రాష్ట్రీయం

మరింత వేగంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఇంతకాలం భూసేకరణ, భూమి చదును, భూమి పూజ, శంకుస్థాపన, తాత్కాలిక రోడ్ల నిర్మాణం, భూ సర్వే, గ్రామకంఠాల గుర్తింపు, సరిహద్దులు, క్యాపిటల్ రీజియన్ మాస్టర్ ప్లాన్, సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్, వౌలిక సదుపాయాలు వసతుల కల్పన అంశాలపై దృష్టిపెట్టిన ప్రభుత్వం, తాజాగా మరో అడుగు ముందుకేసింది. ప్రతి అంశానికీ కన్సల్టెంట్ల నియామకానికి అంతర్జాతీయ బిడ్డింగ్‌లను ప్రారంభించింది. పనిలో పనిగా తాత్కాలిక సచివాలయానికి సైతం టెండర్లను పిలిచింది. టెండర్ల దాఖలుకు 21 రోజుల గడువు నిర్ధారించింది. గడవు పూరె్తైన ఐదు రోజుల్లో టెండర్లను ఖరారు చేస్తారు. నాలుగు నెలల్లో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. సీడ్ క్యాపిటల్ పరిధిలోని రైతులకు సమీపంలోనే భూములు ఇవ్వాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. ఇంకోపక్క రాజధాని ముసాయిదా ప్రణాళికలపై ప్రజల నుండి 25వరకూ అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత, దానిని ఖరారు చేసి తుది ప్రణాళికను ప్రకటించనుంది. అంతలోగా వివిధ పనులకు కన్సల్టెంట్లను ఆహ్వానిస్తోంది. విజయవాడ నుంచి వ్యవహారాలు కొనసాగిస్తున్న సిఆర్‌డిఎ తన కార్యాలయాన్ని తుళ్లూరులోనూ ఏర్పాటు చేయదలచింది. ఇందుకు టెండర్లను ఆహ్వానించింది. ఈనెల 20నాటికి టెండర్లు పిలుస్తారు. అమరావతికి గ్రీన్ కన్సల్టెంట్ నియామకానికి మరో టెండర్‌ను ఆహ్వానించారు. అందుకు ప్రభుత్వం ఈనెల 27 వరకూ గడువిచ్చింది. జల రవాణా, జలాశయాల నిర్వహణకు బ్లూ కన్సల్టెంట్లను ఆహ్వానించింది. ఇందుకోసం 23 వరకూ గడువిచ్చింది. స్మార్టు ఇంటిగ్రేటెడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్ , అమరావతి రాజధాని నిర్మాణానికి తొలి దశ వౌలిక సదుపాయాల కల్పనకు కన్సల్టెంట్ల నియామకానికి మరో టెండర్‌ను ప్రభుత్వం ఆహ్వానించింది. అందుకు జనవరి 22 వరకూ గడువిచ్చింది. తుళ్లూరులో 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణం మేరకు కార్యాలయ భవనానికి సిఆర్‌డిఎ టెండర్లు పిలిచింది. భవనాన్ని మూడేళ్లపాటు లీజులో ఉంచనున్నట్టు కూడా పేర్కొంది.
అమరావతిలో 217 చదరపు కిలోమీటర్లు పరిధిలో ల్యాండ్ స్కేప్, హరితవనాల అభివృద్ధి, రివర్‌ఫ్రంట్ నగరాల అభివృద్ధి, పట్టణాభివృద్ధి వౌలిక సూత్రాలు అమలుచేస్తూ సమగ్ర ప్రణాళికను రూపొందించడానికి గ్రీన్ కన్సల్టెంట్లను ఆహ్వానించారు. ఆరు నుండి 12 నెలల్లో ప్రణాళిక, వ్యయం, నిధుల సమీకరణ, నిపుణుల గుర్తింపు తదితర బాధ్యతలను కూడా కన్సల్టెంట్లే చూడాల్సి ఉంటుంది.