రాష్ట్రీయం

ఇదీ ఇసుక విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా సంఘాల అజమాయిషీలో ఇసుక వేలం పద్ధతికి ప్రభుత్వం స్వస్తి పలికింది. సరికొత్తగా ఇసుక రీచ్ వేలానికి రంగం సిద్ధం చేసింది. మూడు దశల్లో ఇసుక రేవుల వేలంపాట నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్యూబిక్ మీటర్‌కు 550 రూపాయిలు మించకుండా విక్రయాలు చేయనుంది. 550 రూపాయిల లోపు ఉండేలా విక్రయించాలని, అలాంటివారే ఈ-బిడ్డింగ్‌లో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏడాది కాలానికి ఇసుక రేవుల వేలం నిర్వహిస్తారు. ఈ-బిడ్డింగ్ రూపురేఖలు, వేలం పాట, ఇసుక రీచ్‌ల గుర్తింపు, ఫ్లయింగ్ స్క్వాడ్‌ల ఏర్పాటు, జాయింట్ ఇన్‌స్పెక్షన్ బృందాల నియామకం, జిల్లాస్థాయి ఇసుక వేలం పాటల కమిటీ, రాష్టస్థ్రాయి కమిటీల నియామకం తదితర వివరాలతో ప్రభుత్వం సమగ్ర ఉత్తర్వులను జారీ చేసింది. కొత్త ఇసుక విధానం రాష్ట్రంలో ఫిబ్రవరి 1నుంచి అమల్లోకి రానుంది. ఈ-టెండర్ విధానం ద్వారా ఇసుక రీచ్‌లను వేలం వేసేందుకు తగిన మార్గదర్శక సూత్రాలను కూడా జారీ చేసింది. రానున్న రోజుల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇసుక రీచ్‌ల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2014 ఆగస్టు 28న ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక వేలం పాటల బాధ్యతను డ్వాక్రా మహిళా సంఘాలకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజకీయాలకు అతీతంగా నిజాయితీగా నిర్వహించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నా, జిల్లాస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు డ్వాక్రా సంఘాలపై వత్తిడి తీసుకురావడం, ఎంతోకొంత అక్రమాలకు పాల్పడటం జరుగుతోందని గుర్తించిన ప్రభుత్వం కలెక్టర్లను, జిల్లాస్థాయి ల్యాండ్ కమిటీల చైర్మన్‌లను నియమించి వారి ద్వారా ఈ-ప్రక్రియ జరిగేలా చర్యలు చేపట్టినా అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది. ఇసుక వేలం ద్వారా పెద్దఎత్తున ఆదాయం రాబట్టగలిగినా, అక్రమాలను మాత్రం ఆపలేకపోయింది. దాంతో గత ఏడాది డిసెంబర్ 2న జీవో 154 జారీ చేస్తూ ఇసుక వేలం బాధ్యతను సెర్ప్‌ల నుంచి తప్పించి గనుల శాఖకు అప్పగించింది. ఇసుక వేలం ద్వారా 4023 డ్వాక్రా గ్రూప్‌లకు పనికల్పించడంతో పాటు వారి ఆర్ధిక స్థిరత్వానికి అది ఎంతో దోహదపడినా లోపాలు పెద్దఎత్తున ఉన్నట్టు ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ నివేదించింది. కమిటీలో యనమల రామకృష్ణుడితోపాటు జల వనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కార్మిక మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, గనుల మంత్రి పీతల సుజాత ఉన్నారు. ఈక్రమంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. తాజాగా ఇసుక వేలం ఈ-టెండరింగ్ విధానంలో చేపట్టాలని నిర్ణయించింది. పర్యావరణ అనుమతులు ఉన్న 120 ఇసుక రీచ్‌లకు తొలిదశలో వేలం వేయనున్నారు. మిగిలిన వాటిని గుర్తించి, అవసరమైన చేర్పులు, మార్పులు చేసుకుంటూ వరుసగా జిల్లాల వారీ ఈ-టెండర్లు ఇస్తారు. ఇందుకోసం జాయింట్ కలెక్టర్ల అధ్యక్షతన 10మందితో కూడిన జిల్లా కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లా పరిషత్ సిఇఓ, ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్, నీటిపారుదల శాఖ ఇఇ, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇఇ, జిల్లా పంచాయతీ అధికారి, భూగర్భ జలవనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్, ఆర్డీవో, గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌లు ఇందులో సభ్యులుగా ఉంటారు.
టెండర్లన్నీ ఎంఎస్‌టిసిఇకామర్స్ డాట్ కామ్ అనే వెబ్‌సైట్‌లో ఉంచేలా చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రెండు లక్షల వరకూ జరిమానా విధించేలా నిర్ణయించారు. నిర్దేశిత నిబంధనలకు మించి ఇసుక తవ్వినట్టయితే ప్రతి క్యూబిక్ మీటర్‌కు రెండు వేల రూపాయిల జరిమానా ఉంటుంది. అయితే ప్రభుత్వ పనులకు మాత్రం నామినేషన్ పద్ధతిన కాంట్రాక్టర్లకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇఎండి ఖరారు చేయడం, కనీస బిడ్ మొత్తాన్ని నిర్ణయించడం, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, ఇతర అంశాలు అన్నింటినీ జిల్లాస్థాయి ఇసుక కమిటీలే పర్యవేక్షిస్తాయి. కాగా రాష్టస్థ్రాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అధ్యక్షతన కమిటీని నియమించారు. కమిటీలో సిఎస్‌తోపాటు గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఐసిఎడి ప్రిన్సిపల్ సెక్రటరీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి, డిజిపి, గ్రామీణాభివృద్ధిశాఖ, రవాణా శాఖ కమిషనర్లు, భూగర్భ జలాల శాఖ సంచాలకుడు, ఐదుగురు చీఫ్ ఇంజనీర్లతోపాటు గనుల శాఖ సంచాలకుడు సభ్యులుగా ఉంటారు.88