రాష్ట్రీయం

13 జిల్లాల్లో ఇంటర్వెన్షన్ సెంటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: ఆంధ్రప్రదేశ్‌లో రాష్టవ్య్రాప్తంగా 13 జిల్లాల్లో 14 నవజాత శిశు కేంద్రాలు (ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లు) నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి కేంద్రానికి కోటి ఆరు లక్షలు చొప్పున 14 కేంద్రాలకు 14.84 కోట్లు విడుదల చేసింది. ఈ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మిస్తారు. కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద వీటిని నిర్మిస్తారు. పనులను ఎపి మెడికల్ సర్వీసెస్ వౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు అప్పగించారు. పనుల పర్యవేక్షణను నేషనల్ హెల్త్ మిషన్ ఎండికి, ఆరోగ్య శాఖ కమిషనర్‌కు అప్పగించినట్టు వైద్య శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు.

‘భోగాపురం’అభివృద్ధి సంస్థ ఏర్పాటు

హైదరాబాద్, జనవరి 13: భోగాపురంలో రాష్ట్రప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌ఫోర్టు పనులను వేగవంతం చేసేందుకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కంపెనీ లిమిటెడ్ పేరిట సంస్థను ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ భోగాపురం ఎయిరోట్రోపోలిస్ ప్రాజెక్టు వ్యవహారాలను చూస్తుంది. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో పాటు అంతర్జాతీయ ఏవియేషన్ అకాడమిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ ఆకాడమిలోనే విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవరాలింగ్ తదితర సాంకేతిక వ్యవహారాలను సైతం పర్యవేక్షిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

విసి పదవులకు 1289 దరఖాస్తులు
హైదరాబాద్, జనవరి 13: తెలంగాణలోని 9 విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ పదవులకు 330 మంది దరఖాస్తు చేశారు. శుక్రవారం వరకూ దరఖాస్తుల స్వీకరణ గడువు ఉన్నా, పోస్టులో వచ్చిన దరఖాస్తులను సోమవారం వరకూ అధికారులు స్వీకరించినట్టు తెలిసింది. ఒకొక్కరు 5 నుండి 8 దరఖాస్తులు చేయడంతో వాటి సంఖ్య 1289కు పెరిగింది. మొత్తం దరఖాస్తులపై ఒక స్పష్టత వచ్చినట్టు తెలిసింది.
అత్యధికంగా మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి 182 దరఖాస్తులు వచ్చాయి, అదే సంఖ్యలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ యూనివర్శిటీకి 182 దరఖాస్తులు వచ్చాయి. పాలమూరు విశ్వవిద్యాలయానికి 176 దరఖాస్తులు, శాతవాహన విశ్వవిద్యాలయానికి 165, తెలంగాణ విశ్వవిద్యాలయానికి 162 దరఖాస్తులు వచ్చాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 145, కాకతీయ విశ్వవిద్యాలయానికి 128, జెఎన్‌టియు హైదరాబాద్‌కు 84, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి 48 దరఖాస్తులు వచ్చాయని విశ్వసనీయంగా తెలిసింది. బుధవారం నుండి ఒక్కో దరఖాస్తు పరిశీలన మొదలైంది. వారం పది రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసినా, నియామకాలు మాత్రం జిహెచ్ ఎంసి ఎన్నికల ఫలితాల తర్వాతనే ఉంటుందని ఉన్నత విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.