సబ్ ఫీచర్

‘వరలక్ష్మి’ వెళ్లిపోయింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుష్మాస్వరాజ్ రాజకీయ నాయకురాలు అయినప్పటికీ.. ఎక్కడికి వెళితే అక్కడ మాటలతో కాక మనసుతో బంధాలను పెనవేసుకుంటుంది. మానవత్వంతో, ప్రేమతో, దయతో మనుషులందరినీ దగ్గరికి తీసుకునే మహనీయమూర్తి ఆమె. అందుకే బళ్ళారి వాసులకు ఆమె ఆడబిడ్డ అయ్యింది. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం బళ్ళారి ఎన్నికల్లో సోనియాగాంధీపై పోటీ చేసింది సుష్మాస్వరాజ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా ఊర్లు తిరిగింది. చాలా ఇళ్లకు వెళ్లింది. ఆ క్రమంలో వరలక్ష్మీ వ్రతం వచ్చింది. గాలిజనార్దన్‌రెడ్డి కుటుంబం ఆమెను పూజకు ఆహ్వానించారు. పసుపుకుంకుమల కోసం వెళ్లింది. పూజలో పాల్గొంది. పసుపుకుంకుమలు తీసుకుంది. వెళ్లేటప్పుడు గెలిచినా.. ఓడినా.. ప్రతి సంవత్సరం మీ ఇళ్ళకు వస్తూనే ఉంటాను అని చెప్పింది. వాళ్లు కూడా ప్రతి సంవత్సరం ఆమెను వరలక్ష్మీ వ్రతానికి పిలుస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో సోనియాగాంధీ గెలిచింది. అయినా కూడా సుష్మాస్వరాజ్ బళ్ళారి ఆడబిడ్డగా ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతానికి వెళ్లి పూజలో పాల్గొని పసుపుకుంకుమలు, పట్టుచీరను కట్నంగా తెచ్చుకునేది. పనె్నండు సంవత్సరాలు క్రమం తప్పకుండా ఇలా జరిగింది. పదమూడో సంవత్సరంలో బ్రేక్ వచ్చింది. మైనింగ్ ఆరోపణలతో గాలి జనార్దన్‌రెడ్డి చిక్కుల్లో పడ్డాడు. పార్టీ అతనికి దూరంగా ఉండమని ఆదేశించడంతో ఆమె ఇక బళ్లారికి వెళ్లలేదు. ఈ సంవత్సరం ఆమె ఎన్నికల్లో పాల్గొనలేదు. రాజకీయాల్లో లేదు. అందుకని ఈసారి ఎలాగైనా ఆమెను పిలిచి పాత సంప్రదాయాన్ని పునరుద్ధరిద్దాం అనుకున్నాడు గాలి జనార్దన్‌రెడ్డి. ఆమె కూడా అందుకు ఒప్పుకుంది. మరో రెండు రోజుల్లో బళ్ళారి ఆడబిడ్డగా పసుపుకుంకుమలు, పట్టుచీరను కట్నంగా తీసుకువెళదాం అనుకుంది. కానీ విధివైచిత్రి.. మరో రెండురోజుల్లో వరలక్ష్మీ వ్రతం ఉండగానే ఈ బళ్ళారి ‘వరలక్ష్మి’ తిరిగిరాని లోకాలకు తరలిపోయింది.