సబ్ ఫీచర్

తెలుగు పత్రిక శతజయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ పత్రిక ఎవరు నడిపి ఉంటారో ఊహించగలరా? ఎవరు? మరెవరు నడపగలరు?! గిడుగువారే నడిపారు. 1919 సెప్టెంబర్‌లో మాసపత్రికగా దీనిని ప్రారంభించారు గిడుగువారు. 1920 ఫిబ్రవరి తరువాత పత్రిక రాలేదు. ఎందుకని? తెలుగువారికి స్వ సంస్కృతి, స్వభాషపట్ల శ్రద్ధాసక్తులు లోపించటంవల్ల! పర్లాకిమిడి వంటి మారుమూల ప్రాంతం నుంచి దీనిని పంతులుగారు నడిపినందువల్లా, ఇది బరంపురంలో అచ్చుకావలసి వున్నందువల్ల ఆయన కొనసాగించలేకపోయి ఉంటారు. గిడుగు రామమూర్తి పంతులుగారు మళ్లీ నన్నయ్య గారంతటివాడని శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తి అన్నారు. కాని అప్పటి తెలుగు జమీందారి సంస్థానాలు గిడుగువారిని సమర్థించకపోగా వ్యతిరేకించారు. జయంతి రామయ్య పంతులు వ్యతిరేక పక్షానికి నాయకుడు. అప్పట్లో ఫస్ట్‌క్లాస్ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్, డిప్యూటీ కలెక్టర్ వంటి పదవులు నిర్వహించారు జయంతివారు. రామయ్య పంతులు వ్యవహారిక భాషా సిద్ధాంతం ఫ్రెంచ్ విప్లవం కన్నా ప్రమాదకరమైనదని తన కావ్యభాషా సమర్థనం (ఇన్ డిఫెన్స్ ఆఫ్ లిటరరీ తెలుగు) అనే పుస్తకంలో హెచ్చరించారు. పిఠాపురం మహారాజారావు సూర్యారావు బహద్దరు అప్పట్లో మైనరు. కోర్ట్ ఆఫ్ వార్డ్స్‌లో పరిపాలన ఉండేది. ఈ నిర్వాహకుడు జయంతి రామయ్య పంతులు ఎంతో భాషాభిమాని అయిన పిఠాపురం రాజా, గిడుగువారికెట్లా సాయం చేయగలడు? అప్పట్లో తెలుగువారిలోనే కాదు, ప్రపంచ స్థాయిలోనే గిడుగు వారి వంటి గొప్ప భాషాతత్త్వవేత్త, సిద్ధాంతవేత్త మరొకరు లేరని ప్రశంసలు పొందారు.
తెలుగుపత్రికలో తెలుగు భాష నాగరికంగా, భాషా ప్రయోజనాలన్నింటినీ సమర్థంగా, సంపూర్ణంగా తీర్చగల ప్రణాళికలు, రకరకాల నిఘంటువుల ప్రణాళికలు ప్రకటించారు గిడుగువారు. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా సుమారు 20 సంపుటాలు ప్రకటించిన సర్ జార్జ్ గ్రియర్‌సన్, పోస్ విశ్వవిద్యాలయంలో మహారాష్ట్ర భాష బోధించే యూల్స్ బ్లాక్, ఇంగ్లండు నుంచి గొప్ప తెలుగు భాషావేత్త ఫ్రేజర్, ఉచ్చారణ విధేయ లిపి సృష్టికర్త (్ఫనెటిక్ స్క్రిప్ట్) డేనియల్ జోన్స్‌రాసిన లేఖలున్నాయి ఈ పత్రికలో. చెళ్ళపిళ్ల వేంకట శాస్ర్తీగారు సర్వాత్మనా గిడుగువారిని సమర్థించారు. దివాకర్ల తిరుపతి శాస్ర్తీగారి స్వదస్తూరి సంతకం, వాడుక భాషా సమర్థన ఈ పత్రికలో ప్రచురితం. ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజం, బాలకవి శరణ్యం వంటి గొప్ప విమర్శ ఈ పత్రికలోనే వెలువడింది. మన బిరుదులన్నీ, పాండిత్యమంతా ఆయన పాద సన్నిధిని సమర్పించి ఆయన అంగీకరిస్తే మనం వాటిని వినియోగించుకోవాలి? లేకపోతే లేదు అన్నారు చెళ్ళపిళ్ళవారు కథలు గాథలలో. గిడుగువారి సాహితీ మూర్తిమత్వం అదొక రసవత్తర భాషా సాహిత్య సమరగాథ. ఆయన నిజంగా సాహిత్య యుగకర్త. ద్రష్ట. తెలుగువారి యశఃపతాక. పుణ్యఫలం. పర్లాకిమిడిలో ఆయనకు సహకారులెవరుంటారు? సంప్రదింపులెవరితో చేయగలరు! నూరేళ్ళ కిందట అది ఒక చిన్న గ్రామం. రాజాస్థానం కాబట్టి బ్రిటీషువారి ప్రాపు కొంత ఉండి ఉండవచ్చు. 1936లో పర్లాకిమిడిని ఒడిశాలో కలిపివేసింది ఆనాటి బ్రిటీషు ప్రభుత్వం. స్వాభిమాన ఋషితుల్యులైన గిడుగువారు తన సర్వస్వం త్యజించి రాజమండ్రి వచ్చేశారు. పర్లాకిమిడిలో ఐండ్లచెరువు గోపాలయ్యగారు పోస్టుమాస్టరు. సూర్యరాయాంధ్ర నిఘంటు ప్రథమ సంపుటి (అచ్చుల సంపుటం) ‘ది హిందూ’ పత్రికవారు గోపాలయ్యగారికి సమీక్ష కోసం పంపారు. ఇందులో ‘అవకతవక’ అనే పదంలేదు. దీన్ని బట్టి ఈ నిఘంటు మొదటి సంపుటం ఎంత అవకతవకగా వుందో తెలుస్తుంది అని ఐండ్ల చెరువువారు హిందూ పత్రికలో ఆక్షేపించారు. ‘తెలుగు సరస్వతి నోముల పంట గిడుగువారు’ అని గిడుగు శతజయంతి నివాళి అర్పించారు విశ్వనాథ ఇటీవల! ఆనాటనే తెలుగు సాహిత్య కుల సంఘం వారు వాషింగ్టన్ డి.సిలో తెలుగు సభలు అట్టహాసంగా జరిపారు! వారికి తెలుగు పత్రిక గూర్చి తెలియాల్సిన పనిలేదు. అక్కడ అంతకన్నా లేదు. ఇక నివాళి మాటా?

- అక్కిరాజు రమాపతిరావు