సబ్ ఫీచర్

ముగిసిన అధ్యాయం మార్క్సిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వుప్పల నరసింహంగారు పరిశోధనాత్మక రచయిత. ఏ వాక్యం వ్రాసినా సోపపత్తికంగా సాక్ష్యాధారాలతో ప్రామాణికంగా అందిస్తారు. లోగడ ‘అంబేద్కర్ బ్రాహ్మణుడు’ అనే గ్రంథం వ్రాసి సంచలనం సృష్టించారు. ఇపుడు కారల్ మార్క్స్ ప్రతిపాదించిన ఒకప్పటి సిద్ధాంతాలు ఎలా నేడు వక్రీకరింపబడ్డాయో బూజుపట్టిపోయాయో నిరూపిస్తూ ఓ గ్రంథం వెలువరించారు. లోగడ ఈ వ్యాసాలు ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితమైనవే. అవన్నీ గాలికి పోకుండా ఒక సంకలనంగా తీసుకొని వచ్చి పరిశోధక విద్యార్థులకు సహాయం చేశారు.
అవునన్నా కాదన్నా ఒక శతాబ్దంపాటు ప్రపంచంపై కారల్ మార్క్స్ తన ప్రభావాన్ని చూపాడు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని నిర్వచించాడు. శ్రామికులను ధనిక వర్గాలు దోచుకుంటున్నాయని ‘కేపిటల్’ అనే గ్రంథంలో ప్రతిపాదించాడు. పారిశ్రామిక విప్లవం వచ్చాక ఉత్పత్తి సాధనాలు కొందరు పెట్టుబడిదారుల హస్తాలల్లో ఉండిపోయాయి. శ్రామిక వర్గానికి కన్నీళ్లు తప్ప ఏమీ మిగలలేదు. ఈ దోపిడీ నుండి కమ్యూనిజం పుట్టింది. అమెరికాలో పెట్టుబడిదారీ సమాజం ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా శ్రామిక రాజ్యం వచ్చింది.
కారల్‌మార్క్స్ తొలి విప్లవం శ్రామికంగా ముందున్న ఇంగ్లండులో వస్తుందని జోస్యం చెప్పాడు. అలా జరుగలేదు. భూస్వామ్య వ్యవస్థ బలీయంగా ఉన్న చైనాలో వచ్చింది. కారల్‌మార్క్స్‌కు ఇండియాపై ఎట్టి సదభిప్రాయం లేదు. ఇక్కడ ఎద్దుకు వున్న గౌరవం మనిషికి లేదు అని వ్యాఖ్యానించాడు. చరిత్ర మొత్తం దోపిడీ చరిత్రయే అన్నాడు. హింస ద్వారా రాజ్యాధికారాన్ని సంపాదించుకోవాలని ఆయన హితవు బోధించాడు. ఈ మార్క్స్ బోధలనుండి ప్రపంచ వ్యాప్తంగా అలజడి అనార్కి మొదలయింది. చక్కటి చెట్టులోనే పది లక్షలమంది బౌద్దులు మావోసేటింగ్ చేతిలో హతులైనారు. మొత్తం ఆరుకోట్లమందిని ఇప్పటికి కమ్యూనిస్టులు ప్రపంచ వ్యాప్తంగా చంపివేశారు. ఇదంతా దేనికోసం అంటే సమ సమాజ నిర్మాణం కోసం అని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు 1940-50 దశాబ్దాలల్లో కమ్యూనిజం చాలా ఉచ్ఛస్థితిలో ఉంది. క్రమక్రమంగా వారు కనుమరుగైనారు. ఇందుకు రెండు కారణాలు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి ప్రపంచ వ్యాప్తంగా యువతకు ఉద్యోగావకాశాలు లభించటం. రెండవది సామ్యవాదుల సంతానం పెట్టుబడిదారులుగా మారటం. ఈ హిపోక్రసీని గమనించిన ప్రజలు ఎన్నికల రాజకీయాలల్లో కమ్యూనిజాన్ని ఓడించారు. సచ్ఛీలం గల ఒక కమ్యూనిస్టు కార్యకర్త- కమ్యూనిస్టు రచయిత లేకపోవడాన్ని సమాజం గమనించింది.
