సబ్ ఫీచర్

కళ్లు తెరిపించే కావ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు
రచయత: ముదిగొండ వీరభద్రయ్య
92462 76573
డా. అప్పం పాండయ్య
కార్యదర్శి, తెలుగు విజ్ఞాన పరిషత్తు
ఫోన్ నెం. 97030 79900
*
జాతి విపంచీగానం చదువుతున్నాను. 2019 డిసెంబర్ 15 వివిధ ఛానళ్లలో వివిధాంశాలు వస్తున్నాయి. ఒకటి రెండు హిందీ ఛానళ్లలో భగవా వస్త్రావరణంతో వున్న వివేకానందుని విగ్రహాన్ని చూప్తిన్నారు. ఆ వస్త్రం క్రిందిభాగం ఎవరు చించారో! పాదపీఠంపైన భగవా.. జలేగా (్భగవా కాలగలదు) భగవా నాశనమవుతుంది అని అర్థం. ఢిల్లీలోని జె.ఎన్.యు. ప్రాంగణంలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేసిన స్వామి వివేకానందుల విగ్రహమది. జిహాదీల పక్షాన నిలబడి ఆజాదీ.. ఆజాదీ.. అని అరిచే టుక్‌డా టుక్‌డా గ్యాంగుల పని అని ఛానళ్ల విశే్లషకులు తేల్చేరు.
డెబ్భయ్యేళ్ల స్వాతంత్య్రానంతరం కూడా దురాక్రమణల శక్తుల ప్రభావానికి లోనైన దేశ గౌరవాన్ని కించపరిచే, పరాయి జాతి మత దేశాల పాలనను ఆహ్వానించే శక్తులు ఈ దేశంలో ఉన్నాయనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకేంకావాలి!
స్వయమేవ మృగేంద్రరా.. ఈ దేశ అస్తిత్వానికి మూలాధారాలేంటో శోధించి ప్రబోధించిన స్వామి వివేకానందులను గౌరవించని విదేశీ భావ బానిసలు కళ్లు తెరచేదెప్పుడు! ఈ జాతి విపంచీగానం విడేదెప్పుడు!!
దురాక్రమణ శక్తుల ధాటికి ఈ దేశ రాజదండం మట్టిగరచినపుడల్లా, ఈ దేశ ప్రజానీకాన్ని ధర్మదండం చైతన్యవంతం చేసింది.. అన్నారు శ్రీ గురూజి.
ఆ ధర్మదండధారులే యోగులు- తత్త్వవేత్తలు - దార్శనికులు- కవులు- రచయితలు.
వక్త్ కీ పుకార్ (కాలం పిలుపు)ననుసరించి ఓ బుద్ధుడు, ఓ ఆదిశంకరులు, ఓ వివేకనాందులు, ఓ నేతాజీ, ఓ గాంధీజీ, ఓ అరవిందులు, ఓ రమణులు ఆవిర్భవించిందిందుకే!
లేకుంటే క్రీ.శ. 712లో ప్రారంభమైన విదేశీ దాడులు, ఇక్కడ విధ్వంసం సృష్టించి, చంపినంతమందిని చంపి, దోచుకొన్నంత దోచుకొని, ఈ జాతి ధన మానప్రాణాలపై విలాస విహారాలు చేసి ఓడిపోయి భరతజాతి అస్తిత్వాన్ని భంగపరచలేమని పారిపోయినా, వారు నాటిన విషబీజాలింకా ఉన్నాయి. ఆ విషబీజాల విషధూపమే దేశ రాజధానిలోని భగవా.. జలేగా నినాదం.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా భరతజాతి అస్తిత్వాన్ని పెకలించే ప్రయత్నాలు జరుగుతాయని ఊహించిన స్వామి శివానంద (పూర్వ రాష్టప్రతి అబ్దుల్ కలాం గురువు) జాతీయ ప్రవర్తనా నియమావళిని ప్రకటించారు, ప్రచారం చేశారు.
1. దేశభక్తి (పేట్రియాటిజం) 2. కర్తవ్యం (డ్యూటీ) 3. ప్రవర్తన లేదా శీలం (క్యారెక్టర్), 4. ఆరోగ్యం (హెల్త్); 5. సద్గుణం (వర్చ్యూ), 6. ప్రజాసంపద (పబ్లిక్ ప్రాపర్టీ) 7. ఒకే కుటుంబం (ఒన్ ఫ్యామిలి), 8. మతం (రిలిజియన్) 9. అహింస (నాన్ వాయిలెన్స్), 10. ఆర్థిక వ్యవస్థ (ఎకానమీ), 11. శాసనం (లా), 12. భూతదయ -కరుణ (మెర్సి) 13. ఆవరణ శాస్త్రం (ఎకాలజి), 14. ఐకమత్యం (యూనిటి), 15. విద్య (ఎడ్యుకేషన్)
వీటికన్నిటికీ వివరాలిచ్చారు. ఈ జాతీయ ప్రవర్తనా నియమాలు ఈ దేశం మొదటినుంచి పాటించింది. అందుకే ఈ జాతి ఉంది. మరిచిపోయిన వారిని మేలుకొల్పుటనే మహాత్ములు చేసేది. శివభారతకర్త శ్రీ గడియారం వేంకటశాస్ర్తీ ఇదే చేశారు.
