సబ్ ఫీచర్
మహిళల కన్నీటి వేదనపై కదిలిన రచయిత్రుల వేదిక
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించిన తొలి ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల ప్రథమ మహాసభలలో యద్దనపూడి సులోచనారాణి సభా ప్రాంగణంలో కళాప్రపూర్ణ తెనే్నటి హేమలత సాహిత్య వేదికపై సత్కార, పురస్కార, సన్మాన, పుస్తక ఆవిష్కరణల, కవి సమ్మేళన యితర కార్యక్రమాల కంటే విభిన్నంగా వివిధ సందర్భాలలో వేదికపై ప్రధానంగా రచయిత్రులు నేటి సమాజ నడవడికలో మహిళలు అనుభవిస్తున్న అమానవీయ, అసమానత, అన్యాయ అకృత్యాలపై తీవ్రంగా స్పందించటం విశేషాంశం. తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర యితర రాష్ట్రాలనుంచి వచ్చి పాల్గొన్న మహిళా రచయిత్రులు తమ ప్రాంతాల తెలుగు భాషా మాండలిక పద ఔన్నత్యాన్ని స్పష్టీకరించారు. తెలుగు భాషా ఔన్నత్యం, గొప్పతనం గురించి సుదీర్ఘ వాగ్బాడంబర ప్రసంగాల కంటే తల్లి భాషను ఎలా బతికించుకోవాలనే తపన రచయిత్రులు వ్యక్తం చేశారు. మహిళల కన్నీటి వేదన ప్రధానాంశమైంది.
మహిళా సాహితీమూర్తులు సామాజిక బాధ్యతతో మరింత తేజోవంతంగా ముందుకు కదిలేలా దిశానిర్దేశం చేయాలనే ప్రధాన ఉద్దేశంతో కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించిన ఈ మహాసభలలో గృహహింస నిర్మూలనకు ఇంటింటి సర్వే నిర్వహించవలసినదిగా ప్రభుత్వానికి డిమాండ్, పుస్తకాల కొనుగోలుకు ప్రభుత్వం తక్షణం ప్రాధాన్యత ఇవ్వాలని, భాషా ప్రాతిపదిక సంస్థ, అకాడమీలకు యంత్రాంగం, యితర వాగ్దానాలను ఏపి ప్రభుత్వం అమలుచేయాలని తీర్మానించారు. రచయిత్రులు ప్రత్యేకంగా తమ రచనల ప్రచురణకు, ప్రభుత్వమే ఆర్థికంగా బాధ్యత చేపట్టడం అన్నింటికీ మించి అభినందనీయం. జిల్లా రచయితల సంఘ అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి డా.జి.వి.పూర్ణచందు, డా.గుమ్మా సాంబశివరావు, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత ఓల్గా, ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి, కృష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్దె అనూరాధ, ఏపీ ఉప సభాపతి డా.మండలి బుద్ధప్రసాద్, కేంద్రీయ హిందీ సమితి సభ్యులు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఆం.ప్ర. సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి ముఖ్య కార్య నిర్వహణాధికారి డా.దీర్ఘాసి విజయభాస్కర్, ఏపీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆక్టోపస్ గుళ్ళపల్లి రామమూర్తి రాధిక, ఎందరో ప్రముఖ రచయిత్రులు పాల్గొన్న ఈ సభలలో రాజకీయ ప్రముఖులు లేకపోవటం ఒక విశేషం.
ప్రస్తుత సమాజ నడవడికలో జనాభాలో సగ భాగం అయిన మహిళా ప్రపంచం, ఎదుర్కొంటున్న జీవన సంక్షోభం పట్ల సభ్యసమాజం, ప్రభుత్వ పాలనా వ్యవస్థ స్పందించటం, సామాజిక బాధ్యతలో అంతర్భాగం అయింది. మహిళా చైతన్యం, ఉత్తేజ ఉత్సాహ ప్రేరణలతో కళ్ళుతెరిపించే సంస్కరణల శతాబ్దాల నుంచి ముందుకు కదులుతోంది. కాని మహిళలు అన్ని రంగాలలో ఎంత తేజోవంతంగా భాగస్వామ్యులై అడుగులు ముందుకు వేస్తున్నా శారీరక, మానసిక దాడులు, అన్యాయ, అణచివేత, అసమానతలతో నిస్సహాయంగా బలిఅవుతున్నారు. పౌర హక్కుల సంఘాలు, ప్రజాస్వామ్య ఉద్యమాలు ఎంత కలం, గళం విప్పాలి, స్ర్తివాదం ఎంతగా ప్రతిఘటిస్తున్నా పరిస్థితులు మరింత పతన దశ సూచిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో, యించుమించు దేశమంతటా తమదాకావస్తే కానీ, ఎదురుతిరగలేని నిస్తేజం, నిస్సహాయత పొంచి వుండి మహిళాశక్తిని నిర్వీర్యం చేస్తోంది. అధికారమే పరమావధిగా ఎన్నో సమస్యలతో సతమతమయ్యే రాజకీయ రంగం చేపట్టే కంటి తుడుపు చర్యలు, సత్ఫలితాలు అంతగా యివ్వటం లేదు. ఆర్థిక స్వాతంత్య్రం లేని అసంఖ్యాక మహిళా శాతం, తీవ్ర నిర్వేదంతో సతమతమవుతోంది. విద్యాధికులైన మేధావంతులైన మహిళలు ఎంత గళం విప్పినా, ‘మీటూ’ ఉద్యమాలు యితర సంఘర్షణలు, ఆందోళనలు తలఎత్తినా శృతిమించిన హింస, క్రౌర్యం, దాడులు, వేధింపులు కారణంగా యువతులు, బాలికలు కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు కోల్పోతున్నారు. ఆడతనంపై నిస్సిగ్గుగా, నిర్లజ్జతో చెలరేగుతున్న అహంకార, అతి పురుష రాక్షస ధోరణులకు స్ర్తివాదులు ఎదురు తిరిగి ప్రశ్నించటం సామాజిక నైజంగా పరిణమించినా సత్ఫలితాలు యివ్వటంలేదని పౌర హక్కుల ఉద్యమ నేతలు, రచయిత్రులు యితర మేధావులు స్పష్టం చేస్తున్నారు. విజయవాడలో జనవరి 6, 7 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల మహాసభలలో పాల్గొన్న రచయిత్రులు ఇకపై తమ కలాలను మరింత వాదరతో ఆయుధాలుగా, ఈ సామాజిక వైపరీత్యాన్ని ప్రతిఘటించాలని తాము చేపట్టే వివిధ సాహితీ ప్రక్రియల సృజనాత్మకతా చర్యలతో మరింత సామాజిక స్ఫూర్తితో వ్యవహరించాలని పిలుపునివ్వటం 2019 నూతన సంవత్సర ఆరంభంలో ఒక శుభ పరిణామం.