సబ్ ఫీచర్

హంస సంకేతం - అంతర్విశే్లషణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ‘రామాయణ కల్పవృక్షం’ యుద్ధకాండ ఆరంభంలో ప్రవేశించిన ‘హంసదర్శనం’ విశ్వనాథ స్వతంత్రమైన సృజన రూపం. ఉత్తమమైన కవిత్వ కళాఖండం. వివిధ సందర్భాల్లో దీని ప్రసక్తి కనిపిస్తుంది. ఈ ఖండంలో వివిధ స్థానాల్లో ఉన్న భాగాల్ని ఒకచోట చేరిస్తే ఒక మంచి కావ్యంగా ఏర్పడుతుంది. పాఠకుల్లోను సావధానతలో ఈ విధంగా ఏర్పడే ఒక అమరిక ఎలాగో చివరకు ఏర్పడేదే. ఈ పద్ధతివల్ల ఆయా భాగాలను ఉచితమైన క్రమంలో కవిత్వ ప్రియులకు సుగమ సుందరంగా కృతిని గురించి మంచి అవగాహనకు తోడ్పడుతుందనడంలో సందేహం లేదు. స్థూలంగా హంస ప్రవేశంలోని అంతరమైన తాత్విక భూమికను పరిచయం చేయడం వరకే ప్రకృత సమాలోచనం పరిమితమయింది. ముందుగా ఈ ఆలోచన కవిలో అవతరించడానికి కారణరూపం తాత్త్వికమైన రేఖల్ని కలిగింది. రచనా క్షేత్ర పరిధిని పెంచుతూంది. కథా విషయానికి వస్తే శ్రీరాముడు కపి సేనతో సముద్రం దాటి లంకాతీరం చేరాడు. సాయం సంధ్యాసమయం. ఉపాసన ముగించి ఒక శిలపై కూర్చున్నాడు. సముద్ర తీర జలాలలో ఒక హంస కనిపించింది. సాధారణ స్థాయిలో ఇది లంకా పట్టణంలో దిగుడు బావుల్లో విహరించేదిగా అలంకార సుందరంగా తోచింది. కాసేపటికి విశేష స్థాయిలో శివుని రూపంగా పరమ మనోహరంగా భాసించింది. సీతాదేవికి తన క్షేమవార్తతో సందేశాన్ని తీసుకవెళ్ళే దూతగా పంపాలనిపించింది.
హంస ప్రవేశంతో ఇంకా ఇటు సీతాదేవిపై అటు రావణునిపై కూడా ప్రభావం పడింది. ఇది కథకు తాత్త్వికమైన లోతునూ కవితాత్మకమైన ఉదాత్తతనూ చేకూర్చింది. సీతాదేవిలో నిజ స్వరూపాభిజ్ఞతకూ రావణునిలో శ్రీరాముని గురించి తనలో తలెత్తే సంశయాన్ని విచ్ఛేదం చేసి నిర్ణయానికి దారితీసే పరిస్థితికీ దారితీసింది. ఈ విధంగా కథలో ప్రయోజనాత్మకమైన పాత్రను నిర్వహించింది. కథాకథనంలో పాత్ర చిత్రణంలో కావ్యపరమార్థంతో పాటు కాల్పనికమైన వాతావరణమూ ఏర్పడింది. లోన దాగిన ‘నిజ’రూపాన్ని మెరిపించింది. ఈ ‘నిజం’ అంతరమైంది, తాత్త్వికమైన స్పృహను కలిగింది. ఆధ్యాత్మికమైన ప్రవేశాన్ని పొందింది. ఈ దృష్టితో ఈ రచన ఒక విశిష్టతను కలిగింది.
