రాష్ట్రీయం

సైకిలెక్కిన జయసుధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 16: సికింద్రాబాద్ మాజీ శాసనసభ్యురాలు, ప్రఖ్యాత సినీ నటి జయసుధ శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నివాస గృహంలో ఆయన సమక్షంలో తెలుగుదేశంలో చేరారు.
భర్త కపూర్, మున్సిపల్ మంత్రి నారాయణతో కలిసి తన నివాస గృహానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం తెలుగుదేశం కండువా కప్పి తమ పార్టీలో చేర్చుకుంటున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. అనంతరం జయసుధ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇకపై క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతానని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే పార్టీ మారినట్టు చెప్పారు. ఇకపై చంద్రబాబు ఎలా దారి చూపిస్తే అలా నడుచుకుంటానని చెప్పారు. ఈ రెండు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడేవారందరికీ తన స్వభావం ఏంటో అందరికీ తెలుసన్నారు. అయితే బంధుత్వపరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌తో అనుబంధం ఎక్కువన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌తో కలిసి తాను అనేక సినిమాల్లో నటించానంటూ 1999 ఎన్నికల్లో చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంతో ఆ పార్టీ తరపున ప్రచారం చేశానంటూ గుర్తుచేసుకున్నారు. త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపి కూటమి గెలుపునకు తాను ప్రచారం చేస్తానన్నారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబునాయుడు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌ను హైటెక్ సిటీగా మార్చి యువతకు ఉపాధి కల్పించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. తెలుగువారందరికీ సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాను టిడిపిలో చేరానన్నారు. హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చింది చంద్రబాబేననన్నారు.
chitram...
ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో
తెలుగుదేశం పార్టీలో చేరుతున్న జయసుధ