వుప్పల నరసింహంగారు ఈ గ్రంథానికి ముగిసిన అధ్యాయం మార్క్సిజం అని పేరు పెట్టారు. భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఒక్కొక్క దేశం కమ్యూనిస్టుల కబంధ హస్తాలనుండి విముక్తమవుతున్నది. చైనా నేడు అమెరికాతో సమానమైన సామ్రాజ్యవాద దేశం. రష్యా కమ్యూనిస్టు భారంవలన పతనమై చిన్న చిన్నదేశాలుగా విడిపోయింది. ముఖ్యంగా నక్సల్‌బరీ సాయుధ పోరాటం చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తర తెలంగాణ నల్లమల, కేరళవంటి ప్రాంతాలకు వ్యాపించినా అది పుట్టిన నక్సల్‌బరీ (బెంగాల్)లో సాయుధ విప్లవం అంతరించింది. ‘‘మార్క్సిజం శాశ్వత సత్యం కాదు. ఏ సిద్ధాంతమైనా కాలపరీక్షను ఎదుర్కోవలసిందే’’ అనే వాక్యంతో వుప్పల నరసింహంగారు ఈ గ్రంథాన్ని ప్రారంభించారు.
19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం వచ్చింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలు జరిగాయి. పట్టాలపై నడిచే రైలు, పవర్‌లూం విద్యుత్తు వంటివి కనుగొన్నారు. వస్తూత్పత్తి ప ఎంచుకోవటం వాటికి నూతన మార్కెట్లకై వివిధ వలస దేశాలను సృష్టించుకోవటం అందుకై యుద్ధాలు. ఇట్ల యూరపు చరిత్ర నడిచింది. ఈ దశలో ఆఫ్రికా వంటి దేశాలనుండి మనుషులను బానిసలుగా అమెరికాకు తీసుకుపోయారు. బొగ్గు గనుల త్రవ్వకాలకు మనుషులు కావలసి వచ్చింది. మానవుల శ్రమను కొందరు తక్కువ వేతనాలిచ్చి దోచుకున్నారు. ఈ దశలో పెట్టుబడిదారీ వ్యవస్థను శ్రామిక వర్గాలకు మధ్య సంఘర్షణ మొదలయింది. ఆడమ్ స్మిత్ కాలం నండి వస్తున్న ఆర్థిక భావజాలానికి కారల్ మార్క్స్ మరికొన్ని కొత్త సంస్కరణలు చేశాడు.
‘‘మార్క్స్ చెప్పిన చారిత్రక భౌతికవాదం కాని ఉత్పత్తి సాధనాల విశే్లషణను కాని విభేదించేవారుంటారు. సంపద సృష్టిని సంపద పోగుపడటంగా మార్క్స్ పొరపడ్డారు. దీనిని సమీకృత దోపిడీగా చిత్రీకరించి వర్గ పోరాటాలను సూత్రీకరించారు’’.
‘‘మార్క్స్ ఒక మాయను ప్రతిపాదించాడు. అదే వాస్తవమని కోట్లాదిమంది జీవన విధానాలను కలుషితం చేశాడు’’. కార్మిక వర్గ జీవశక్తి ఎదగకుండా చేశాడు. రష్యా, చైనావంటి దేశాలల్లో ఒక దాష్టీకం- పెత్తనం నుండి మరొక దాష్టీకం పెత్తనంలోకి ఆ సమాజాలు వెళ్లిపోయాయి. ఈ విషయంలోంచి విప్లవంలో కూడా చూడవచ్చు. లూరుూ రాజరిక పాలనను విప్లవం ద్వారా అంతా చేసిన ప్రజలు నెపోలియన్ బోనపార్టీ నిరంకుశ పాలనలోకి వెళ్లిపోయారు. ఇది తెలంగాణకు కూడా వర్తిస్తుంది. విశే్లషించి చూడండి. ముందు నిజాం నిరంకుశ పాలన- తర్వాత ఆంధ్రోళ్ల పాలన- ఆ తర్వాత దొరల పాలన- దీనికి వ్యతిరేకంగా మందుపాతరలు - తుపాకీ మోతలు - ఇదే మనం చత్తీస్‌గఢ్‌లోనూ చూస్తున్నాము.
