సబ్ ఫీచర్

ధ్యానంతో ఒత్తిడి దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి నిత్యం ఒత్తిడికి గురవుతున్నాడు. కొన్ని సందర్భాలతో ఒత్తిడివల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. ఒత్తిడిని తట్టుకొని ధైర్యంగా నిలబడిన వ్యక్తులు ఉన్నత స్థానాలకు చేరుతారు. వాస్తవానికి స్ట్రెస్ అనేది తరతరాల నుంచి వారసత్వంగా వస్తోంది. ఒక స్థాయి వరకూ ఒత్తిడి మంచిదే అయినా అది నిత్య జీవితంలో భాగం అయిపోతే పరిస్థితి చేయిదాటిపోతుంది. ఒత్తిడికి కారణంగా శరీరంలో విడుదలయ్యే యాసిడ్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం ఓ వ్యక్తి ఆఫీసుకు వెళ్ళే సమయంలో ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయి ఆలస్యం అయినప్పుడు ఎదుర్కొనే ఒత్తిడి అడవిలో సింహాలు వెంటపడుతున్నప్పుడు జిరాఫీలు, జీబ్రాలకు కలిగే ఒత్తిడితో సమానంగా ఉంటుందట. ఇలాంటి ఒత్తిడులన్నీ మెడిటేషన్‌తో మటుమాయం అవుతాయి. ప్రశాంత వాతావరణంలో మెడిటేషన్ సాధన చేయడంవల్ల మెదుడు రిలాక్స్ అయి ఒత్తిడి దానంతట అదే దూరం అవుతుంది.
ధ్యానం ప్రధానం
ప్రతిరోజూ ధ్యానం చేస్తే భావోద్వేగాల విషయంలో శక్తివంతమైన పట్టు సాధించడానికి దోహదపడుతుంది. ధ్యానం చేయడంవల్ల మెదడు చాలా ప్రశాంతంగా వుంటుంది. అలాగే వెంటనే కోపం రాకుండా ఉంచుతుంది ధ్యానం. దీంతో మానసికంగా ఎటువంటి ఒత్తిళ్ళూ ఉండవు. శరీరం కూడా ప్రశాంతంగా వుంటూ ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ సమయానుకూలంగా ధ్యానం చేస్తే చాలా మంచిది.
మెదడును చెలాకీగా పనిచేయించుకోవడం మన చేతుల్లో వుంది. ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఇవి జ్ఞాపకశక్తి మెరుగుపరుచుకోవడానికి దోహదం చేస్తాయి. మెదడు సమర్థవంతంగా పనిచేయాలంటే ధ్యానం, యోగా, పోషక విలువలు గల ఆహారం, శారీరక, మరియు మానసిక వ్యాయామాలు ఎంతో దోహదం చేస్తాయి.
అరగంట కేటాయించండి
రోజూ ఒక్క అరగంట ధ్యానంకోసం కేటాయిస్తే చక్కటి శారీరక మానసిక ఆరోగ్యం మీ స్వంతం అవ్వడమే కాదు, ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు అన్నీ నెరవేరుతాయని చెబితే నమ్మగలరా? నమ్మలేం కదూ? కానీ ఇది నిజం. అదెలా సాధ్యమంటే, ప్రయత్నిస్తే తెలుస్తుంది సాధ్యమా కాదా అనేది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేవరకూ ఎంతసేపు మాట్లాడతాం ఎప్పుడైనా లెక్కేసారా? పోనీ ఎంతసేపు వౌనంగా ఉండగలరో ప్రయత్నించారా? ఆలోచనలు స్థిరీకరణ చేసుకొని ధ్యానం చేసే ప్రయత్నం చేయండి. విజయం మీ స్వంతం అవుతుంది.
ధ్యానం దగ్గర చేస్తుంది
రోజంతా ఎవరెవరితోనో మాటలు, వాదనలు, కోపాలు, అరుపులు.. అక్కడితో ఆగిపోతుందా.. లేదు. అవన్నీ మనసులో చేరి ఆలోచనలుగా మారి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వదిలించుకోవడం ఎలాంటంటే సింపుల్. కాసేపు వౌనంగా కళ్ళు మూసుకుని ధ్యానదీక్షలోకి వెళ్లండి. ఏకాగ్రత శ్వాసపై ధ్యాస పెట్టగలిగితే చాలు.. ఆ తరువాత అంతకుముందువరకూ వున్న చికాకు ఇట్టే మాయం అవుతుంది. ధ్యానం మనల్ని మనకు పరిచయం చేస్తుంది.
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
ధ్యానంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో వుండే వారి మాటలు సూటిగా, స్పష్టంగా ఉంటాయి. బెదురు బెరుకు అవసరమైన కబుర్లలాంటివి. వృధా సమయం వీరికి ఉండదు. ఈ అలవాటు ఎదుటివ్యక్తులకు మనపై నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుతుంది. ఆచి తూచి మాట్లాడడం చేతకానితనం కానే కాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును, నమ్మకాన్ని తెలియజేస్తుంది. చేజారిన కాలం పెదవి దాటిన పలుకు వెనక్కి రాదు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలిసితీరాలి. ధ్యానంతో మాటల్లో నోరు జారకుండా అదుపు చేసే ఆలోచనాశక్తి పెరుగుతుంది. మనపై మనకు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.
పరిస్థితులు మన గుప్పెట్లోనే..
ఉదయం లేచినదగ్గరునుంచీ అన్నిరకాల అనుభూతులు, భావాలు, ఆలోచనలు పట్టి పీడిస్తుంటాయి. వాటి ప్రభావం మనసుపై పడుతుంది. దాంతో ఒత్తిడి, చికాకు మొదలై మన మాటలపై, చేతలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగా సంబంధాలలో కోపతాపాలు, ఆరోపణలమధ్య ఇరుక్కుంటారు. వీటన్నిటి ప్రభావం మనసుపై చక్రంలా తిరిగినట్టు ఒకదానివల్ల మరొకటి ఏర్పడి ప్రమాదాల్లో చిక్కుకునేలా చేస్తాయి. ఈ చక్రాన్ని ఆపే అవకాశం మన చేతుల్లోనే వుంది. అదే ‘్ధ్యనం’. ఆ ధ్యానంలో ఏ ఆలోచనలూ ఉండకూడదు. ప్రశాంతంగా మనసుతో మమేకమై, ఓ పది నిమిషాలు అయినా ఉండగలిగితే చాలు. ఫలితం ఏమిటన్నది చెప్పడం ఎందుకూ? ఇక మీరే తెలుసుకోవచ్చు. ఒకసారి ఆ ప్రశాంతతను రుచిచూశాక దాని గురించి మీరే మరో పదిమందికి చెబుతారు.

- డా॥ అట్ల శ్రీనివాస్‌రెడ్డి 9703935321