సబ్ ఫీచర్

మల్లెల సౌరభాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్లెపూల సౌరభాలంటే మగువలకు చాలా ఇష్టం. నిజానికి ఆడవాళ్లకే కాదు.. మాఘమాసం నుండి ఆషాడం జల్లుల వరకూ పలకరించే తెల్లని మల్లెల పరిమళాలు అందరికీ ప్రీతిపాత్రమే.. అందుకే ఎండలు మండిపోతున్నా మల్లెల సౌరభాల కోసమే వేసవిలో లగ్నాలు పెట్టుకుంటారు. ఎందుకంటే మల్లెపరిమళాలు అద్భుతమైన శృంగార ప్రేరితాలు. ఇవి స్ర్తి, పురుష హార్మోన్లను ప్రభావితం చేయడంతో పాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకూ తోడ్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా మల్లెలు విరిసినప్పటికీ వీటిని ఎక్కువగా పూయించేది మనమే.. కానీ ఫ్రాన్స్, ఇటలీ, మొరాకో, ఈజిప్టు, చైనా, టర్కీ దేశాలే మల్లెల తైలాన్ని ఎక్కువగా తీస్తున్నాయి. ఒక గ్రాము మల్లె తైలాన్ని తీయాలంటే ఎనిమిది వేల మల్లె మొగ్గలు కావాలి. అచ్చంగా మల్లెలతో చేసిన పెర్‌ఫ్యూమ్ ధర చుక్కల్ని తాకుతుంటుంది. అందుకే దీన్ని ఇతర తైలాలతో కలిపి ఉపయోగిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మల్లెజాతులు ఉన్నప్పటికీ మనకు తెలిసిన మల్లెజాతిని మాత్రం అరేబియన్ జాస్మిన్ లేదా మల్లిక లేదా కుండమల్లిగై.. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. పూల పరిమాణాన్ని బట్టి ఇందులో చాలా రకాలున్నాయి. ఒకే వరుసలో ఐదు లేదా అంతకన్నా ఎక్కువ రేకలతో ఉండేదే మెయిడ్ ఆఫ్ ఓర్లియాన్స్.. దీనే్న రేకమల్లె లేదా గుండుమల్లె అంటారు. మైసూర్ మల్లెలు ఎండ తగులుతూంటే ఏడాది పొడవునా పూస్తుంటాయి. ఇలా నేలతీరు, వాతావరణం, అంట్లు కట్టే విధానాన్ని అనుసరించి ఒక్కో మల్లెమొగ్గదీ ఒక్కో అందం, ఒక్కో పరిమళం. ఆ మధ్యే పేటెంట్ కూడా పొందిన మధురై మల్లెలు ఈ కోవకే చెందుతాయి.
మల్లెపూల పరిమళం మెదడును తాకి మనసుకు ఎంతో హాయిని, ప్రశాంతతనూ కలిగిస్తుంది. అందుకే గాఢంగా పీల్చితే ఆ వాసన అన్ని నాడుల్నీ తాకి ప్రభావితం చేస్తుందంటారు ఆరోమాథెరపిస్టులు. శరీరానికి అవసరమయ్యే ఇ-విటమిన్ మల్లెల్లో ఉంటుందనీ, మల్లెలతో మరిగించిన నూనె చుండ్రు నివారణకు, శిరోజాల సంరక్షణకూ ఉపయోగపడుతుందని చెబుతారు.
* మల్లెల్ని త్రిదోష సంహారిణిగా పేర్కొంటోంది ఆయుర్వేదం. జ్వరం, దగ్గు, కళ్లవాపులు, వాంతులు, అల్సర్లు వంటి వాటి నివారణకు వాడతారు వైద్య నిపుణులు.
* పుండ్ల నివారణకు మల్లెపూల రసాన్ని వినియోగిస్తుంటారు.
* చర్మవ్యాధులకి, కంటి సమస్యల నివారణకి, కామెర్ల మందులోనూ మల్లెపూలను వాడుతుంటారు.
* మల్లెల వాసన నిద్రలేమిని నివారిస్తుంది. ఇది సహజ యాంటీ డిప్రెసెంట్ కూడా.. ఈ వాసన ముక్కు రంధ్రాల ద్వారా మెదడుని చేరి భావోద్వేగాలను నియంత్రిస్తుంది. ఇది అలసటని, ఆందోళననీ తగ్గిస్తుంది.
* మల్లెపూల పరిమళం ట్యూమర్లని నిరోధిస్తుందని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి. పూర్వకాలంలో మల్లె ఆకుల్ని, పూలని రొమ్ము కేన్సర్ నివారణకు వాడేవారు.
* మల్లెపూల నుంచి తీసిన నూనె వివిధ రకాల బ్యాక్టీరియాలను నిరోధిస్తుంది.
* మల్లెపూలతో చేసిన టీ కడుపులోని నులిపురుగుల్ని నాశనం చేస్తుంది. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల కేన్సర్ కూడా దరిచేరకుండా ఉంటుంది.
* మల్లెపూలతో చేసిన టీ తాగడం వల్ల బహిష్టుకు ముందు వచ్చే నొప్పి తగ్గుతుంది. ఈ టీ కోసం తేయాకుల్ని విరిసిన మల్లెల్ని అరలు అరలుగా పోసి పూల వాసన ఆకులకు పట్టేలా చేస్తారు. ఈ ఆకులతో చేసిన టీ ఆకుపచ్చ రంగులో సువాసనలను వెదజల్లుతూ ఉంటుంది.
* మరో పద్ధతిలో అయితే బాగా మరిగించిన కొన్ని నీళ్లలో ఎండిన మల్లెల్ని, తేయాకుల్ని వేసి మూడు, నాలుగు నిముషాల్ని మరిగించి తీసుకోవాలి. అంతే శరీరంలో ఉన్న అన్ని రుగ్మతలూ పారిపోతాయి.
మరింకెందుకు ఆలస్యం.. మల్లెల గుబాళింపుల్ని ఆస్వాదిస్తూనే ఆరోగ్యాన్ని కూడా పొందండి.