సబ్ ఫీచర్

మరుగున పడిన తురగ వల్గనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మఱుగున పడిన మహాకవి
తురగా వెంకమరాజు
రచన: కొల్లా శ్రీకృష్ణారావు
ప్రతులకు: రచయిత
రోహిణీ టవర్స్,
2-11, బ్రాడీపేట
గుంటూరు- 522002
ఫోన్: 9440033715
*
దాదాపు అర్ధశతాబ్దానికి పూర్వం ఆచార్య బి.రామరాజుగారు తెలంగాణాలో మఱుగున పడిన మాణిక్యాలు శీర్షికతో కొందరు సూర్యం పశ్యులను పరిచయం చేశారు. సాహిత్య చరిత్రలో ఇలాంటి సంఘటనలు సాధారణమే. కొన్ని శతాబ్దాలుగా మరుగున పడిన భాష నాటక చక్రం ఒక సముహూర్తంలో కేరళలో 20వ శతాబ్ద ప్రారంభంలో ఒక్కసారి లబ్ధమై అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే ప్రాచీన కవులంతా భాసోహాసం అంటూ కైమోడ్పు గడించినవారే కాని ఆ పుస్తకాలు ఏవీ?
ఇలాంటి సంఘటనలే తెలుగులో కొన్ని జరిగాయి. సి.పి.బ్రౌను దొర పూనుకోకపోతే ఎన్నో ప్రబంధాలు శతకాలు నామా వశిష్టమైపోయేవే. ఈ సంగతులన్నీ ఎందుకు ముచ్చటించుకోవలసి వచ్చిందంటే తురగా వెంకట రాజకవి మరీ అంత ప్రాచీనుడేమీ కాదు. 1846లో జన్మించి 1911వరకు గుంటూరు జిల్లాలో జీవించినవాడు. బహుశా ఆరోజుల్లో ఇది అవిభక్త కృష్ణాజిల్లా కావచ్చు. ఐనా ఆయన రచనలు అలభ్యం. కాలపురుషుని పద ఘట్టనలో తురగా వేంకట రామకవి కనుమరుగైనాడు.
ఇటీవల గుంటూరులో ఒక సహృదయ సాహితీ విమర్శకుని దృష్టి ఈ కవిగారి ప్రాచీన సాహిత్యానుశీలనంపై పడింది. ఆ పరిశోధక రచయిత పేరు కొల్లా శ్రీకృష్ణారావు. వీరి జన్మస్థలం గుంటూరు జిల్లా పెదకూరపాడు. లోగడ చాలా పద్యగద్య విమర్శనాత్మక రచనలు చేసి సుప్రసిద్ధులైనారు. ఏటుకూరి వారి వీర వనితలు, పౌరుషజ్యోతి, బాలచంద్రుడు వంటి రచనలలో కొన్ని పాఠ్యగ్రంథాలుగా కూడా రాణకెక్కాయి. ఈ సాహితీమూర్తి దృష్టి ఇప్పుడు తురగా వెంకటరాజ సాహిత్యంపై ప్రసరించడం యాదృచ్ఛికమో దైవ నిర్ణయమో తెలియదు. ఆయన రచనలకు హృదయోల్లాస సుగంధ వ్యాఖ్య అందించాలనే కోరిక కొల్లావారికెందుకు కలిగిందో కూడా తెలియదు. ఇంతటి మహాకవిని విస్తృత ఆంధ్ర కవుల జాబితాలో తెలుగువారు చేర్చే దౌర్భాగ్యం ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. తురగా రామకవి- తురగా వెంకట రాజకవి ఒకరేనా? ఔనని కొల్లావారి తీర్పు.
‘’సూరకవి తిట్టుకంసాలి సుత్తి పెట్టు
రామకవి దెబ్బ పెద్ద ఫిరంగి దెబ్బ’’ ఇదొక ఆభాణకము.
ఫిరంగి శబ్దము చేత ఈతడు బ్రిటీషు యుగమునాటి వాడు అనేది సుస్పష్టము.
