సబ్ ఫీచర్

మతిమరుపునకు మందులు ఇవే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టింటి నుంచి వచ్చిన భార్యను స్టేషన్ నుంచి ఇంటికి తీసుకురాకుండా స్టేషన్‌లోనే వదిలేసే ‘‘్భలే భలే మొగాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఈ మతి మరుపు ఒక్క మగవారికే కాదు ఆడవాళ్లల్లోనూ, చురుకుగా వుండాల్సిన పిల్లల్లోనూ వుంది. ఆధునిక జీవన విధానం వల్ల ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతూ జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారు. జ్ఞాపకశక్తిని పెంపొందించుకుని మతిమరుపును దూరం చేసుకోవాలంటే మన ఇంట్లో, పెరట్లో దొరికే మొక్కలు, పళ్లు, దినుసులతో సాధ్యమే.
- ఉల్లిలో భాస్వరం ఎక్కువగా ఉండడంవల్ల మేధస్సును పెంచడానికి ఉపయోగిస్తుంది.
- పచ్చి పనసకాయ కూర కూడా మేధాశక్తిని అభివృద్ధిపరుస్తుంది.
- బుద్ధిబలం పెంపొందించే ఆహారం ఉల్లి ఆకులు
- మునగాకు రసం బాగా మరిగించాలి. దానిలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ప్రతిరోజూ నిద్రపోయేముందు తీసికోవాలి. దీనివల్ల మతిమరుపు తగ్గుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
- మానసికమైన నరాల బలహీనత, మతిమరుపు తగ్గించేది పెద్ద ఉసిరి.
- మానసిక అలసట తగ్గించి, మెదడును ఉత్తేజపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది అరటిపండు.
- బ్రాహ్మీ (సరస్వతి) మొక్కను పూర్తిగా తీసుకోవాలి. బాగా శుభ్రపరచాలి. దంచి ముద్దగా చెయ్యాలి. దానికి 8 రెట్లు పాలు కలపాలి. బాగా మరిగించి వడపోయాలి. తగినంత పంచదార ఆ పాలకు కలపాలి. రోజుకోసారి 100 మి.లీ. తాగితే జ్ఞాపకశక్తి బాగా అభివృద్ధి చెందుతుంది. బ్రాహ్మిలలోని చెక్‌సైడ్స్ జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
- వయసు మీరినవారిలో మెదడు డల్ అవడం, మతిమరుపు కలిగే అవకాశముంది.
-జ్ఞాపకశక్తిని మెరుగుపరిచి మెదడు పనితీరును సమన్వయపరిచే తైలాలలో ముఖ్యమైన తులసి ఆకులనుండి తీసిన నూనెలు, నారింజ నూనెలు.
- జ్ఞాపకశక్తిని మెరుగుపరిచి, బుద్ధిమాంద్యం తగ్గించే మరొక మొక్క ‘సంబలేవి’. దీనిని వేళ్ళతో సహా పెకలించి దాని రసాన్ని తీయాలి. ఆ రసం రెండు పూటలా చెంచా చొప్పున తీసికుంటే మంచి ఫలితముంటుంది. 30 రోజులు తీసికోవాలి.
- ఉసిరి, మెదడుకు పోషణనిస్తుంది. జ్ఞాపకశక్తికి సంబంధించిన మూడు అంశాలను క్రమబద్ధీకరిస్తుంది. జ్ఞాననాడులను బలపరుస్తుంది. విద్యార్థులకు మెదడు పని బాగా చేసే మంచి మందు.
-జ్ఞాపకశక్తిని, తెలివితేటలను పెంచే మొక్క మాల్కంగిణి. మాల్కంగిణి నూనె ఒక చుక్కను తమలపాకుపై రాసి నిద్రించే ముందు తినాలి. నూనె ఎక్కువయితే వాంతులవుతాయి.
- అమితమైన జ్ఞాపకశక్తి కలగాలంటే వస పౌడర్‌ను నీరు, పాలు, నెయ్యి మొదలగు వానితో ఒక నెల రోజులు తీసికోవాలి.
- వెంపరి కషాయం బుద్ధి వికసించుటకు, మేధస్సు పెంచుటకు సహకరిస్తుంది.
- గ్రీన్ టీ జ్ఞాపశక్తిని మెరుగుపరుస్తుంది.
- శొంఠి, పిప్పళ్ళు, వస, యాలకులు, జీలకఱ్ఱ పొడుం చేసి అర చెంచా పటిక బెల్లంతో తీసికుంటే జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.
- ఆవు నెయ్యి, ఒక చెమ్చా మొదటి ముద్దలో పిల్లలకి కలిపి పెట్టడం మరొక చిట్కా.
- చిన్న పిల్లల శరీరం శక్తివంతంగా తయారై, జ్ఞాపకశక్తి పెరగాలంటే పావు చెంచా వేప చెక్క పొడుంలో ఒక చెంచా ఆవునెయ్యి, కొంచెం పంచదారలతో కలిపి ఇవ్వాలి.
- పిప్పళ్ళ చూర్ణం, చలువ మిరియాల గింజలు తీసివేసిన ఎండుద్రాక్ష, ఒక్కొక్కటి తులం తీసుకుని బాగా నూరి చిన్న ఉండని రెండుపూటలా తీసుకోవాలి.
- ఆపిల్ పండులోని ‘అయినిక్వెర్సిటైన్’ అనే యాంటి ఆక్సిడెంట్ మెదడుకు మేలుచేస్తుంది. మెదడుకు బలాన్నిచ్చే మరొక ఫలం సీతాఫలం.

మతిమరుపునకు మందులు ఇవే!

1. * అందరికి అందుబాటులో ఉండి చవకగా లభించే బూడిద గుమ్మడి మంచి మెమరీ బూస్టర్. బ్రెయిన్‌కు మంచి టానిక్.

2. *బుద్ధిని పెంపొందించి అలసట పోగొట్టి విద్యార్థులకు బాగా ఉపయోగించే
పండు అంజీర.

3. *జ్ఞాపకశక్తిని పెంచడంలో విశిష్టస్థానం సంపాదించిన మొక్క బ్రాహ్మి (సరస్వతి). ఈ మొక్కను సమూలంగా పెకలించి పాలలో రెండు రోజులు నానబెట్టాలి. తరువాత నీడన ఆరబెట్టి పొడిగా చెయ్యాలి. ఆ పొడిని రోజుకో చిటికెడు నెల రోజులు తీసుకోవాలి.

భూమికకు రచనలు

పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.net

కు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్,
ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

-గురునాధరాజు