రాష్ట్రీయం

హోదా లేదు.. ప్యాకేజీయే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 14: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందంటూ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ప్రతి రోజూ చెబుతున్నా, పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. క్షేత్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేయించిన కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని తేల్చినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రాష్ట్రంలో పరిస్థితులపై అధ్యయనానికి కడప జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని క్షేత్రస్థాయిలో పలువురు నాయకులు, ప్రజలు, సంస్థలు, ఎన్‌జిఓలు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి నివేదికను ప్రధాని కార్యాలయానికి అందించారు. అంతకుముందు నుండి పట్టణాభివృద్ధి శాఖ, గ్రామీణాభివృద్ధిశాఖ, హోం శాఖల నుండి నివేదికలను తెప్పించుకున్న కేంద్రం రానున్న రోజుల్లో ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు ప్యాకేజీకి సంబంధించి ముసాయిదాను రూపొందించాలని ప్రధాని కార్యాలయం ఆదేశించినట్టు తెలిసింది. ప్రత్యేక హోదా దక్కితే ఇటు పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి, పెట్టుబడులు పెట్టేవారికి ఎంతో అనుకూలంగా ఉండటమే గాక, పెద్ద సంఖ్యలో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే వీలుంది. వివిధ పన్నుల్లో రాయితీలు, పరిశ్రమలకు సంబంధించి దిగుబడులలో మినహాయింపులు, ఎగుమతుల్లో మినహాయింపులు, విద్యుత్ రాయితీ, స్థానిక పన్నులు, కేంద్ర పన్నుల్లో మినహాయింపులు దక్కుతాయి. ప్రత్యేక హోదా వల్ల దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయల మేర రాష్ట్రానికి వివిధ రూపాల్లో నిధుల రాయితీలు దక్కుతాయని అంచనా వేస్తుండగా, ప్రత్యేక ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి దక్కే నిధులు దాదాపు లక్ష నుండి లక్షన్నర కోట్లు మాత్రమే ఉంటాయి. అయితే కేంద్రం వాదన ఇందుకు భిన్నంగా ఉంది. హోదాకు మించి ప్రత్యేక ప్యాకేజీ వల్ల లాభం ఉంటుందని కేంద్ర మంత్రులు చెబుతున్నారు. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్‌లదీ ఇదే మాట.ప్రత్యేక హోదా దక్కని పక్షంలో అంతకుమించి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్రానికి లాభం జరుగుతుందని వారంటున్నారు. ఈ మేరకు కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో ఆంధ్రాకు ప్రత్యేక ఆర్ధిక సాయం అందించే ప్రతిపాదనను ప్రధాని కార్యాలయం చేసినట్టు సమాచారం. బడ్జెట్‌లో ఆంధ్రాకు మరో మూడు వేల కోట్ల రూపాయలను కేటాయించేలా ప్రతిపాదిస్తున్నట్టు తెలిసింది.