సబ్ ఫీచర్

సామాన్యంగా ఉండే అసామాన్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వితం కన్నా నమ్మిన ఆశయమే గొప్పదని ఆచరించి చూపిన ఆదర్శవాది అలిశెట్టి. ఆయన ఏనాడు పదవులకు, అవార్డులకు, సన్మానాలకు ఆశించలేదు కాని నమ్మిన సిద్ధాంతాలను తుంగలో తొక్కి, భోగలాలసులైన వారిని వ్యతిరేకించిన అలిశెట్టి ప్రభాకర్ భౌతికంగా మనకు దూరమై ఇరవై ఐదు సంవత్సరాలైనా, అతని జ్ఞాపకాలు అతని కవితల రూపంలో ఇప్పటికి అందరి మనస్సులో నిలిచి, పెదాలపై నడియాడుతున్నాయి. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరు ఆయా అవసరానికి తగ్గట్టు ఆనాటి సుమతి శతకంలానో, వేమన శతకంలానోౄ ధర్మపురి శేషప్ప శతకంలోని పద్యాల్లానో, వారివారి వీలునుబట్టి, సందర్భానుసారంగా, వ్యంగ్యంగా, ఛలోక్తులతో, కోట్ చేయగలిగే వీలున్న కవితలు రాసిన ప్రభాకర్ కవితల్లా, ఆయన సమకాలికుల కవితలు అంతగా కోట్ చేయబడలేదనడం అతిశయోక్తికాదు. వర్తమాన సమాజం పట్ల బాధ్యతతో, భవిష్యత్ పట్ల ఆశతో మెలిగిన ప్రభాకర్ ప్రజల జీవితాలలోని పేదరికాన్ని చూడడానికి పరిశోధనలు చేయడానికి ఎలాంటి మైక్రోస్కోపులు అవసరం లేదని, మనసున్న హృదయం ఉంటే అన్ని కనబడతాయని, అలాంటి మానవత్వపు హృదయాలు ఈనాటి సంఘ నాయకులకు, ప్రజాప్రతినిధులకు లేవని అందుకు కారణం వ్యక్తిగత స్వార్థమేనని అంటాడు. అదే సమయంలో విలువైన జీవితం మన ఆశాసౌధమని, దాన్ని అందంగా నిర్మించుకోవడం మన స్వంత బాధ్యతగా గుర్తించి, సమాజానికి మనుషులతో ఏర్పడ్డ, సమాజంలో జరిగే అన్యాయాలను చేసేవారి దురాగతాలను ఎదుర్కోలేని మనిషి జీవించడంవలన ఎవరికైనా లాభం ఉందా, అతని పుట్టుకకు అర్థం ఏమిటని ప్రశ్నిస్తూ, అతను ఎలా ఉండాలో అనేక కవితల్లో చెప్పాడు. రహదారిపై చలువకొరకు నాటిన చెట్లలా, గుడి ముందటి ద్వారానికి ఉండే ద్వార పాలకుల్లా నిశే్చష్టంగా నిలబడితే, మనమూ ఈ సమాజంలో ప్రేక్షక పాత్ర వహిస్తే, ఈ సమాజాన్ని మార్చేవారెవరని, అందుకే భాస్వరంలోని తేజస్సులా మారి, సమాజంలోని అవినీతిని, దుర్మార్గాన్ని కాల్చివేయాలని అంటాడు.