ఈ హంస ఎవరు? తాత్త్వికమైన ప్రపంచంలో శివుడుగా స్ఫురించడం జరుగుతుంది. హంస రూపంలో సాక్షాత్కరించడం, ఒక అపూర్వమైన విషయం. ఒక ఉత్తమమైన ప్రయోజనాన్ని నిర్వహించే పనిలో ఊరటకూ ఉపకృతికీ ఉద్దేశించింది. శ్రీరాముడు తన వియోగదశలో హంసకు తన హృదయ వేదనను నివేదిస్తాడు. తన కుశలవార్తతో సీతకు సాంత్వనం కలిగించవలసిందిగా అభ్యర్థిస్తాడు. ప్రధానమైన ఉద్దేశంతోపాటు కథకు సంబంధించిన ఇతరమైన అంశాలపైన దీని ప్రభావం కనిపిస్తుంది. ఇది శివుని దౌత్యం, ఇక్కడ హంస రూపంలో సాగే యత్నం శ్రీరామునికి ఆశ్చర్యంతోపాటు క్షోభతో ఆకులమైన హృదయానికేదో శాంతి లభించినట్లయింది. రావణుని విషయంలో ఏదో బాధతో క్రుంగదీయడం కనిపిస్తుంది. విరోధంతో ఊగిపోయే రావణుని మనస్తత్వం చక్కగా చిత్రితమైంది. నెల రోజుల క్రితం హతుడైన తన కుమారుడు అక్షయ కుమారుని పుత్రునితో ఏర్పడిన సన్నివేశంలో పూజాగృహంలో నుండి తెచ్చిన రజత హంసను అతనికిచ్చే సందర్భంలో వాత్సల్యపూర్ణతకు మలుపుతిరిగింది. రావణునిలో అనుభూతి సుందరమైన వాత్సల్యభావ రూపం ప్రకటితమైంది. కథాకథన శిల్పంలో ఉత్తమమైన నిర్వహణ కళగా నిలుస్తూంది. ఈ హంస గురించి తాత్త్వికమైన స్థాయిలో భావసూత్రం సమాలోచనంలో వివేచన కందుతుంది. ఈ హంస శ్రీవిద్యలో అనాహత చక్రంలోని హంసేశ్వర- హంసేశ్వరిగా పరిగణించబడిన శివశక్తుల రూపం. మూలాధారంనుండి (సహస్రారం వరకు) మేల్కొన్న శక్తిప్రసారం యొక్క ఉద్గమనం (్ఘఒషళశజూజశ)లో నాల్గవధి అనాహత చక్రం. ఇది విష్ణుగ్రంధికి సంబంధించింది. సూర్యుడు- వెలుగు, చీకటితో పగలు రాత్రి లక్షణం కలిగిన క్షేత్రం. ఈ చక్రం పనె్నండు దళాలు కలిగింది. వాయువుతో కూడింది. గాలి చేతనే కదా మాట అయినా శబ్దమయినా దూరం పయనించేది! ఈ ఆరోహణంలో అర్ధనారీశ్వర స్వరూపం హంస వర్ణనంలో స్పష్టంగా గమనించవచ్చు.
‘‘సమున్మీలత్ సంవిత్కమల మకరన్దైక రసికం
భజే హంస ద్వంద్వం కిమపి మహతాం మానస చర
యదాలపాదష్టాదశ గుణిత విద్యా పరిణతిః
ర్యదా దత్తే దోషాద్గుణ మఖిల మద్భ్యః పయ ఇవ’’
(సౌందర్య లహరి- 38)
ఇది శివశక్తుల ఒక నిలయం, అనాహత చక్రానికి సంబంధించింది. సంపూర్ణంగా వికసించిన విద్య/ విజ్ఞానమనే కమలంలోని సారభూతమైన రూపాన్ని మకరందాన్ని ఆస్వాదిస్తూ ఈ హంస మరియు హంసి రూపం ఆహ్లాదాన్ని కలిగిస్తూంది.
వారిరువురి మధ్య సంభాషణం లోకానికి ఉపకారకమైంది, ఎంతో విలువైంది. అనితరమైంది, అపూర్వమైంది. దీని పర్యవసానమే అష్టాదశ విద్యల ఆవిష్కారం. నీరులో కలిసిన పాలను వేరుచేసినట్లు చెడునుండి మంచిని వేరుచేసే అసాధారణ శక్తి కలిగిందీ హంస రూపం. పదునెనిమిది విద్యలు: 1) శిక్ష, 2) కల్ప, 3) వ్యాకరణ, 4) నిరుక్త, 5) జ్యోతిష, 6) ఛంద, 7) ఋక్‌వేద, 8) యజుర్వేద, 9) సామవేద, 10) అధర్వవేద, 11) న్యాయ, 12) పురాణ, 13) పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, 14) ధర్మశాస్త్ర, 15) ఆయుర్వేద, 16) ధనుర్వేద, 17) గాంధర్వవేద, 18) నీతిశాస్త్ర విభాగాలతో కూడింది.
ఈ అనాహతంలోని శివశక్తులకు ప్రాతినిధ్యం వహించే హంసరూపం (హంసేశ్వర/హంసేశ్వరి) ఒకటిగా కల్పవృక్షంలో ఈ ఘట్టంలో సూచితమవుతూంది. గుణదోష విచారణతో కూడిన లక్షణం కలిగింది. భాష- భాషణం, ధ్వనిమయమైనవి. గాలి చేతనే దూరదూరం వ్యాపిస్తాయి, పయనిస్తాయి. ఈ అనాహతం పవనక్షేత్రం. ఈ కారణాల్నిబట్టి ఇదొక గొప్ప తాత్త్విక ప్రపంచంలో భాగంగా వర్తిస్తూంది. విష్ణువు అవతారమైన శ్రీరామునినుండి లక్ష్మీదేవికి ప్రతి రూపమైన సీతాదేవికి సందేశాన్ని తీసుకొని వెళ్ళే అర్హత ఎవరికి ఉంది? ఒక్క శివునికి తప్ప ఎవరికీ లేదు. ఈ స్ఫూర్తి విశేషం రచనలో వివిధ సందర్భాల్లో దృష్టికి వస్తుంది. ఒక విషయం తాత్త్వికతతో గంభీరతనూ, భావనారూపంతో ఉన్నతినీ చేకూరుస్తుంది. హంసేశ్వర- హంసేశ్వరి కలిసిన అర్ధనారీశ్వర భావన రూపం శివమయమైన తేజస్సు కేంద్రంగా కలిగిందీ రచన. ఈ రచనలో ఒక స్థాయిలో తాత్త్వికత, మరో స్థాయిలో కవిత్వ కళ రెండూ సమాంతరంగా రచనకు విశిష్టతను చేకూరుస్తున్నాయి.
