సబ్ ఫీచర్

ముఖారవిందం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందానికీ, ఆరోగ్యానికీ గులాబీలు శ్రేష్ఠమైనవని చెప్పవచ్చు. గులాబీ పువ్వు రేకులను నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదని కొందరి నమ్మకం. గులాబీ పువ్వులలో జిడ్డు ఎక్కువగా ఉంటుంది కనుక దానిలోంచి తైలం తయారుచేస్తారు. ఈ తైలం చర్మానికి రాసుకుంటే చర్మం మృదుత్వాన్నీ, మెరుపును సంతరించుకుంటుంది.
గులాబీ పువ్వు రేకులను మిక్సీలో మెత్తగా రుబ్బుకుని దానికి సమానమైన కొబ్బరినూనెను కలిపి సన్నని మంటపై బాగా మరిగించాలి. అందులోని నీరు ఇగిరిపోయి, సువాసనతో కూడిన తైలం తేలుతుంది. అది చల్లారిన తరువాత ఒక సీసాలో పోసి అప్పుడప్పుడూ వాడుకుంటూండాలి.
రెండు చుక్కల ఈ తైలంలో ఒక చుక్క తేనె కలిపి ఎండిపోయినట్లుగా వున్న పెదవులపైన వ్రాస్తే, పెదవులు మృదువుగా మారి మెరుస్తాయి. నల్లగా వున్న పెదవులు కూడా గులాబీ రంగుకు మారతాయి. రెండు చుక్కల గులాబీ తైలానికి, రెండు చుక్కల తేనె, అరచెంచా దోస విత్తనాల పొడి కలిపి కళ్ళ చుట్టూ రాస్తే, కళ్ళ చుట్టూ వుండే నల్లని వలాయాలు పోయి ప్రకాశవంతంగా మారుతాయి.
అలాగే గులాబీ తైలం, ఆవనూనె, కస్తూరి, పసుపు కలిపి పాదాలకు రాసుకుంటే పాదాల పగుళ్ళు పోయి ఆ భాగం ఎంతో మృదువుగా తయారవుతుంది. ఈ గులాబీ తైలంలో కొద్దిగా ఎర్రచందనం పొడి కలిపి ముఖానికి రాసుకుంటే మంచిది. పావుగంట తరువాత కడిగి వేస్తే అప్పుడే విచ్చుకున్న తాజా గులాబీలా తయారవుతుంది ముఖారవిందం.
ఆ విధంగానే కురులకూ ఈ తైలం మంచిదే. 10 గ్రాముల గులాబీల మొగ్గలు, 10 గ్రాముల మందార పువ్వులు, 4 మందార ఆకులు మిక్సీలో మెత్తగా రుబ్బుకుని ఆ మిశ్రమాన్ని వారంలో రెండుసార్లు తలకు రాసుకుని అభ్యంగన స్నానం చేయాలి. ఇలా చేయడంవల్ల కురులు మృదువుగా మారి నిగనిగలాడుతూ మెరుస్తూంటాయి.

- మనస్విని