సబ్ ఫీచర్

కొవ్వుని కరిగించే మసాల దినుసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బరువు పెరగటానికి అనేక కారణాలు ఉండవచ్చు. శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, భోజనానికి సమయపాలన లేకపోవడం, శారీరక శ్రమ అస్సలు లేకపోవడం, కొన్నిసార్లు వంశపారంపర్యంగా కూడా అధిక బరువు నమోదు కావచ్చు. మరి ఇటువంటి సమస్యల బారిన పడకుండా కొవ్వు కరిగించుకొని పొట్ట తగ్గించుకొనేందుకు కొన్ని ఆహారాలు ప్రత్యేకంగా తీసుకోవాలి. శరీరం నుండి కొవ్వును కరిగించడంలో ఇది ఒక చాలా ముఖ్యమైన ఇంటి చిట్కా. వ్యాయామం చేయడంవల్ల శరీరంలోని కొవ్వును కరిగించుకోవచ్చు. కొవ్వులు మనిషి ఆరోగ్యానికి చాలా అవసరం. అయతే అవి పెరగకుండా చూసుకోవాలి. మనం వాడే కొన్ని మసాలా దినుసులు కొమ్వును కరిగించడంలో మంచి ఫలితాన్ని ఇస్తాయ.
వంటగదిలో ఉండే మసాలా దినుసుల్లోని ఔషధ గుణాలతో బరువు తగ్గించుకోవచ్చు. నల్ల మిరియాల్ని కొన్ని శతాబ్దాలుగా గ్యాస్ట్రో ఇంటస్టయినల్ సమస్యల్ని తగ్గించుకునేందుకు ఉపయోగిస్తున్నారు. కొవ్వు కరిగించి, బరువు తగ్గించే మరో మసాలా దినుసు దాల్చిన చెక్క. బరువు తగ్గించడంతోపాటు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది ఇది. జీలకర్ర రుచి గురించి కంటే ఇందులో ఉండే ఔషధ గుణాల గురించి మాట్లాడుకోవాలి. ఇది రక్తహీనత, మొలలు, మతిమరుపు, నిద్రలేమి వంటి సమస్యలతోపాటు జీర్ణ సంబంధిత సమస్యల్ని కూడా దూరం చేస్తుంది. భోజనంలో లేదా భోజనం తరువాత దీన్ని తింటే రక్తం శుభ్రపడుతుంది. జీర్ణక్రియ సరిగా జరుగుతుంది. బరువు తగ్గుతారు. అల్లం ఊబకాయాన్ని అరికట్టడంతో పాటు కొవ్వు కరిగించే గుణం, జీవక్రియలను వేగవంతం చేసే గుణాలు ఇందులో ఉన్నాయి. పసుపులో ఉండే కర్‌క్యుమిన్ అనేది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటుంది. బరువు పెరగకుండా అరికడుతుంది.
పచ్చిమిర్చిలో క్యాప్సైసిన్ అనే అంశం కలిగి వుండటంవల్ల శరీరంలోని జీవక్రియల రేటును పెంచుతుంది మరియు వీటిని తిన్న 15 నిముషాలకే క్యాలరీలను కరిగిస్తుంది. స్పైస్ ఫుడ్ ఐటెమ్స్ ఖచ్చితంగా బరువును తగ్గిస్తాయి. బాడీ ఫ్యాట్‌ను తగ్గించాలనుకొంటే రెడ్‌చిల్లీ, బ్లాక్ పెప్పర్, చిల్లీ పెప్పర్.. ఇటువంటి స్పైసీ ఫుడ్‌కు ప్రాధాన్యత ఇవ్వండి. ఇవి శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచి బరువును తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి మీరు తీసుకొనే ఆహారంలో ఆవాలను లేదా ఆవనూనెను చేర్చుకోవడంవల్ల మంచి ఫలితం వుంటుంది. ఆవాల్లో ఫ్యాటీ యాసిడ్స్ (ఒలియిక్, యురిసిక్ మరియు లినోలెనిక్ ఆమ్లం)లో సాచ్యురేటెడ్ ఫ్యాట్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండి క్యాలోరిస్‌ను బర్న్ చేస్తాయి. బరువు తగ్గిస్తాయి. సువాసన భరితమైన ఈ యాలకలు బరువు తగ్గించడంలో ఉపయోగిస్తారు. దీన్ని వివిధ రకాల వంటకాల్లో మంచి ఫ్లేవర్ కోసం వినియోగిస్తారు. ఇది జీవక్రియలను మెరుగుపరిచి, నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.

- వినీతామూర్తి