సబ్ ఫీచర్

మనమూ విజేతలు కావచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతి సామాన్యులుగా జన్మించి, పేదరికంలో పెరిగి ఎన్నో విజయాలు సాధించి కోటీశ్వరులైన వ్యక్తుల గురించి తెలుసుకున్నపుడు నిజమా అనిపిస్తుంది. వారి చరిత్రలు ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తాయి. తాము కూడా ఏదో చేయాలనే ఆలోచనకు మనసు శ్రీకారం చుడుతుంది. అయితే ఏమీ చేయలేరు. జీవితంలో విజేతలు అయిన ఎవ్వరూ అకస్మాత్తుగా విజయాలు సాధించలేదు. వారి విజయాల వెనుక ఏదో ఒక విజయ రహస్యం వుంటుంది. వీరు ఏవిధమైన పద్ధతులు అవలంభించారో తెలుసుకుంటే మన జీవన విధానంలో అనుకూలమైన వాటిని అనుసరించి మనం కూడా విజయాలు సాధించగలుగుతాం.
అవరోధాలు అధిగమించాలి
విజయం సాధించేందుకు లక్ష్యం నిర్దేశించుకుని దాని సాధనకోసం ఎన్నో అవరోధాలను అధిగమించాల్సి వుంటుంది. ఎవరు ఏ పని ప్రారంభించినా దానిని ఆపేందుకు అడ్డుపడేందుకు కొందరుంటారు. వీరు స్నేహితులుగా నటిస్తూ ప్రగతి అవరోధకులుగా పనిచేస్తుంటారు. వీరు దారిలో అడ్డుగోడల్ని గాజుతో నిర్మిస్తారు. అంటే మార్గంలో గోడ వున్నదనే సంగతి కూడా తెలియకుండా. లక్ష్య సాధనలో పరాజితులైన వారు తమలో విజేతల లక్షణాలు లేవని, అందువల్ల విజయ సాధనకోసం కృషి అనవసరం అనే నిర్ణయానికి వస్తారు.
విజేతలకు ఉండాల్సిన లక్షణాలు తమలో లేవని, అందువల్ల ఏ విధంగా శ్రమించినా వృధా అనే భావనకు వస్తారు. ఈ భావన సరియైనది కాదు. ‘జీవి’ కదులుతుంటే శక్తిని కూడదీసుకుంటుంది. జడజీవిగా వుంటే వున్న శక్తి కూడా అదృశ్యమైపోతుంది. అందుకే జీవితంలో చైతన్యవంతంగా వుండాలి. స్తబ్దతగా వుంటే మనిషితోపాటు అతడి మెదడుకూడా విశ్రాంతిలో వుండిపోతుంది.
పాజిటివ్‌గా వుండండి
అనుకూల దృక్పథంతో తనలోని శక్తిని వినియోగించుకుంటే అది ఉపయోగపడుతుంది. మానసికంగా ఆనందం లభిస్తుంది. విజయం ఎంతో కొంత శక్తిని కలుగజేస్తుంది. మనిషిలో గెలుపు భావన ఎంతో అవసరం. చిన్న చిన్న ఆటల్లో కూడా గెలుపు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుంది. ఇటువంటి చిన్న చిన్న విజయాలు మనిషిని పెద్ద పెద్ద విజయాలకు సమాయత్తం చేస్తుంది. తమకు తెలిసిన జ్ఞానాన్ని ప్రయోగించగలిగితేనే మనిషికి అనుభవ నైపుణ్యం అలవడుతుంది.
విజయానికి బలమైన ఆధారం క్రమశిక్షణ. దీనిని అలవరచుకోవడం కష్టమైనా అసాధ్యం మాత్రం కాదు. ఇతరులకు హామీలు ఇవ్వడం, స్వయంగా కొన్ని బాసలు ఎవరికివారు ఇతరులకు ఇవ్వడం జరుగుతూ వుంటుంది. వీటిని అమలుపరచాలంటే క్రమశిక్షణ వుంటుంది. ఇతరులకు ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లు తమకు తాము ఇచ్చుకున్న హామీలు కూడా నెరవేర్చాలి. విజయం అప్పుడు సులువుగా సాధించగలుగుతారు. తమకు తాము ఇచ్చుకున్న హామీలు నెరవేర్చడం విషయంలో క్రమశిక్షణ పాటించడం ఎంతో అవసరం. ఉదాహరణకు శరీరం నాజూగ్గా, సన్నగా వుంచుకునేందుకు మితాహారం, వ్యాయామం ప్రతిరోజూ చేసి తీరతామని తమకు తాము హామీ ఇచ్చుకుంటారు. కానీ వ్యాయామానికి దూరమవుతారు. తిండి విషయం మరచిపోతారు. విజయ సాధనకు నిజాయితీ, క్రమశిక్షణ, ఆశావహ దృక్పథం ఎంతో అవసరమని ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకోవాలి.
మేధస్సు పెంచుకోండి
మనలో చాలామంది తమని తాము తక్కువ అంచనా వేసుకుంటుంటారు. దీనిని తమలోని నిగర్వానికి, వినమ్రతకీ చిహ్నంగా భావిస్తుంటారు. ఎటువంటి బాహ్య ప్రభావాలకు లోనుకాకుండా తమ ప్రతిభా సామర్థ్యాలను సవ్యంగా అంచనా వేసుకోవాలని వీరు అనుకోరు. తమని తాము అతి సాధారణమైనవారిగా అభివర్ణించుకునే వ్యక్తుల జీవితమంతా అలాగే మిగిలిపోతారు. కొంతమంది తమకు మేధాశక్తి తక్కువని చెబుతుంటారు. అయితే ఇది సరికాదు. ఎవరికివారు తమ మేధాశక్తిని శంకిస్తున్నపుడు దాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయకపోవడం తప్పు.
మనిషిలో సామర్థ్యాలు
జ్ఞానం, నైపుణ్యం, శక్తిల సారాంశమే మన సామర్థ్యం. పుస్తక పఠనం, తరగతిలో విద్యాభ్యాసం, వర్క్‌షాపులు, ప్రసంగాలు, ప్రయాణాలు వంటి ద్వారా జ్ఞానం అబ్బుతుంది. కొంతమంది కొన్ని పనులు బాగా చేయగలుగుతారు. దీనినే నైపుణ్యం అంటారు. కొంతమంది ఇతరులు చెప్పింది జాగ్రత్తగా వింటారు. తగిన విధంగా స్పందిస్తారు. చక్కని వాక్చాతుర్యత వుంటుంది. ఇది కూడా నైపుణ్యమే.
సాధన ద్వారా నైపుణ్యాలు బాగా అభివృద్ధి చెందుతాయి. నైపుణ్యాలను అభ్యాసం చేస్తూ పోతే అది మనిషిలో ఒక భాగం అయిపోతుంది. చివరకు అది శక్తిగా మారుతుంది. ఎవరి సామర్థ్యాలపై వారికి అవగాహన వుండాలి. అలా వుంటే తమ బలాలు ఏమిటో తాము గుర్తుంచుకోగలుగుతారు. తమలో మెరుగుపరచుకోవలసిన నైపుణ్యాల గురించి తెలుసుకోగలుగుతారు. సరియైన సమయంలో సరియైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇవన్నీ విజయ సాధనకు మార్గాలు.

-పి.ఎం. సుందరరావు 94906 57416