సబ్ ఫీచర్

బ్రిటన్ హోంమంత్రిగా ప్రీతి పటేల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వినా స్ర్తియా సృష్టి ఏవ నాస్తి..’ అంటే స్ర్తి లేనిదే సృష్టే లేదన్నారు. ఇటు ఇంటిని, పిల్లల్ని చూసుకుంటూనే, మరోవైపు తను ఎంచుకున్న కెరీర్‌లో రాకెట్‌లా దూసుకుపోతోంది నేటి మహిళ. ఇంటా, బయటా అన్నీ తానై, అంతా తానై ముందుకు సాగుతోంది. ‘చంద్రయాన్’ పేరుతో రాకెట్‌లను చంద్రుడిపైకి పంపినా, బ్రిటన్ హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టినా.. అది మన దేశ మహిళలకే చెందింది. తాజాగా బోరిస్ జాన్సన్ నేతృత్వంలో ఏర్పడిన నూతన ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్‌కు హోంమంత్రి పదవి లభించింది. వివరాల్లోకి వెళితే..
ప్రీతి వయస్సు ఇప్పుడు 47 సంవత్సరాలు. 1972, మార్చ్-29న లండన్‌లో పుట్టింది ప్రీతి. ఆమె తల్లిదండ్రుల స్వస్థలం గుజరాత్. తల్లి అంజనా పటేల్, తండ్రి సుశీల్ పటేల్. వీరు మొదట ఉగాండాలో నివసించేవారు. అయితే ఉగాండాలో అప్పుడున్న పాలకుడు దక్షిణాసియాకు చెందినవారిపై దేశ బహిష్కరణను వింధించాడు. దాంతో ప్రీతి తల్లిదండ్రులు బ్రిటన్‌కు వలస వచ్చారు. ప్రీతి నైట్‌ఫోర్డ్ గ్రామర్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసింది. తరువాత వెస్ట్ ఫీల్డ్ టెక్‌కాలేజ్‌లో ప్లస్ టూ.., తరువాత కీల్ వర్సిటీ, ఎసెక్స్ విశ్వవిద్యాలయాల్లో చదువుకుంది ప్రీతి. 20 సంవత్సరాలు కూడా నిండకముందే ప్రీతి కన్జర్వేటివ్ పార్టీలో చేరింది. కన్జర్వేటివ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉద్యోగం కూడా చేసింది. 1995 నుంచి 1997 వరకూ జేమ్స్ గోల్డ్ స్మిత్ నేతృత్వంలోని రెఫరెండమ్ పార్టీకి ప్రతినిధిగా ఉంది. ఆ పార్టీ యూరోపియన్ యూనియన్‌ను వ్యతిరేకించింది. విలియమ్ హేగ్ కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా మారిన తర్వాత ప్రీతి తిరిగి ఆ పార్టీలో చేరింది. 1997 నుంచి 2000 వరకూ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా పనిచేసింది. ప్రముఖ మద్యం తయారీ సంస్థ డియాజియోతోనూ ప్రీతి పనిచేసింది. యూరోపియన్ యూనియన్ (ఈయూ)ను విమర్శించిన వారిలో ప్రీతి కూడా ఉంది. బ్రెగ్జిట్‌ను ఆమె చాలా బలంగా సమర్థించింది. స్వలింగ వివాహాలను వ్యతిరేకించిన ప్రీతి.. ధూమపానంపై ఆంక్షలు విధించడానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడింది. 2005 ఎన్నికల్లో నాటింగ్‌హామ్ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయినా, 2010లో విట్‌హామ్ ఎంపీగా గెలిచింది ప్రీతి. అప్పటినుంచి ఆమె ఆ స్థానం నుంచి ఎంపీగా ఉంది. థెరెసా మే ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది ప్రీతికి.. అయితే రెండు సంవత్సరాల క్రితం ఒక వివాదం కారణంగా ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు అంతర్జాతీయ అభివృద్ధి మంత్రిగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు బ్రిటన్ అందించే ఆర్థిక సహకారానికి సంబంధించిన వ్యవహారాలను ఆమె పర్యవేక్షించేవారు. డేవిడ్ కేమరూన్ హయాంలో ఓ సంవత్సరం పాటు ట్రెజరీ శాఖలో సహాయమంత్రిగా, మరో ఏడాది ఉద్యోగ కల్పన శాఖలో మంత్రిగా పనిచేసిన అవకాశం లభించింది ప్రీతికి. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ తన ఆదర్శమని చెప్పే ప్రీతి 2004వ సంవత్సరంలో అలెక్స్ సాయర్‌ను పెళ్లి చేసుకుంది. సాయర్ మార్కెటింగ్ కన్సల్టెంట్ ఉద్యోగంతో పాటు స్టాక్ ఎక్చేంజ్‌లో కూడా పనిచేస్తాడు. వీరికి ఒక కొడుకు. అతని పేరు ఫ్రెడ్డీసాయర్. ఏది ఏమైనా భారత సంతతి మహిళ అయిన ప్రీతి పటేల్ బ్రిటన్ హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టడం మనందరం గర్వించదగ్గ విషయం.

-సన్నిధి