రాష్ట్రీయం

ఇమడలేక పోతున్నా! ఎంపి రాయపాటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, జనవరి 14: నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వినుకొండ, మాచర్ల, గురజాల నియోజకవర్గాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయని, రోడ్లు సరిగాలేవని, ప్రజలకు తాగడానికి నీరు లేదని నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు అన్నారు. ప్రత్తిపాడు మండలంలోని పెదగొట్టిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమానికి ఎంపి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు తాగునీరు అందించడానికి 1120 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ పథకానికి ప్రతిపాదనలు తయారు చేయించి సిఎం చంద్రబాబునాయుడును కలిస్తే నిధులు లేవన్నారన్నారు. ఇటీవల తాను గుంటూరులోని తన నివాసంలో ‘వామపక్ష నేతలకు విందు ఇస్తే సిఎం గారు ఆగ్రహం వ్యక్తం చేశారు... ఇక్కడ ఇమడలేకపోతున్నా’నని రాయపాటి అంటూనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రోజుకు 18 గంటలు కష్టపడుతున్నారని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ విధంగా కష్టపడితే స్వర్ణాంధ్ర సాధ్యపడుతుందని ఎంపి పేర్కొన్నారు.