సబ్ ఫీచర్

సాయితత్వం నేర్పే ‘శ్రద్ధ-సబూరి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజంగా ఈ జీవుడు త్రిగుణాలకు అనగా సత్వరజస్తమో గుణాలకు అతీతుడు. కాని మాయచే కప్పబడి, తన సహజ నైజమైన సచ్చిదానం దాన్ని మరిచి తానే శరీరం అనుకుంటాడు. ఆ భావనతో తానే అంతా చేసేవాడినని, అనుభవించే వాడినని అనుకుంటూ లెక్కలేని బాధల్లో చిక్కుకుని విముక్తిని పొందలేకున్నాడు. విమోచనం పొందటానికి మార్గం ఒక్కటే. అది గురుని పాదాలపై ప్రేమమయమైన భక్తిని కలిగి ఉండటం. గొప్ప నటుడైన సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తమ నైజంలోకి మార్చుకుంటారు.
ఇంతకుముందు చెప్పిన కారణాలతో మనం సాయిని సాక్షాత్తూ భగవంతుని అవతారమేనని నమ్ముతున్నాం. కానీ, సాయి వినయశీలురు. తాను ఎల్లప్పుడూ భగవంతుని సేవకుడినని మాత్రమే చెప్పేవారు. బాబా స్వయంగా అవతార పురుషులైన ఇతరుల పట్ల, ఒకరి పట్ల మరొకరు ఎలా ప్రవర్తించాలో ఆచరించి చూపుతుండేవారు. ఆయా వర్ణాశ్రమాలకు విధింపబడిన కర్మలను ఎలా నెరవేర్చాలో బోధించేవారు. బాబా ఇతరులతో ఏ విషయంలోనూ పోటీపడేవారుకారు. తనకోసం ఏమైనా చేయమని ఇతరులను కోరేవారుకారు. సమస్త చేతనాచేతన అవస్థల్లోనూ భగవంతుడిని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితం కదా! ఎవరిని నిరాదరించటం కానీ, అవమానించటం కానీ బాబాకు తెలియదు. సమస్త జీవులలోనూ బాబా నారాయణుడినే చూసేవారు. ‘నేను భగవంతుడిని’అని బాబా ఎన్నడూ అనలేదు. భగవంతుడిని విధేయ సేవకుడనని మాత్రమే చెప్పేవారు. భగవంతుడిని ఎల్లప్పుడు తలచుకునేవారు. ఎల్లప్పుడు ‘అల్లామాలిక్!’అనగా భగవంతుడే సర్వాధికారి అని అంటుండేవారు.
శ్రీ సాయి సచ్చరిత్రను జాగ్రత్తగా చదివినా, అందులోని విషయాలను పరిశీలించినా ఓ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బాబా తన అవతార కాలం మొత్తంలో మనిషి ఎలా బతకాలో తన బోధనలు, ఉపదేశాల ద్వారా సూచించారు. బాబా బోధ సకల సుగుణాల నిధి. అటువంటి సకల సుగుణాలను మాలలోని పుష్పాలనుకట్టి ఉంచే దారాల వంటివి శ్రద్ధ, సబూరి. ఎవరి జీవితంలోనైనా ఈ శ్రద్ధ, సబూరీలదే కీలకపాత్ర ఈ రెండు లక్షణాలను ఎవరెంత గట్టిగా అంటిపెట్టుకుని ఉంటారో, ఎవరెంతగా ఒంటబట్టించుకుంటారో వారే జీవితంలో ఆధ్యాత్మిక, మానసిక, భౌతిక, పారమార్థిక అంశాలలో శిఖరస్థాయికి చేరుకోగలుగుతారు. మనం చేసే పనిపై శ్రద్ధ చూపనపుడు ఆ పని ఫలించదు. అంకితభావం చూపనపుడు అది యాంత్రికంగా మారిపోతుంది. పనిని శ్రద్ధగాచేయకుండా ఫలితం అనుకూలంగా ఉండాలని ఆశించటం అత్యాశే అవుతుంది. మనం చేసే పనిని శ్రద్ధగా చేయటం ఎంత అవసరమో, ఫలితంకోసం అంతే సహనంతో ఎదురు చూడటం ముఖ్యం. చదువులో కావచ్చు, పనిచేసే రంగం కావచ్చు. వ్యాపారం... మరే రంగంలోఉన్నా పై రెండు లక్షణాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి. అసలు బాబా బోధనల ప్రకారమైతే పనిచేయటమే మన కర్తవ్యం. ఫలితం సంగతిని భగవంతునికే వదిలేయాలి. మనం చేసే పనిలో చూపే శ్రద్ధ, అంకితభావం ఉంటేచాలు ఫలితం మనకే అనుకూలంగా ఉండేలా భగవంతుడు చూసుకుంటాడు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న శ్రద్ధ, సబూరి గురించి బాబా ఒక సందర్భంలో స్వయంగా చెప్పారు. ఈ రెండు లక్షణాలను అలవర్చుకోవటానికి ముందు బాబా చెప్పిన మాటలకు ఆలకిద్దాం.
ఒకసారి రాధాబాయ్ దేశ్‌ముఖ్ అనే వృద్ధురాలు బాబావద్దకు వచ్చింది. బాబా సమక్షంలో గురూపదేశం పొందాలనేది ఆమె కోరిక. ఒకవేళ బాబా కాదంటే కనుక నిద్రహారాలు మానేసి అక్కడే చనిపోవాలని కూడా ఆమె గట్టిగా నిర్ణయించుకుంది. రాధాబాయ్ రెండుమూడురోజులపాటు బాబానుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశతో చూసింది. ఆమె యాతనను గమనించిన మాధవరావు దేశ్‌పాండే (శ్యామా) బాబావద్దకు వచ్చి ఆమె తరపున వకాల్తా పుచ్చుకున్నాడు. ‘‘బాబా! అనవసర పట్టింపులతో ఎందుకు ఆ ముసలమ్మను ఇబ్బందిపెడతావు? ఆమె చూస్తే మిక్కిలి ముదుసలి. గట్టి పట్టుదల గలది. నువ్వు ఆమె చెవిలో మంత్రం ఏదీ ఊదకపోతే నిజంగానే చచ్చిపోయేలా ఉంది.
అది జరిగితే జనం నీపై లేనిపోని నిందలువేస్తారు. తొందరగా ఏదో ఒకటి చెయ్యి’’ అని వేడుకున్నాడు. అపుడు బాబా రాధాబాయ్‌ని పిలిచి శ్రద్ధ, సబూరి అనే రెండు లక్షణాలతోనే మనిషి ఆధ్యాత్మిక సాధనకు పాటుపడాలి కానీ గురువు ఉపదేశాలు, మంత్రోపదేశాలు చేస్తాడని ఆశించకూడదని చెప్పారు.

సాయి విద్యా ఫౌండేషన్ ప్రచురించిన ‘సాయి జీవనం మోక్షమార్గం’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు స్థలం ‘సాయి విద్య ఫౌండేషన్, ఫ్లాట్ నెం.4, సాయిబాబానగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23441123. ఎల్.ఐ.జి.49, ధర్మారెడ్డి నగర్, ఫేస్-1, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23445566