చెదరిపోయిన అంగముల్ కుదురు పరచి / సడలు వారిన తంతువుల్ చక్కదీర్చి / అనుగత శ్రుతి భువన మోహనముగాగ
హాయి పలికింపలెమ్ము జాతీయవీణ (శివభారతము- 178)
ఇదే జాతి విపంచీగాన జాతీయ కావ్యం ద్వారా ధ్వనిమంతంగా కావ్య మర్యాదలననుసరించి శిల్పీకరించారు ప్రొ. ముదిగొండ వీరభద్రయ్యగారు. భారతీయ కళాతత్త్వ శాస్త్రాల్ని కూలంకషంగా అధ్యయనం చేసి అధ్యాపనం చేసి యువ సాహితీవేత్తలకెందరికో మార్గదర్శనం చేస్తున్న ఆధునిక సాహిత్య శాస్త్ర దార్శనికులు శ్రీ వీరభద్రయ్యగారు.
ప్రపంచవ్యాప్త మానవ సమాజాలననన్నిటినీ / ఏకజాతిగా పరిణమింపజేయడానికి/ సహస్రాబ్దాలుగా పూనుకొన్న జాతి/ ఎనె్నన్నో రకాల పూలమొలకలున్నా / వాటి ప్రసూనాలు ప్రసరించే సుగంధాల ఏకతనే / ఆదర్శంగా తీసికొని నిరంతరం యత్నిస్తున్న జాతి...
జీవాత్మ విశ్వాత్మగా పరిణమించడం లేదా జీవాత్మలో విశ్వాత్మ ఉండడం, విశ్వాత్మ చుట్టూరా జీవాత్మ ఉండడం అన్న ఒక తాత్త్విక నేపథ్యంతో ఈ జాతి ప్రవర్తించింది. ఆ విషయానే్న పరమ సత్యంగా ప్రతిపాదించారు. పై పాదాల్లో శ్రీ వీరభద్రయ్యగారు.
మనుర్భవ (మనిషిని కమ్ము) మాతా పృథ్వీ పుత్రా హం పృథివ్యాః ఏకః పరాత్మాబహు దేహవర్తీ, సర్వేజనాః సుఖినోభవన్తు, ఏకంసత్ విప్రా బహుధా వదన్తి, మహాజనోయేన గతః సపంథాః ఇలాంటి వాక్యాలన్నీ ప్రేరణనివ్వగా, జాతీయతా వికాసానికి అనేక వాదాలు (దృకక్పథాలు) జాతీయోద్యమ కాలంలో ఆవిర్భవించాయి. జాతి విపంచీగానం కావ్యాధ్యయన నేపథ్యంలో వీటిని గూర్చి ఆలోంచించాలి.
1. రాజా రామోహనరాయ్- ఏకేశ్వర / బ్రహ్మవాదం 2. కేశవచంద్రసేన్ - జానవాదం 3. దయానంద సరస్వతి - ఆర్షధర్మవాదం 4. శ్రీరామకృష్ణ పరమహంస- వేదాంతవాదం, 5. అనీబిసింట్ - దివ్యజ్ఞాన సమాజం 6. స్వామివివేకానంద - ఆధ్యాత్మిక జాతీయవాదం, 7. స్వామి రామతీర్థ - విశ్వవేదాంతవాదం, 8. రవీంద్రనాథ ఠాగూరు - జాతీయవాదం, 9. మహాత్మాగాంధీ - ఆదర్శ రామరాజ్యం, 10. అరవింద యోగి - అఖండ భారతవాదం, 11. మానవేంద్రనాధ్ రాయ్ బౌద్ధ (నవ్య0 మానవతావాదం, 12. లోకమాన్య తిలక్ - స్వాతంత్య్ర / స్వరాజ్యవాదం, 13. బంకించంద్ర ఛటర్జి - మాతృవాదం (వందేమాతరవాదం) 14. నేతాజీ -జైహింద్ వాదం, 15. స్వాతంత్య్ర వీరసావర్కర్ - హిందూ రాష్టవ్రాదం, 16. డాక్టర్జీ - సాంస్కృతిక రాష్ట్రీయవాదం, 17. అంబేద్కర్- సామాజిక న్యాయవాదం, 18. దీనదయాల్ ఉపాధ్యాయ - ఏకాత్మ మానవతావాదం, 19. స్వామి శివానంద - దివ్య జీవన (సమరసత)వాదం, 20. శ్రీ గురూజీ - సాంస్కృతిక జాతీయవాదం, 21. స్వామి చిన్మయానంద- భారత జాతీయవాదం, 22. నారాయణ గురు - సమతావాదం, 23. సద్గురు మలయాళ స్వామి - జీవదేవాభేదం, 24. కందుకూరి వీరేశలింగం -సంస్కరణవాదం.
