సబ్ ఫీచర్

కనులు మాటలాడునులే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జీవితకాలపు నేస్తాలు- నేత్రాలు’. మనిషి ఒక జీవితకాలం జీవిస్తే, కళ్ళు రెండు జీవితకాలాలు జీవిస్తాయి. ప్రాణం వదిలే చివరి క్షణాల్లో దానంచేసిన కళ్ళు మరోజీవితో చిరకాలం జీవిస్తాయి. మనకు నిలువుటద్దాలై ‘్ఫలింగ్స్’ని తెలియజేస్తాయి. కళ్ళు అందానికి ప్రతిరూపాలు. కాంతివంతంగా, ఆకర్షణీయంగా ఉంటూ కళ్ళు ఇతరులతో మాట్లాడుతూ మోహించేలాగుండాలి. అన్ని అంగాలలోకి ప్రధానమైన కళ్ళను కలకాలం ఆరోగ్యంగా కాపాడుకోవలసింది పోయి నిర్లక్ష్యం చేస్తుంటారు. కళ్ళ చుట్టూ వున్న చర్మాన్ని చూసి వ్యక్తి వయస్సు చెప్పవచ్చు. కళ్ళ దగ్గర చర్మం శరీరంలో ఎక్కడా లేనంత సున్నితంగా 0.5 మిల్లీ మీటర్ల మందం మాత్రమే వుంటుంది. ఏడిచినా, నవ్వినా కళ్ళు నీళ్ళు కారుస్తాయి. మన ప్రయత్నం లేకుండానే కనురెప్పలు రోజుకి కనీసం పదివేల సార్లు పైకి, కిందకి కదలాడుతాయి. ఈ ప్రక్రియలో చూపుకి ఆటంకం కలగదు. అంతేకాకుండా కళ్ళలోని దుమ్ము, ధూళి వెలుపలకి పోయి శుభ్రపడుతాయి. కళ్ళు తడి ఆరిపోకుండా చూస్తాయి. కనురెప్పలు చివరల్లోని వెంట్రుకలు, కనుబొమ్మలు దుమ్ము వగైరా లోనికి చేరకుండా రక్షణ కవచలాలలా పనిచేస్తాయి.
ఆఫీసులో కంప్యూటర్‌పై విధులు, పైగా ఇంటికొచ్చాక టీవీలు, మొబైల్స్- ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడడంవల్ల కళ్ళు తీవ్ర అసౌకర్యానికి గురవుతాయి. అలాగే మంచినీళ్ళు తక్కువగా తాగితే కంటిపై ప్రభావం పడుతుంది. కళ్ళు జీవం కోల్పోయినట్లు కనిపిస్తాయి. కళ్లకింద ఉబ్బడం మొదలవుతుంది. అందువల్ల నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. కంటికి ఇరువైపులా జిడ్డు, చమటగ్రంధుల తక్కువగా ఉండి చర్మం ముడుతలు కలిగి సుతిమెత్తగా ఉండేట్లు చేస్తాయి.
కాంతివంతమైన కళ్ళకు దృఢమైన ఆకృతి కోసం సరిపడా నిద్ర, పౌష్టికాహారం అవసరం. కళ్ళ దురదలు, మంటలకు, కండ్లకలక (ఆఫ్తాల్మియా)కు వాడే ఐ క్రీం, డ్రాప్‌లను రాత్రిపూట వాడితే సత్వర ప్రయోజనం ఉంటుంది. కంటి కింద వాపు, కళ్ళలో నుంచి నీరు కారుతూ బాధ కలిగిస్తుంటే కీర దోసకాయను శుభ్రంగా కడిగి గుండ్రని ముక్కలుగా తరిగి కళ్ళపై పెట్టుకుని కొంతసేపు విశ్రాంతి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. కీరదోసకాయకు బదులుగా బంగాళాదుంప ముక్కలను కూడా ఉపయోగించవచ్చు. ఇలాంటి కంటి సంబంధిత బాధలకు గంధం మంచి ఔషధంలా పనిచేస్తుంది. వాడిన చల్లని టీ బ్యాగులు, చల్లని పాలల్లో ముంచిన దూదిని అలసటగా వున్నపుడు కళ్ళపై కాసేపు పెట్టుకోవడం మంచిది. నల్లగా మారిన, ఉబ్బిన కళ్ళకు ఇలాంటి చిట్కాలు చక్కగా పనిచేస్తాయి.