(2)
‘అనాహతం’ హృదయానికి సమానమైన స్థాయిలోది. ఇది పనె్నండు దళాలు పద్మంగా భావితమైంది. ఇది పవనయుతమైంది. పయనానికి వీలైంది. ‘అనుహృత్పద్మ దళాంత వర్తివగు హంసాధ్యక్ష’’ - మొదలుగా ప్రాణములనే పద్మదళాల మధ్యలో వర్తించే హంస పరమమైన రూపానికి గుర్తుగా నిలుస్తూంది. ఇది తాత్త్వికమైన భూమికలో ఉన్నతమైంది. ఉదాత్తమైంది. సహృదయుల్ని ఆకట్టుకుంటుంది. దీనికి సానుకూలమైన అంశాల్ని గమనించవచ్చు. హంస (1) సాహిత్యంలో గగనమార్గాన శీఘ్రంగా వెళ్ళే శక్తికలిగిన సుందరమైన ప్రాణి; (2) దంపతుల మధ్య ప్రియుల మధ్య దౌత్యానికి ప్రసిద్ధమైంది, (3) ఆత్మకు సంకేతం, (4) ప్రాణానికి గురుతు, (5) వెలుగు రూపానికి నిలయం, (6) చిత్తశాంతికి చిహ్నం, (7) సత్వానికి ఆకరం, (8) శుచికీ శుభ్రతకూ మారుపేరుగా ఎందరిచేతనో దర్శితమైంది, వర్ణితమైంది. ఈ రచనలో ‘శుభ్రనామక సంచారి’గా పేర్కొనబడింది. దివ్య భావనామయమైంది. కుండలి శక్తి ఆరోహణంలో పైకి ప్రసారగమనంలో నాల్గవ స్థానం, అనాహత చక్రం. ఇది హంసేశ్వర-హంసేశ్వరి రూపాలతో కలిసి ఉన్న శివశక్తుల్ని ధ్యానించే అవకాశంతో- ఈ విషయం ప్రస్తుత సందర్భానికి నప్పుతూంది. ఇది మాటకూ భాషణానికీ వార్తకూ వర్తిస్తుంది. సందేశం దీనిలోకి వస్తుంది. అనాహతం అంటే ఆహతం కానిది, క్షతి పొందనిది, ఆగనిది అని అర్థం. ఇది ఆగని కదలే సాగే వాయుమయమైంది. విష్ణుగ్రంథి క్షేత్రానికి సంబంధించింది. ఇది సూర్యునితో ఒకదాని తరువాత ఒకటి వస్తూపోయే పగలు రాత్రులతో కూడింది. అష్టాదశ విద్యాప్రపంచం సాహిత్యంతోనూ సంబంధం కలిగింది. కాబట్టి విషయం ‘అనాహత’ చక్రనిలయ రూపం, ప్రకృత సందర్భానికి తగినట్లుగా ఉంది. సృజన క్రియ (షూళ్ఘఆజ్పళ ఔ్యషళఒఒ) లో పలు అంశాలు ప్రయోజనపరంగా విడదీయరానంతగా కలిసిపోయిన భావ సంచయం ఏర్పడింది. హంస- సాధారణమైన (్భతిక) స్థాయిలో నగర దీర్ఘికల్లో విహరించే ‘అలంకార’ సుందరంగా, విశేషమైన (మానస) స్థాయిలో శివుని ’అహంకార సౌందర్య శిఖ’గా దర్శితమయింది. ‘మిశ్రభావం’గా తోచింది. ఇవి కవిత్వానికి రెండు పొరలను సిద్ధింపచేస్తూంది. ఇందులో లౌకికమైన అహంకార రూపాన్ని దాటి సదహంకారంపైని మహదహంకారాన్ని సూచిస్తూంది. ఇది ఉత్తమ సంకల్పంనుండి ఉదాత్తమైన కార్యాచరణకు దారితీసేదిగా ఈ సందర్భంలో అన్వయ శోభను పొందుతూంది. శ్రీ విద్యలో అనాహత చక్రంలోని హంసేశ్వర- హంసేశ్వరితో కూడిన భావనా రూపంతో నిర్మితమైందీ ఘట్టం. ఈ వివేచనం ప్రస్తుత సందర్భంలో మహాకృతిలోని అంతస్సత్వ పరిచయం మాత్రమే.

- ప్రొ. మాదిరాజు రంగారావు