సాహిత్యంలో మినీ కవితలకు విలువ లేనినాడు, వాటిలో కూడా సాహిత్య విలువలు ఉన్నాయని నిరూపించి, ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కల్పిస్తూ, సాధారణ, వ్యవహారిక భాషలో, మహామహా గ్రంథాలలో చెప్పలేనంతగా ఇమిడి ఉన్న భావాన్ని చెప్పాడు. పీడితవర్గాల బాధలను, అభిమానాన్ని, ఆశలను చక్కని, చిక్కని భావాలతో స్పష్టంగా, సూటిగా, చెంప చెళ్లుమనిపించేలా చెప్పడంలో ప్రభాకర్‌కు సాటి ఈనాటికి వేరెవరు లేరనడం అతిశయోక్తి కాదు. ఏ అవార్డులు ఆశించని నిర్మలత్వం అతనిది. ఏది ఆశించకుండా ఈ సమాజపు కర్కశత్వానికి బలైన నిజమైన ప్రజాకవి. ప్రభాకర్ కవితల్లా సరళమైన వ్యవహారిక భాషలో ఇంత చిన్నగా, ఇంత ఘాటుగా చెప్పిన కవులు ఆనాడు కాని ఈనాడు కాని లేరనడంలో తప్పులేదు. వేమన, తరువాత శ్రీశ్రీ, ఆ తరువాత ప్రభాకర్ కవితలే ఎక్కువగా అందరు కోట్ చేస్తారు. అభిజాత్యాలకు పోకుండా తన మనసులోని భావాన్ని చెపుతూ, ఎదుటివారి హృదయాన్ని కరిగించి, కన్నీటిని తెప్పించే కవితలెన్నో అక్షరాన్ని కనిపించని భావజ్వాలలతో కనిపించే దోపిడీని, అణచివేతను తుదముట్టించాలనే సందేశం యువతకు ఇస్తాడు.
సాహిత్యం అంటే జాతిని జాగృత పరచే చైతన్య గీతాలని, మనిషికి కావాల్సిన, మనిషి పుట్టుకతో తెచ్చుకొన్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, జీవిత సాఫల్యానికి, ఎదుగుదలకు, ప్రేమకు, మానవత్వానికి, జీవితంలో అన్నింటికీ సాహిత్యమే ఆధారమని, ప్రధానమని నమ్మిన కవి, తాత్వికుడు, స్వాప్నికుడు అలిశెట్టి ప్రభాకర్. సాహిత్యమే మనకు తాత్విక భూమికను ఇస్తుందని, అందులోనుండే మనిషి ఎదుగుదల ఉంటుందని, సాహిత్యానికి సామాజిక స్పృహ లేకుంటే యనుపోతును కట్టేసి పాలు పితకడానికి ప్రయత్నించడం లాంటిదేనని భావించాడు. సాహిత్యకారులలోని దిగజారుడుతనాన్ని ఆకళింపు చేసుకొని, వారిని దూరం చేసుకోవడానికి కూడా వెరవని ధీశాలి. యువత రాజకీయ నాయకుల శుష్క వాగ్దానాలకు లొంగిపోకుండా, విచక్షణతో తమ హక్కులకై పోరాడాలని, మనిషి మరో మనిషిని చూసి భయపడడం ఎందుకో తెలియని ఈ దుస్థితినుండి మారి, తన తోటివారిని ప్రేమించాలని ఉద్బోధిస్తాడు. తన జీవితానే్న కొవ్వొత్తిగా చేసి, తన ఆశలనే చమురుగాచేసి, నిర్విరామంగా సమాజంలోని పేద కార్మిక, కర్షక, శ్రామిక వర్గాల గోసను, భాషను, మానసిక సంవేదనను, ఆవేదనను తన రచనలలో వెల్లడించాడు. తన కవితలోని ప్రతి అక్షరం ఆ నిజమైన మనిషి ఆనందం కొరకు, అతని బాధలకు మందులా మారాలనే తపనలోనే అతని జీవితం గడిచింది. అక్షర జ్ఞానం ఉన్న ప్రతివాడు తన జ్ఞానాన్ని తోటివాడి బాధలను తీర్చడానికి, సామాన్యుని పక్షాన నిలబడి సమాజంలోని అన్నివర్గాల అభ్యున్నతికి తోడ్పడాలని, అదే జీవిత సాఫల్యమని, అదే మనిషి ఆశయంగా, లక్ష్యంగా ఉండాలని ఆశించిన ఆశాజీవి. జీవితం మాత్రం అర్థాంతరంగా ముగిసిపోయింది.

- సిహెచ్‌వి ప్రభాకర్‌రావు, 9391533339