సబ్ ఫీచర్

హమ్మయ్య నీళ్లొచ్చాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ జిల్లాలోని కనగల్ మండలం ధర్వేశిపురం రేణుకాఎల్లమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కృష్ణా పుష్కర ఘాట్‌కు రెండో రోజు మధ్యాహ్నం కృష్ణమ్మ బిరబిరమంటు వచ్చేసింది. ఎఎమ్మార్పీ ఎత్తిపోతల పథకం కాలువ ద్వారా కనగల్, ధర్వేశిపురం పుష్కర ఘాట్‌లకు నీరందించేందుకు మూడు రోజుల క్రితం 5 వేల క్యూసెక్కుల కృష్ణా నీటిని వదిలారు. ఈ కృష్ణా జలాలు ధర్వేశిపురం ఘాట్‌కు ఆలస్యంగా శనివారం మధ్యాహ్నం 12-30కు చేరుకున్నాయి. అప్పటిదాకా వచ్చిన భక్తులు చుక్కనీరు లేని ఖాళీ ఘాట్‌ను చూసి జల్లు స్నానాలు సైతం చేసే ఏర్పాటు లేక వెనుతిరిగిపోయారు. తదుపరి మధ్యాహ్నం పిదప బిరబిరమంటు ఘాట్‌కు కృష్ణా జలాలు రావడంతో అక్కడికి వచ్చిన భక్తులు ఉత్సాహంగా కృష్ణమ్మ స్వాగతం పలుకుతు ఘాట్‌లో స్నానాలు ఆచరించి సమీపాన ఉన్న ప్రసిద్ధ రేణుకాఎల్లమ్మ దేవాలయంలో దర్శనాలు చేసుకున్నారు. నీళ్ల రాకతో ఇక్కడ పుష్కర స్నానాలకు శనివారం మధ్యాహ్నం ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి సమక్షంలో పురోహితులను పూజలు నిర్వహించి అధికారికంగా ప్రారంభించారు.

- ఆంధ్రభూమి విలేఖరి, కనగల్