రాష్ట్రీయం

అభివృద్ధికి ఏపి చిరునామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 14 : ఆంధ్రరాష్ట్రం వచ్చే సంక్రాంతి నాటికి అన్ని రంగాల్లో పరిపూర్ణమైన అభివృద్ధి సాధించాలని తాను కాంక్షిస్తున్నానని అభివృద్ధికి రాష్ట్రం చిరునామా కానున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన గురువారం సాయంత్రం విజయవాడనుంచి రేణిగుంటకు విమానంలో చేరుకున్నారు. అక్కడి నుండి కారులో బయలుదేరి మంగళం ప్రాంతంలో మానస సరోవర్ ప్రీమియర్ గ్రూప్స్ నిర్మించిన హోటల్‌ను, ఫుడ్ ఫెస్టివల్‌ను సిఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వంటల ప్రదర్శనను ఆయన తిలకించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను కూడా వీక్షించారు. పిల్లలకు స్వీట్లు పంచి పెట్టారు. హరిదాసు తలపై ఉన్న కుండలో బియ్యం పోసి సంబరాలను ఆస్వాదించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. వైజాగ్‌లో భాగస్వామ్య సదస్సులో 5 లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకువచ్చారన్నారు. దీంతో అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ చిరునామా కానుందన్నారు. వారసత్వంగా వస్తున్న సాంప్రదాయలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కూచిపూడి కళను కాపాడుకోవాలని ఇందుకు ప్రతి ఇంటి నుంచి ఓ కూచిపూడి కళాకారిణి తయారు కావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. తిరుపతి, నెల్లూరు, చెన్నైలను ప్రధాన పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిదిద్దుతామన్నారు. మూడు విమానాశ్రయాలు, మూడు పోర్టులు కూడా రానున్నాయన్నారు. నెల్లూరు జిల్లా కృష్ణ పట్నంను ఒక టౌన్ షిప్‌గా ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరు, చెన్నై కారిడార్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. ఏర్పేడు, విశాఖపట్నం, చెన్నై మరో పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి పరచుచున్నామని, ఇందుకు ఏషియన్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో ఈ కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిచి వాటిపై వచ్చే నిధులు ఆ ప్రాంత అభివృద్ధి వెచ్చిస్తామన్నారు. ప్రతి పేదవాడు సంతోషంగా ఉంటేనే తిరిగి శ్రమించగలుగుతాడని, అందుకే సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్‌మస్ కానుకలను తమ ప్రభుత్వం అందించిందన్నారు. ఆర్థిక అసమానతలను తగ్గించాలన్నదే తన ప్రయత్నమన్నారు. కాగా సంక్రాంతి సంబరాలకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం వరకు నారావారి పల్లెలో గడుపుతారు.

చిత్రం... హరిదాసు భిక్షపాత్రలో బియ్యంపోస్తున్న ముఖ్యమంత్రి