‘‘మానవ చరిత్ర మొత్తం రెండు వర్గాల ప్రయాణంగా భావించినవారిది అజ్ఞానం- ఇదొక అమానవీయ ఆలోచన’’ (14వ పుట) అని వుప్పల నరసింహంగారు మార్క్స్ ఆర్థిక సిద్దాంతాన్ని నేడు బూజు పట్టిన సిద్దాంతంగా నిరూపించారు. నిజమే- మానవునికి కిరీటం పెడతాము అని వచ్చిన ఒక ఆర్థిక సిద్ధాంతం పేరుతో పోలీసులకు భద్రతా బలగాలకు చివరకు సాటి వనవాసీలనూ ఇన్‌ఫార్మర్లు అనే పేరుతో హత్యలు చేయటం నేడు మనం భారతదేశంలో చూస్తున్నాము.
1. మానవ చరిత్ర మొత్తం పోరాటాల చరిత్ర 2. మానవులలో ఈ వర్గ స్పృహ శాశ్వతం 3. హింస విప్లవానికి మంత్రసాని - ఈ సూత్రాల మీద మార్క్సిజం పరిఢవిల్లింది. ‘మార్క్సిజం ఓ అజ్ఞానం’ అనే అధ్యయంలో వుప్పల నరసింహంగారు ఈ మిథ్య (మిత్)ను తూర్పారపట్టారు. నిన్నటి శ్రామికుడు నేడు పెట్టుబడిదారుగా మారి స్టార్ హోటళ్లు, థియేటర్లు, స్టూడియోలు కట్టుకొని శ్రామికులను పీడించటం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఇదొక కఠోర సత్యం! మానసిక పరిణతికి మార్క్సిజంలో స్థానం లేదు. పోరాటాల పేరుతో దేశ సంపదల ఉత్పత్తిని స్తంభింపజేయటం గమనార్హం. కన్నయకుమార్, ఏచూరి సీతారాం వంటివారు భారతదేశాన్ని ముక్కలు చేయండి, పాకిస్తాన్‌కు కాశ్మీర్‌ను దానం చేయండి అంటున్నారు. పాకిస్తాన్ మత రాజ్యం. అదొక నరకం. ఐనా వీరు పాకిస్తాన్‌ను, చైనాను సమర్థిస్తారు. వీరు భూలోక స్వర్గంగా వర్ణించిన రష్యా నేడు విచ్ఛిన్నమైంది. చైనా దాదాపు అమెరికాతో పోటీపడుతున్న పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద దేశం. తన సరకులను జపాన్, ఇండియా, టిబెట్, నేపాల్ వంటి దేశాలను మార్కెట్లుగా వాడుకుని వాటిని ఆక్రమించుకుంటున్నది. ఇదేనా మార్క్సిజం అంటే??
కారల్ మార్క్స్ వ్యక్తి యొక్క సహజ వికాసంమీద సౌశీల్యంమీద దృష్టి పెట్టలేదు. మానవ చరిత్ర మొత్తం ఆర్థిక సంఘర్షణా చరిత్రయేనని సూత్రీకరించి సమస్త భావాలు ఈ చట్రంలోకి కుదించివేశాడు. అందువల్లనే మార్క్సిజం ముఖ్యంగా రచయితలంతా మేధావి వర్గానికి చెందినవారు అని చెప్పుకొనేవారు పశుతుల్యమైన వ్యసనాల జీవితం గడుపుతూ దేశద్రోహానికి పాల్పడటం ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఏ దేశంలోనైనా సరే వారు స్థానిక సంస్కృతిని నిర్మూలిస్తారు. మతం మత్తుమందు అని ప్రకటించి నాస్తిక జీవితం గడిపి మరణ సమయంలో భగవంతుణ్ణి ప్రార్థించటం గమనార్హం. దీనిని హిపోక్రసీ అంటారు. వుప్పల నరసింహంగారు విద్వాంసుడు. ఆయన నిరాడంబర జీవి. పెట్టుబడిదారీ వర్గానికి చెందినవాడు కాదు. కాబట్టి ఆయన కమ్యూనిజాన్ని ద్వేషించటం వైయక్తికం కాదు. కేవలం సిద్ధాంత విశే్లషణ మాత్రమే. మానవ చరిత్రను ఈ గ్రంథం కనువిప్పు కలిగిస్తుంది! ‘నేను మార్క్సిష్టును కాను’ అని మార్క్స్ చెప్పటం ఈ గ్రంథానికి ముగింపు.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668