ఆత్మ వంచన చేసి కుంటుండటం వల్లనే. తన్ను తాను తెలిసికుంటే, శాంతి, సంతోషం, అమృతత్వం అన్నీ సిద్ధిస్తాయి.
బుద్బుదం
అంతరాత్మే గొప్ప గురువు. కాలమే వైతాళికుడు. సృష్టే ఉత్తమస్మృతి . దైవమే దగ్గరి నేస్తం. జీవితం ఆయన కోసమే. బ్రతుకు ఆయన తోడిదే. ఉనికి ఆయన మూలంగానే కాలచక్రంలో ఈ సృష్టి కేవలం ఒక బుడగ మాత్రమే. విన్నా కన్నా ఆయనే. ఈ మాటలో విశ్వాసం ఉంచు. చిత్త శాంతి లభిస్తుంది.
చక్కని దారి
రామావతారం, కృష్ణావతారం వచ్చి ఏం చేశాయి. దుష్టశిక్షణ, శిష్ట రక్షణ అధర్మానికి అపజయం తప్పదని నిరూపించాయి.మనిషిలో మానవత్వమే కాదు, పశుత్వం, దైవత్వం కూడా ఉన్నాయి.
పశుత్వాన్ని వదిలించుకోలేక పోతే అది అతని దౌర్భాగ్యం. దివ్యత్వాన్ని పెంపొందించుకోలేకపోతే అది అంతకన్నా ఎక్కువ దౌర్భాగ్యం అవుతుంది. రామ, కృష్ణుల అవతార గాథలను మననం చేసుకోండి. వారి లీలలను, మహిమలనూ స్మరించండి. దివ్యత్వాన్ని పెంపొందించుకొనేందుకు అది చక్కని దారి.
‘చక్కని రాజమార్గముండగా’ అని త్యాగయ్య చేసిన గానం అర్థం ఇదే! ఆ రాజమార్గం నినె్నడకు తీసుకొని పోతుందో తెలుసా? శాంతి ఆనందాలు వర్షించే అనంతుని దివ్యధామానికి.
అంతరంగంలో అంతా శాంతి
భూగర్భంలో అంతటా నీటి పూట ఉంటుంది. కానీ మనకు కనిపించదు. కారణం? మ ధ్యలో అడ్డుగా ఉన్న దట్టమైన మట్టిపారే పానవుడు ప్రయత్నం చేసి ఆ మట్టిని తవ్వి వేసినప్పుడు ఆ నీటిని కనుగొంటున్నాడు. తోడుకొంటున్నాడు. ఉపయోగించుకుంటున్నాడు. అదేవిధంగా ప్రతి మానవుని అంతః కరుణలో శాంతి సౌభాగ్యమనే ప్రవాహం ఉంది. కామ, క్రోధ, మోహాదులు దట్టంగా దానిని కప్పివేసి మనకు కన్పించకుండా చేస్తున్నాయి. పురుష ప్రయత్నంచే వాటిని దూరం చేసికొంటేశాంతి సౌభాగ్యాల ననుభవించవచ్చు.
నా కార్యక్రమం
మానవాళి పట్ల నాకున్న ప్రేమతో సమానమైనది వేదాల పట్ల నాకున్న ప్రేమ నాముందున్న కార్యక్రమం ఏమిటో చెబుతున్నాను. బాగా గుర్తు పెట్టుకోండి. అది నాలుగు విధాలు. ఒకటి వేదపోషణ, రెండు విద్వత్ పోషణ, మూడుధర్మ రక్షణ, నాలుగు భక్త రక్షణం, నా అనుగ్రహాన్ని మహిమనూ ఈ నాలుగు దిశలా జరుపుతూ నేను కేంద్రంలో శాంతి బిందువుగా ఉంటాను.

ఇంకా ఉంది