సబ్ ఫీచర్

ఆరేళ్లు.. 64 పతకాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లబ్ది సురానా వయస్సు కేవలం ఆరు సంవత్సరాలు. ఈ ఆరు సంవత్సరాల్లోనే ఈ బుడత 64 పతకాలను సంపాదించేసింది. ఎలాగంటారా.. లబ్ది సురానాకు స్కేటింగ్ అంటే మహా ఇష్టం. మూడు సంవత్సరాల వయస్సు నుంచే స్కేటింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టిన లబ్ది ఎనిమిది అంతర్జాతీయ పతకాలను సైతం గెలుచుకుంది. ఇటీవల రాష్టప్రతి నుంచి అవార్డు అందుకుంది లబ్ది. రోజూ ఉదయానే్న ఐదు గంటలకు నిద్ర లేవడంతో లబ్ది దినచర్య మొదలవుతుంది. వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని స్కేటింగ్‌కు రెడీ అవుతుంది. తరువాత ఇంటికొచ్చి స్నానం చేసి అల్పాహారాన్ని తిని స్కూలుకు వెళ్లిపోతుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత కొద్దిసేపు చదువుకుంటుంది. తరువాత జిమ్నాస్టిక్స్ క్లాస్‌కి వెళుతుంది. అక్కడి నుంచి మళ్లీ స్కేటింగ్‌కు వెళ్లిపోతుంది. రాత్రి ఇంటికి వచ్చి భోజనం చేసి నిద్రపోతుంది. ఇంత చిన్న వయసులోనే బిజీగా గడుపుతూ.. స్కేటింగే లోకంగా బతుకుతోంది లబ్ది. అంతేకాదు.. లబ్దికి క్రమశిక్షణ చాలా ఎక్కువ. ఏదైనా పని చేయాలని చెబితే వెంటనే చేసేస్తుంది. ఆ నిబద్ధతే ప్రెసిడెంట్ నివాసం దాకా తీసుకెళ్లి, రెడ్ కార్పెట్‌పై నడిచేలా చేసింది.. ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ గర్వంగా కళ్లలో నీళ్లు నింపుకుంటుంది లబ్ది తల్లి అంజలి సురానా. ‘కెరటాలకు భయపడే పడవ సముద్రాన్ని దాటలేదు. ప్రయత్నాన్ని ఆపని వాళ్లు ఎప్పటికీ ఓడిపోలేరు.. పడిపోతే లేవడం, మళ్లీ కింద పడటం సహజం. ఈ మాట వినడానికి కరకుగా ఉన్నా.. ఇదే నిజం’ అనే వాక్యాలు లబ్దికి చాలా ఇష్టం. ఇంత చిన్న వయసులో ఈ వాక్యాలకు అర్థం ఎలా తెలుసో తెలీదు కానీ.. ఈ అమ్మాయికి ఈ వాక్యాలు చాలా ఇష్టం. వీటి అర్థం కూడా చాలా చక్కగా వివరిస్తుంది. అంతేకాదు.. లబ్దికి మేకప్ వేసుకోవడం కూడా చాలా ఇష్టం. స్కేటింగ్, జిమ్నాస్టిక్, మేకప్, చదువంటే ఇష్టపడే లబ్దికి.. ‘అన్నింటికంటే అమ్మంటే మరీ మరీ ఇష్టం. ఎందుకంటే ప్రపంచంలో అందరికంటే బెస్ట్ మా అమ్మనే’ అంటూ ఎంతో ముద్దుగా చెబుతుంది.

-మహి