తురగా వెంకటరాజకవి (వెంకమకవి) క్రీ.శ.1846లో జన్మించి 1911వరకు జీవించినట్లు చారిత్రకాధారాలున్నాయి. అంటే వీరు జన్మించే నాటికి సిపాయిల తిరుగుబాటు జరుగలేదు. పిండారీలు మరాఠీ మూకలు తెలుగు దేశాన్ని దోచుకుంటూ ఉండేవారు. తురగావారి బాల్యంలో సావిత్రీ సత్యవంతుల రచన వెలువడింది. తర్వాత శమంతకోపాఖ్యానం రచించారు. నిర్వచన భగీరధము దశకుమార చరిత్ర (అనువాదమో స్వతంత్రమో తెలియదు.) కీర్తిమాలినీ పరిణయము వీరికి ఎంతో కీర్తితెచ్చిపెట్టింది. ఈతడు కృష్ణానదీ తీరస్థమైన అమరావతి మండలములోని మునుగోడు గ్రామవాస్తవ్యుడు. వెంకటకవి, వెంకయ్య వెంకమరాజులు వ్యావహారిక నామములు. తల్లి సుభద్రమ్మ తల్లి పిచ్చయామాత్యుడు. అమాత్య శబ్దముచేత ఇతడు ఆరువేల నియోగి శాఖకు చెందినవాడని సుష్పష్టము. వీరు ఆపస్తంబ సూత్రులు శౌనక ఋషి గోత్రుడు. తాను నయకళాయుగంధరుడనని చెప్పుకున్నాడు. ఇది బిరుదమో విశేషణమో తెలియదు. వీరి తాతతండ్రులు పండిత చక్రవర్తులని తానే విన్నవించుకున్నాడు. ఈతడు ఆశుకవి. శాపానుగ్రహ సమర్ధుడు. దీపాల పిచ్చయ్యశాస్ర్తీగారి పరిశోధనలో మర్యాదరామన్న గ్రంథములను రచించినది ఈ తురగావారేనని తెలుస్తున్నది కాని దీనిని కొల్లావారు పూర్తిగా సమర్ధించలేదు. తురగా రామకవి ఆడిదము సూరకవి సమకాలికులా? తిట్టుకవి అని పేరుపొందినదెవరు? ఈయన గ్రంథములలో ఎట్టి తిట్టును కన్పడదు- తురగా వెంకటకవి పేరుతో ప్రసిద్ధములైన చాటుపద్యములు ఎవరివి?? జయంతి రామయ్య పంతులుగారు ఈ కవిగారిని స్వయముగా దర్శించి పంచరత్నములు వ్రాసినట్లు తెలుస్తున్నది. అప్పటికే తురగావారి ఆరోగ్యము క్షీణించింది. తురగా కవిగారి భార్య అచ్చమాంబ. వీరికి సుబ్బారావు శేషగిరిరావు, కోదండరామయ్య పుత్రులు. పార్వతమ్మ రుక్మిణమ్మ శేషమ్మ పుత్రికలు. రెండవ కుమారుడు తన భార్య తన కన్నులముందే మరణించటం ఈ కవిశేఖరుడు తట్టుకోలేక వియోగంతో వ్రాసిన పద్యాలున్నాయి.
ఈ కవి జన్మించింది వికసించింది జన పదములలోనే. అందువలన సందర్భోచితంగా సజీవచిత్రణ చేయగలడు. ఈ పద్యం చూడండి:
‘‘పృధురంధ్ర కుండలాన్విత కర్ణములతోడ/ గనకంపు ముంగెరకాడ తోడ/
బలుగూడకట్టునాగుల కోకతో సంధి/ కట్టుమించిన కంచుకంబుతోడ/
గడవెండి మురుగులుగలరాజు గమితోడ/ దిరమైన మెడపైడి తీవ తోడ/
బహిరంగ గుచుకన్పట్టు బొక్కిలితోడ/ గాటైన పొగాకు నీటి తోడ/
డాలుమించినవాని యిల్లాలు కట్లు/
పీటపై వాటముగనుండ తేటి మ్రోత
తోటి దీటుగా మోగెడు రాట మొకటి’’
బోటులను గూడి నడుచు బొలుచునింట’’
(మర్యాదరామన్న 3-10)
కొల్లా శ్రీకృష్ణారావుగారు 1928లో పెదకూరపాడులో జన్మించారు. అధ్యాపక వృత్తి నిర్వహిస్తూ పాత్రికేయం, పద్యరచన జోడుగుర్రాల స్వారీగాచేశారు. వీరికి లోగడ కృతులు ఎంతో ప్రశస్తి తెచ్చిపెట్టినప్పటికీ ఈ మరుగున పడిన మాణిక్యాన్ని వెలుగులోనికి తీసుకొని రావటం వలన వారి కీర్తి ఇనుమడించింది. ఇది పరిమితమైన మార్పులతో ఒక ఎం.్ఫల్. సిద్ధాంత గ్రంథస్థాయిలో ఉంది. తురగ మనగా హయము. ఈతడు హయగ్రీవుడు. రచయిత శ్రమ సార్ధకమయింది.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్