సబ్ ఫీచర్

సైనిక సోదరులకు కృతజ్ఞతా సందేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరిహద్దుల్లో రక్షణ కవచంలా నిలుస్తూ, విధి నిర్వహణలో అహరహం అంకితమవుతున్న సైనికుల కోసం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. సైనికుల కోసం ప్రత్యేకంగా ఒక మువ్వనె్నల గీతం విడుదల చేయాలని సంకల్పించింది. మరోవైపు సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు ‘కృతజ్ఞతా పూర్వక సందేశాలు’ పంపేందుకు కేంద్ర జౌళి శాఖ అవకాశం కల్పించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఖాదీ వస్త్రాలపై ప్రజలు సందేశాలు రాస్తే వాటిని సైనికులకు అందజేస్తామని కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రకటించారు. ఇందుకోసం దేశంలో 70 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలలో వేదికపై ఖాదీ వస్త్రాన్ని ఏర్పాటు చేస్తామని, ప్రజలు వారి సందేశాలను దానిపై రాయాలని ఆమె సూచించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.