రాష్ట్రీయం

హోదాపై నిలదీద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శీతాకాల పార్లమెంటే వేదిక
అసెంబ్లీలోనూ ప్రశ్నిద్దాం
తాడోపేడో తేల్చుకుందాం
రైతుల గిట్టుబాటు ధరకు డిమాండ్
పార్లమెంటరీ భేటీలో జగన్ సూచన

హైదరాబాద్, నవంబర్ 22: ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని రేపటినుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీయాలని వైకాపా పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. ఆదివారం ఇక్కడ లోటస్‌పాండ్‌లో పార్లమెంటరీ పార్టీ సభ్యులతో వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈసారి ప్రత్యేక హోదాపై రాజీలేని పోరు సలపాలని ఎంపీలకు సూచించారు. వచ్చే నెల ఇక్కడ జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనూ తాము ఇదే విషయమై ఎన్డీయే మిత్రపక్షమైన తెదేపాపై వత్తిడి తెచ్చే వ్యూహం అనుసరిస్తామని సూచించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, తిరుపతి తదితర నగరాల్లో జరిగిన బహిరంగ సభల్లో నరేంద్రమోదీ, చంద్రబాబు ప్రత్యేక హోదాను ఆంధ్రకు కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కేంద్రం మెడలు వంచైనా ఆంధ్ర అభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదా సాధించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అలాగే రైతాంగ సమస్యలను ప్రస్తావిస్తూ పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర సాధించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. కేంద్రం ధాన్యం మద్దతు ధర పెంచేలా వత్తిడి తేవాలన్నారు. విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు అంశం కూడా పెండింగ్‌లో ఉందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పని విధానం పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. రైతాంగానికి రుణాలు మాఫీ చేస్తామని, అన్ని రుణాలు చెల్లిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈరోజు రైతులను వంచనకు గురి చేశారన్నారు. బాబు వస్తే జాబు వస్తుందన్న ఆశ కల్పించి నిరుద్యోగ యువత ఓట్లను కొల్లగొట్టారన్నారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఉద్యోగ నియామకాలకు ఒక్క నోటిఫికేషన్ జారీ చేయలేదన్నారు. సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజ్‌మోహన్ రెడ్డి, ఇతర ఎంపీలు పాల్గొన్నారు.