రాష్ట్రీయం

పరిశ్రమల వరద!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఈనెల 25వరకూ 3565 దరఖాస్తులు రాగా, అందులో 3067 దరఖాస్తులకు 21రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ ఆమోదం దక్కింది. ఏకగవాక్ష విధానంలో 16శాఖలకు సంబంధించిన 26 అనుమతులను ఈ పరిశ్రమలకు ఏకకాలంలో ప్రభుత్వమిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ప్రోత్సహించేందుకు లీ క్యాన్ యూ స్కూల్‌తో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం సత్ఫలితాలనే ఇస్తోంది. జపాన్, చైనా, సింగపూర్ దేశాలకు చెందిన కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తిని చూపుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 39,973 కోట్ల రూపాయిలతో మెగా ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయి. 96,060 మందికి ఉపాధి కల్పించేలా మెగాప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బిర్లా గ్రూప్, రామ్‌కో గ్రూప్, కెల్లాగ్స్, హీరో మోటోకార్ప్ లిమిటెడ్, గుజరాత్ అంబుజా ఎక్స్‌పోర్ట్సు, షాహి ఎక్స్‌పోర్టు, ఏషియన్ పెయింట్స్, జైన్ ఇరిగేషన్, డివిస్ ల్యాబ్, ఎన్‌హెచ్‌కె స్ప్రింగ్స్, మోహన్ స్పిన్ టెక్స్, వేహాన్ కాఫీ, క్రిబ్‌కో, టెక్స్‌పోర్టు, వేమ్ టెక్నాలజీస్, బ్రిటానియా, లోంగి సోలార్, ట్రినా సోలార్, మైక్రోమాక్స్, లావా, సెల్‌కాన్, కార్బన్ తదితర భారీ బహుళ జాతి కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్నాయి. జపాన్‌కు చెందిన ఆహార శుద్ధిరంగం అభివృద్ధి కోసం సుమిటిమో కార్పొరేషన్ సంస్థతో ఆంధ్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పట్టణాభివృద్ధి, వౌలిక సదుపాయాలు, తయారీ రంగం, వ్యవసాయం, ఆహారశుద్ధి, ఇండస్ట్రియల్ పార్కు , ఐటి సంబంధిత రంగాల్లో జపాన్ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మేటి’ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటది. అలాగే మిజో బ్యాంకుతోనూ మరో ఒప్పందం కుదుర్చుకుంది. విద్యుదుత్పత్తి, వౌలిక వసతులు, నిర్మాణ రంగం, ఇంజనీరింగ్, టెక్స్‌టైల్స్, అపెరల్, బొమ్మల తయారీ, నాన్ మెటాలిక్ మెటీరియల్స్, సిమ్మెంట్ పరికరాలు, వ్యవసాయం, ఆహారం, రసాయనాలు, ఇతర వనరులు, గృహనిర్మాణ రంగాల్లో కంపెనీలతో బీజింగ్, చెంగ్డూ, షాంఘైలో 29 ఒప్పందాలు కుదిరాయి. వాటిలో 17 గవర్నమెంట్ టు బిజినెస్, 12 బిజినెస్ టు బిజినెస్ ఒప్పందాలను ఆంధ్ర ప్రభుత్వం చైనాతో కుదుర్చుకుంది. 1200కోట్ల పెట్టుబడులతో పెప్సీ కంపెనీ శ్రీసిటీలో ఒక ప్లాంట్‌ను ప్రారంభించింది. 980 కోట్లతో మరో 11 ప్రపంచ స్థాయి కంపెనీల్లో అదనపు సౌకర్యాలు నెలకొల్పారు. 1000 కోట్ల పెట్టుబడితో మరో 11 యూనిట్లకు శంకుస్థాపన చేశారు. ఇండస్ట్రీ మిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇండియా, జపాన్, యుఎఇ, కెనడా దేశాలకు చెందిన 47 కంపెనీలతో ఎంఓయులు కుదిరాయి. తద్వారా 35,745 కోట్ల పెట్టుబడులకు ఆస్కారం కలిగింది. గిజోయి ఇంటర్నేషనల్ ఇనె్వస్టుమెంట్ కార్పొరేషన్ 500 మిలియన్ డాలర్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. తిరుపతిలోని రేణుగుంటలో శ్రీవేంకటేశ్వర మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్ ఏర్పాటుకానుంది. 1070 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఇండస్ట్రీలో 12,525 మందికి ఉపాధి కల్పించేందుకు వీలవుతుంది. చిత్తూరు జిల్లా శ్రీసిటీలో రైజింగ్ స్టార్ సంస్థ మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్ నెలకొల్పింది. అనంతపురం జిల్లా పాలసముద్రంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు చెందిన న్యూ ఢిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ వల్ల ఐదు వందల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.