ఒక్కమాటలో వీరి వ్యక్త్విమూర్తిమత్వాలను అంచనా వేయలేం. జాతి చైతన్యానికి, స్వాతంత్య్రానికి, వికాసానికి ఈ మహానభావుల యోగదానం నిత్య స్మరణీయం.
తెలుగులో ఈ మార్గంలో నడచిన గరిమెళ్ళ, ఉన్నవ, అడివి, తుమ్మల, రాయప్రోలు, విశ్వనాథ, సురవరం, మాడపాటి, బూర్గుల, దువ్వూరి, జాషువా, కృష్ణశాస్ర్తీ, కరుణశ్రీ, దాశరథి, సినారె, మధునాపంతుల, శేషశాస్ర్తీ, దుర్భాక, వీరభద్రశాస్ర్తీ, పుట్టపర్తి, సంపత్కుమార, సుప్రసన్న, వేనరెడ్డి...
ఇలా ఇలా ఓ వందమంది తెలుగు కవి పండితులను (రచయితలను) పేర్కోవచ్చు. అందరిదీ జాతివించీగానమే. బంకిం వందేమాతరం, ఠాగూర్ ‘వేర్ ది మైండ్ ఈజ్ వితవుట్ ఫియర్’, రాయప్రోలు ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా’, గురజాడ ‘దేశమును ప్రేమంచుమన్నా’, దాశరథి ‘జెండా ఒక్కటె మూడు వనె్నలది..’ ఇవన్నీ తెలుగువారు మరచిపోలేరు.
భరతజాతి సత్త్వమ్మును / పరీక్షించబోకుము / అది సహనానికి ఏలిక / సమరానికి కాళిక.. అన్న సినారె జాతీయతా స్ఫూర్తిని గుర్తుంచుకొంటాం! ఇది భూత భవిష్యత్ వర్తమానాల కాలాల్లో స్ఫూర్తినిచ్చే అంశం. కవుల - రచయితల నుండి అందరం ఆశించేది ఇటువంటి ప్రేరణే. ఈ దృక్పథానే్న ప్రతిబింబించి చైతన్యం నింపే జాతి వింపచిగానంలోని ఈ పాదాలు చూడండి!
..రజస్తమనస్సుల ననుక్షణం అణచివేస్తూ / కేవల సత్వానే్న భుజించి / లోకానికి ఆదర్శానిచ్చిన అద్భుత జాతి / భరతజాతి..
ఇది మూలాధారంగా నిలిచింది అంటారు వీరభద్రయ్యగారు. అలా ఈ జాతి బలిష్టం కావాలి. అందుకే ఈ విపంచీగానం అంటారు కవి.
..జాతిని బలిష్టం చేస్తూ కొత్తవాటిని / సహృదయంగా స్వీకరిస్తూ / అంతర్జాతీయతను నిజంగా లక్ష్యం చేసికొన్న / నిజాయిపరుల కోసం
భవ్య కవితావేశ వీణియపై గానంగా
తదాశయాన్ని వినిపిస్తున్న శుభముహూర్తం ఇది.
ఈ గానం జనంలోకి వెళ్లడానికే భవ్య కవితావేశం. కవి వ్రాస్తాడు; విమర్శకుడు విశే్లషిస్తాడు; ఉపన్యాసకుడు తన ప్రసంగంలో ఈ మాటలుదాహరించి దేశ కాల పరిస్థితులకు అన్వయించి జన మానసాన్ని నిర్మాణం చేస్తాడు. ఈ విషయంలో ప్రచార విభాగం (్ఫర్త్ ఎస్టేట్) తన రంగు కళ్లదాలు వదిలిపెట్టి వివేచన చేస్తే సత్యం విశ్వం ముందు నిలుస్తుంది. విశ్వశ్రేయఃకావ్యమ్ అన్న తెలుగు కవి ఆశయం నెరవేరుతుంది.
ఇన్ని ఆలోచనలకు తావిచ్చే, మన అస్తిత్వాన్ని మనం నిలుపుకోడానికి ఒక అఖండతత్త్వధార ఉన్నదని మార్గదర్శనం చేసే ఈ జాతీయకావ్యాన్ని చదువుదాం! భూత భవిష్యత్ వర్తమానాల్ని జోడించి వివేచించుకొందాం! జాతి తాత్త్విక భూమిక మీద ఆవిర్భవించిన ఈ జాతీయ కావ్య రచయితను అభినందిద్దాం!

- ఆచార్య కసిరెడ్డి 9866956250