రాష్ట్రీయం

ఇక రెవిన్యూ రికార్డులకు కొత్త రూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: రాష్ట్రంలో రెవిన్యూ రికార్డుల రూపకల్పన, డిజిటలైజేషన్, ల్యాండ్ సర్వే తదితర అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకోనుంది. కొత్త రాష్ట్రం కావడంతో ప్రతి జిల్లాలో సర్వే పని ఎక్కువగా ఉండటం, ఉన్న రికార్డుల్లో లోపాలను సవరించడం, ఎలాంటి పొరపాట్లు లేని రికార్డులను డిజిటలైజ్ చేయడం వంటి చర్యలను ప్రారంభించింది. ఇందుకోసం ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించేందుకు కూడా ప్రభుత్వం వరాలను ప్రకటించింది.
ఉద్యోగుల్లో సమరూప ప్రణాళికకు ఒక అకాడమి ఏర్పాటుకు కూడా ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ భూముల వివరాలను సేకరించి పరిశీలించడం, ఎండోమెంట్, వక్ఫ్, అటవీ భూముల వివరాలను సరిపోల్చుకోవడం, ఖాళీగా ఉన్న భఱూములను గుర్తించి ల్యాండ్ బ్యాంకులో వివరాలను పొందుపర్చడంపై ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, పంచాయితీ, గ్రామకంఠం, మున్సిపల్ పరిధిలోని భూములు, ప్రభుత్వ విధాయసంస్థలు, ఇతర సంస్థల భూములు, దేవాదాయ, జమిందారీ సెటిల్‌మెంట్ భూములు ఇలా అన్ని వివరాలతో ల్యాండ్ హబ్ రూపొందిస్తున్నారు. జీఐఎస్, జీపీఎస్ వ్యవస్థలను అనుసంధానం చేసి వర్చ్యువల్ ఇనస్పెక్షన్ జరిపేందుకు వీలుగా ఈ ల్యాండ్ హబ్ ఉంటుంది. ఈ భూముల హక్కుదారులు ఎవరైనా రెవిన్యూశాఖ దీనికి కస్టోడియన్‌గా ఉంటుంది. ల్యాండ్ రికార్డుల్లో ఆధార్ వివరాలు అందించని 2.35 లక్షల మంది ప్రవాస భారతీయుల తరఫున ఇక్కడ వారి సంబంధీకులు రిఫరెన్స్‌లు తీసుకుంటారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సర్వే, తహశీల్దార్‌లకు వాహనాల అద్దె నిమిత్తం ప్రతి నెలా 25వేల రూపాయిలు కేటాయిస్తారు.అలాగే ప్రతి మండల రెవిన్యూ కార్యాలయంలో పాత కంప్యూటర్ల స్థానంలో కొత్త కంప్యూటర్లను కొనుగోలుచేస్తారు. రెవిన్యూశాఖకు తక్షణం 5 కోట్ల రూపాయిలు మంజూరు చేశారు. గ్రామం , మండలం, డివిజన్, జిల్లా స్థాయిలో ప్రతి యూనిట్‌కు మొదటి దశలో చూపిన ప్రతిభ ఆధారంగా గ్రేడింగ్ ఇస్తారు. అన్ని మండలాల్లో పేరొందిన సంస్థల ద్వారా అవుట్‌సోర్సింగ్‌పై కంప్యూటర్ ఆపరేటర్లను నియమిస్తారు.
కొత్తగా 200 మంది సర్వేయర్‌లను నియమిస్తారు. ప్రస్తుతం ఉన్న 700 మంది ప్రభుత్వ సర్వేయర్లలో 623 మందికి ఇటిఎస్ మిషన్లపై పనిచేయడానికి 45 రోజుల పాటు అవసరమైన శిక్షణ ఇస్తారు. అనంతరం వీరందరికీ ట్యాబ్‌లను అందజేస్తారు.