సబ్ ఫీచర్

అలర్జీల నుండి ఉపశమనానికి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరు వ్యక్తులకు వారి శరీర తత్వాన్ని అనుసరించి దురదలు, చర్మం ఎరుపెక్కడం వంటి అలర్జీలు తప్పవు. వాతావరణ పరిస్థితులు మారినపుడే కాదు, ఇతర సమయాల్లోనూ వీరు చర్మసంబంధమైన సమస్యలను ఎదుర్కొంటారు. శారీరకంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ, ఇలాంటి శరీర తత్వం కలిగినవారు పదిమందిలో మసలుకునేటపుడు చర్మం దురదగా అనిపించడంతో చాలా అసౌకర్యంగా ఫీలవుతారు. నలుగురిలో కలిసి తిరిగేందుకు విముఖత చూపుతుంటారు. కొన్నిసార్లు ఇది మానసిక వేదనగా పరిణమిస్తుంది. ఈ కోవకు చెందినవారు కొన్ని సులభమైన, సురక్షితమైన మార్గాలు అనుసరించినట్లయితే అలర్జీల సమస్య క్రమేపీ మాటుమాయమవుతుంది.
వేపాకులు వేసి కాగబెట్టిన నీటితో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం స్నానం చేయటం అలవరచుకోవాలి. ఖరీదైన సబ్బులు ఉపయోగించకుండా, పసుపుకలిపిన సున్నిపిండితో శరీరమంతా బాగా రుద్దుకుని స్నానం చేయాలి. వారానికి ఒకసారి శరీరానికి నలుగు పెట్టుకుని తలస్నానం చేస్తుండాలి. స్నానం చేసే ముందు శరీరానికి వేపాకు నూనె ఉపయోగించడం మంచిది. ఈ నూనెను మనం ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. వేపాకులను మెత్తగా రుబ్బి సిద్ధంగా ఉంచుకోవాలి. కొబ్బరి నూనెలో కొంచెం నీరు కలిపి, వేపాకు ముద్దను వేసి సన్నటి సెగమీద బాగా కాగబెట్టాలి. వేడి చల్లారాక ఈ మిశ్రమాన్ని వడకట్టి, పొడిగా ఉన్న సీసాలో నిల్వ ఉంచుకోవాలి. వేపాకు నూనెను రోజూ శరీరానికి పల్చగా రాసుకుని , ఐదు నిమిషాల పాటు మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల దురదలు, ఇతర అలర్జీల స్వభావం తగ్గుముఖం పడుతుంది. వేపాకు నూనె రాసుకోవడం వల్ల దోమలు మన చెంతకు వచ్చేందుకు సాహసించవు. దోమల నుండి రక్షణ పొందేందుకు కూడా వేపాకు నూనెను శరీరానికి నిరభ్యంతరంగా రాసుకోవచ్చు. అలర్జీల నుండి ఉపశమనం పొందేందుకు మన ఆహారపు అలవాట్లలో కూడా కొద్దిపాటి మార్పులు చేయడం అవసరం. పులుసు కూరలు, వేపుళ్ళు, మసాలా వంటకాలు తినడం బాగా తగ్గించాలి. ఆకుకూరలు, తీగ జాతికి చెందిన కూరగాయలు అంటే బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, కాకరకాయ వంటివి భుజించాలి. గోంగూర, వంకాయ వంటివి అలర్జీలకు కారణమని తెలుసుకుంటే వాటికి దూరంగా ఉండడం ఉత్తమం. మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరకుండా శ్రద్ధ వహించాలి.
ఉదయానే్న సూర్య కిరణాలు మనపై ప్రసరించే విధంగా తూర్పు ముఖంగా కూర్చుని, భక్తిశ్రద్ధలతో ఆదిత్య హదృయం పారాయణం చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. జీవన శైలిని మార్చుకోవడం వల్ల అలర్జీలు మన దరికి చేరకుండా హాయిగా ఉండవచ్చు.

-జి.అరుణ