కార్యాలయాల్లో ఇవేమీ కదరవు కనుక కనీసం గంటకోసారి పూర్తిగా కంటి చూపుని కనీసం ఐదు నిమిషాలపాటు మానిటర్ల మీదనుంచి మరల్చాలి. వీలైతే కళ్ళను పూర్తిగా మూసుకుని అలసటనుంచి దూరం అవ్వాలి. అక్షరాలు చదవడంలో ఇబ్బంది, కంటిచూపు సన్నగిల్లడం తదితర సమస్యలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయక నేత్ర నిపుణులను సంప్రదించాలి. పెద్దలకు మాదిరిగానే పిల్లలకు తప్పసరిగా ఏడాదికొకసారి నేత్ర పరీక్షలు చేయించడం మంచిది. మెల్లకన్నుకు ఎంత త్వరగా చికిత్స చేయిస్తే అంత ప్రయోజనకరంగా వుంటుంది.
దృష్టి మళ్లించకుండా టెలివిజన్, కంప్యూటర్ మానిటర్ వీక్షించడం, ఇతర వ్యాపకాల వలన కళ్ళు కదల్చడానికే ఇబ్బంది పెడుతుంటే చల్లని నీళ్ళతో కడిగితే ఫలితం వుంటుంది. కంటి మేకప్ చేసుకునేందుకు చూపే శ్రద్ధ దాన్ని తొలగించేందుకు చూపకపోతే కంటిచూపు కష్టమవుతుంది. చాలామటుకు అతి సున్నితమైన కళ్ళకు మేకప్ జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం. కళ్ళకు కాస్మోటిక్స్, కాజల్స్, సూర్‌మాస్, మస్కారాలు- వగైరా వాడడం అపాయకరం. కొన్ని సందర్భాల్లో ఐ షాడోస్, ఐలైనర్స్ ఉపయోగించడంవలన దురద, అసౌకర్యం కలుగుతుంది. ఐప్యాడ్స్ ఉపయోగంతో కంటి మేకప్‌ను తొలగించి చల్లని నీళ్ళను చిందించి కడిగి మెత్తని, తెల్లని బట్టతో తుడుచుకోవాలి. కంటినుంచి ముక్కు దిశలోకి (పైనుంచి కిందకు) పలుచని బట్టతో తుడుచుకోవడంవలన ఎలాంటి హాని ఉండదు. ఆరోగ్యకరమైన కళ్ళకు ఆహార నియమాలు ప్రధాన కారణం. దృష్టి మాంద్యం (ఆంబ్లోఫియా), కొయ్యకండలు పెరుగుట (త్రెకోమ్), కండ్లకలక, రేచీకటి- ఇతర కంటి రుగ్మతలు దరి చేరకుండా ఉండడానికి తీసుకునే ఆహారంలో తప్పక విటమిన్-ఎ, బి2 (రిబోఫ్లోవిన్)లు ఉండాలి. క్యారెట్, టమాటాలు, తాజా ఆకుకూరలు, బీన్స్, పాలు, కోడిగుడ్డులలో విటమిన్ ఎ, బి2లు విరివిగా లభిస్తాయి. ఆహార నియమాలతో పాటుగా రోజూ చేసే ఎక్సర్‌సైజులు, స్పీడ్ వాకింగ్, సైక్లింగ్, జాగింగ్, ఏరోబిక్స్, యోగాలవలన కళ్ళు ప్రకాశవంతమవుతాయి. నయన సౌందర్యం మీ సొంతమవుతుంది. విశ్వంని చూపే కళ్ళపై కాస్త శ్రద్ధ కనబరచి చీకటిలో మునిగే మరో జీవికి కడపటి క్షణాల్లో కళ్ళను బహూకరించి ఔదార్యం చాటుకోవాలి.

***
భూమికకు రచనలు
పంపాలనుకునే వారు రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయిల్ చేయవచ్చు.
లేదా ఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03

- హర్షిత ముసునూరి