సబ్ ఫీచర్

నువ్వాదరిని... మేమీదరిని...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘాట్‌లకు చేరని కృష్ణమ్మ
జల్లు స్నానాలతో సరి
సాగర్ నీరు విడుదలకాక ఇబ్బంది
కృష్ణాతీరంలో విచిత్రం

పవిత్ర కృష్ణానది చెంతనే ఉన్నా తనివితీరా పుష్కర స్నానాలు చేయడానికి అక్కడ అవకాశం లేకుండా పోయింది. జల్లు స్నానాలతోనే భక్తులు సరిపెట్టుకోవాల్సిరావడంతో అసంతృప్తి నెలకొంది. ఇది నల్గొండ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఎదురైన విచిత్ర పరిస్థితి. జిల్లా అంతటా పుష్కర హడావిడి కన్పిస్తున్నా దూరంగా ఉన్న, నీళ్లు లేని ఘాట్లు వెలవెలబోతున్నాయి. మహాబూబ్‌నగర్ నుండి నల్లగొండ జిల్లాలో కృష్ణవేణి ప్రవేశించే చందంపేట మండలం కాచరాజుపల్లి, పెద్దమునిగాల్, పిఏపల్లి మండలం అజ్మాపురం, పెద్దవూర మండలం ఉట్లపల్లి పుష్కర ఘాట్‌లు నాగార్జున సాగర్ జలాశయం బ్యాక్ వాటర్ ఆధారంగా నిర్మించారు. జలాశయంలో నీటిమట్టం పెరుగకపోవడంతో ఆయా ఘాట్‌లకు కిలోమీటరు నుండి నాలుగు కిలోమీటర్ల దూరంగా కృష్ణా జలాలు ఉండగా అక్కడి నుండి పైప్‌లైన్లతో ఏర్పాటు చేసిన జల్లు స్నాన ఘాట్టాల్లోనే భక్తులు పుష్కర స్నానాలు చేస్తున్నారు. కాచరాజుపల్లి, పెద్దమునిగాల్‌లో జల్లు స్నాన షవర్లు కొన్ని పనిచేయకపోవడంతో నిర్మానుష్యంగా అక్కడి ఘాట్లున్నాయి. ఈ ఘాట్‌లలో నీరు లేదని ముందుగానే తెలిసిన భక్తులెవరు ఇటువైపు రావడం లేదు. కాచరాజుపల్లి ఘాట్ వద్ధ పుష్కర స్నానాలను ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌కు సైతం జల్లు స్నానమే దిక్కయ్యింది.
నది చివరిప్రాంతంలోనూ అదే దృశ్యం
అటు జిల్లా పరిధిలోని కృష్ణా నది చివరి ప్రాంతం మేళ్లచెర్వు మండలంలోని కిష్టాపురం, వజినేపల్లి, బుగ్గమాదారం ఘాట్‌లకు దూరంగా ఘాట్‌ల రక్షణ కంచెకు ఆవలివైపుగా కృష్ణావేణి సాగిపోతుండగా భక్తులు నదిలోకి వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో ఘాట్‌ల వద్ధ ఏర్పాటు చేసిన జల్లు స్నాన ఘట్టాల్లోని పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు.
నదిలోనే పుష్కర స్నానం చేయాలనుకునే భక్తులు మాత్రం ఇతర ఘాట్‌లకు వెళ్లిపోతున్నారు. ఇటు కనగల్ వాగు, ధర్వేశిపురం ఎల్లమ్మ దేవాలయం వద్ద నిర్మించిన పుష్కర ఘాట్‌లకు సైతం కృష్ణ జలాలు అందుబాటులోకి రాకపోవడంతో ఈ ఘాట్‌లలో భక్తులకు పుష్కర స్నానాల అవకాశం లేకుండాపోయింది. ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల కాలువ నుండి 5 వేల క్యూసెక్కుల నీటి విడుదల చేసినప్పటికి మధ్యలో ఉన్న చెరువులను దాటి కృష్ణ జలాలు ఈ ఘాట్‌లకు చేరకపోవడంతో పుష్కర స్నానాలకు అవకాశం లేకుండా పోయింది. పానగల్ ఛాయ సోమేశ్వర ఆలయం ఘాట్‌లోకి ఉదయ సముద్రం చెరువు నుండి నీరు వదలడంతో ఇక్కడ భక్తుల పుష్కర స్నానాలు పరిమితంగా కొనసాగుతున్నాయి.
అక్కడ మాత్రం కృష్ణవేణి పరవళ్లు
వాడపల్లి, మట్టపల్లి, నాగార్జున సాగర్, నేరడుచర్ల మహంకాళి ఘాట్‌లలో కృష్ణవేణి పరవళ్లు కొనసాగుతుండగా ఇక్కడ పుష్కర స్నానాలు తొలి రోజు ఘనంగా ఆరంభమయ్యాయి. క్రమంగా ఇక్కడ రద్దీ పెరిగే అవకాశం ఉంది.

- ఆంధ్రభూమి ప్రతినిధి, నల్గొండ